Take a fresh look at your lifestyle.

నయీమ్‌ ఆస్తులను మింగిన ఘనుడు కెసిఆర్‌

  • లాయర్‌ ‌దంపతుల హత్యలో అధికార పార్టీ హస్తం
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికి ఓటేసి గెలిపించాలి
  • భువనగిరి సభలో బండి సంజయ్‌ ‌పిలుపు

కేసీఆర్‌ ‌దృష్టిలో ఎమ్మెల్సీ అంటే మెంబర్‌ ఆఫ్‌ ‌లిక్కర్‌ ‌కౌన్సిల్‌ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. నయీమ్‌ అ‌క్రమ ఆస్తులు ఎక్కడ పోయాయన్నారు. అన్నీ కక్కిస్తాం అని ఇప్పుడు నోరు మెదపడం లేదని అన్నారు. లక్ష్మీ నరసింహ స్వామి పక్కన కేసీఆర్‌ ‌ఫోటో పెట్టాడో అప్పటి నుంచి ఆయన డౌన్‌ ‌ఫాల్‌ ‌స్టార్ట్ అయ్యిందని అన్నారు.గురువారం యాదాద్రి-భువనగిరిలో  నిర్వహించిన నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ ‌పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో బండి సంజయ్‌, అభ్యర్థి ప్రేమందర్‌రెడ్డి, బీజేపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఈసందర్భంగా బండి సంజయ్‌ ‌మాట్లాడుతూ..పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కి ఓటు వేస్తే చెప్పుకు ఓటు వేసినట్లేనని తెలిపారు.

సీఎం పదవిని కేసీఆర్‌ ‌చెప్పుతో పోల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నయీమ్‌ అ‌క్రమ ఆస్తులు మెక్కిన కేసీఆర్‌ ‌చేత అన్నీ కక్కిస్తామని హెచ్చరించారు. యాద్రాది లక్ష్మీనర్సింహాస్వామి పక్కన కేసీఆర్‌ ‌ఫొటో ఎప్పుడూ పెట్టమన్నాడో, అప్పటి నుంచే ఆయన డౌన్‌ఫాల్‌ ‌స్టార్ట్ అయ్యిందని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్నారు.  న్యాయవాది వామనరావు దంపతుల హత్యలో టీఆర్‌ఎస్‌ ‌నాయకుల హస్తం ఉందన్నారు.  ఇప్పటివరకు సీఎం స్పందించక పోవడం సిగ్గుచేటని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి పేరుతో ఒకకో నిరుద్యోగికి 70 వేలు బాకీ ఉందని చెప్పారు.

ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకమని అంటూ బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌మధ్య ఓ యుద్ధంలా జరిగే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తేనే అన్ని సమస్యలకు పరిష్కార మవుతాయని బండి సంజయ్‌  ‌తెలిపారు. ప్రేమేందర్‌ ‌రెడ్డిని గెలిపించాలి…భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. పిఆర్‌వో విజయ్‌ ‌కుమార్‌ ‌ని సస్పెండ్‌ ‌చేశారని ఇన్ని రోజులకు అవినీతిపరుడని గుర్తుకు వచ్చిందా అని అన్నారు. 90 శాతం కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌కెసిఆర్‌ ‌కనుక్కొన్నాడని టి ఛానల్‌ ‌లో చెబుతున్నారని అన్నారు.  ఫీజు రీ ఎంబర్సమెంటు బ్రోకర్‌ ‌పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి అని పేర్కొన్న ఆయన ఈ ఎన్నికలు బీజేపీ , టీఆర్‌ఎస్‌ ‌మధ్య ఓ యుద్ధం అని అన్నారు. ఉద్యోగుల పీఆర్సీ మాట ఎత్తడం లేదు… కలెక్టరేట్‌ ‌వద్ద బీజేపీ ధర్నాలు, ఉద్యమం చేశామని అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్‌ ‌లు ఇవ్వాలని బీజేపీ యువ మోర్చా ఉద్యమాలు మేము చేశాం..లాఠీ దెబ్బలు తిన్నామని అన్నారు. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి  పేరుతో 70 వేలు బాకీ ఉందని వి• కోసం మా కార్యకర్తలు జైలుకు వెళ్తున్నారని అన్నారు.

దుబ్బాకలో, జి హెచ్‌ ఎం ‌సి ఎన్నికల్లో ఏమి జరిగిందో అందరికీ తెలుసని అన్నారు. మేధావి వర్గం ఓటు వేస్తున్నారు..టి ఆర్‌ ఎస్‌ ‌కి ఓటు వేస్తే చెప్పుకు ఓటు వేసినట్లేనని అన్నారు. అయోధ్యలో రామ మందిరం అద్భుతంగా నిర్మాణం కాబోతోంది…దీని కోసం 4 లక్షల మంది  కరసేవకులు ప్రాణ త్యాగం చేశారని సంజయ్‌ ‌గుర్తు చేశారు. ఈ దేశం కోసం, ధర్మం కోసం, పోరాడుతుంది…త్యాగాలు చేస్తుంది బిజెపి పార్టీ అని అన్నారు. 370 ఆర్టికల్‌ ‌రద్దు చేసి, కాశ్మీర్‌ ‌లో జెండా ఎగురవేశాం అని అన్నారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు మెడకాయ వి•ద తలకాయ ఉందా ? కేసీఆర్‌ ‌కి విద్యావ్యవస్థని చిన్నాభిన్నం చేశారు అని ఆయన అన్నారు. బీజేపీ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని, అన్ని సమస్యల పరిష్కారం కోసం ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకం బీజేపీని గెలిపించాలని అన్నారు.

Leave a Reply