Take a fresh look at your lifestyle.

మత విధ్వంసక చర్యలకు బిజెపి కుట్ర

  • విద్వేషపు విత్తనాలకు తెలంగాణలో చోటు లేదు
  • శ్రీదర్‌ ‌రెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా బిజెపిపై మండిపడ్డ మంత్రి •కెటిఆర్‌

‌కేంద్రం సామాన్యుడికి చేసిందేముందని మంత్రి కేటీఆర్‌ ‌మరోసారి విరుచుకుపడ్డారు. నోట్ల రద్దుతో ఆర్థిక అభివృద్ధి ఆగిపోయిందని చెప్పారు. కేటీఆర్‌ ‌సమక్షంలో బీజేపీ నేత రావుల శ్రీధర్‌ ‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన  సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేసిన అభివృద్ధిని లెక్కలతో సహా చూపిస్తామని సవాల్‌ ‌విసిరారు. ఆరేళ్లలో రూ.2.72 లక్షల కోట్ల పన్నులు కేంద్రానికి ఇచ్చామని, తెలంగాణకు వొచ్చింది రూ.1,43,329 కోట్లేనని తెలిపారు. అన్ని పథకాలకు తమ డబ్బులే అని బీజేపీ నేతలు చెబుతున్నారని, బీజేపీ నేతల ఇంట్లో డబ్బులు దొరికితే మాత్రం తమవి కావంటున్నారని మండిపడ్డారు. ఆరేళ్లలో ఏ ఎన్నికలు వొచ్చినా టీఆర్‌ఎస్‌దే విజయమని కేటీఆర్‌ ‌ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. అయినా విపక్షాలు తీరు మార్చుకోవడం లేదని అన్నారు. విద్వేషపు విత్తనాలకు తెలంగాణలో చోటు లేదన్నారు.

ప్రతి మతానికి తెలంగాణలో చోటు ఉంటుందని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ధర్మంకాదని, మతం తమకు ఎప్పటికి ప్రచారాస్త్రం కాదని కేటీఆర్‌ అన్నారు. ‘తెలంగాణ రాష్ట్రంలో కొందరు మతం పేరుతో చిచ్చు పెడుతున్నారు. తెలంగాణ మట్టిలో పరమత సహనం ఉంది. విద్వేషపు విత్తనాలకు తెలంగాణలో స్థానం లేదు. విద్వేషాలను రెచ్చగొడితే ప్రజలే బుద్ధి చెప్తారు’ అని కెటిఆర్‌ ‌హెచ్చరించారు.  ఎవరి ధర్మాన్ని వారు ఆచరిస్తారు. కానీ ఒకరిని చిన్నగా చేసి చూపించకూడదు. అలా చేయడం మంచిది కాదు. మతం ప్రచార అస్త్రం కాదు.. దేశభక్తి ప్రదర్శన అస్త్రమూ కాదు.. దేశభక్తి మనకే ఎక్కువ ఉందని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని సమస్యలు తొలగిపోయాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాలకు సమస్యలేమీ కనబడకపోవడంతో.. మతం, కులం పేరిట విధ్వంసక చర్యలకు పాల్పడేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

Leave a Reply