- హైదరాబాద్ వాతావరణం చెడగొడుతున్నారు
- ఏఐసీసీ కార్యదర్శి సంపత్
- రాష్ట్రంలో అరాచక పాలన : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
స్వార్ధ, నీచమైన రాజకీయాల కోసం ఎన్నికల వాతావరణంను బీజేపీ, టిఆర్ఎస్ పార్టీ లు కలుషితం చేస్తున్నాయని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విమర్శించారు. ఒక కిరాక్ గాడు, ఒక కిరికీర్ గాడు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నోరు అదుపులో పెట్టుకోండని, విచ్చలవిడిగా చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బండి సంజయ్ కిరాక్ గాడని, కౌన్సిలర్‌కు తక్కువ, మున్సిపల్ చైర్మన్‌కు ఎక్కువని ఎద్దేవా చేశారు. బండి సంజయ్‌కి సిగ్గుశరం లేదని అన్నారు. పద్ధతిగా మాట్లాడు, దుబ్బాకలో గెలవగానే చెంగ చెంగ ఎగురుతున్నావ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతం, కులం పేరుతో విడగొట్టేలా బండి సంజయ్ చూస్తున్నారని ఆరోపించారు. ఇక కిరికిరి రావు..కేటీఆర్ జిహెచ్ఎంసి గురించి చెప్పకుండా డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడతాడని, కేటీఆర్‌వి బేవకూఫ్ మాటలని, కుట్రలకు సంబంధించిన అన్ని ఆధారాలు, వివరాలు ఉన్నప్పుడు ఎందుకు కేటీఆర్ చర్యలు తీసుకోలే•దని ప్రశ్నించారు. జిహెచ్ఎంసిలో గెలవకపోతే నరేంద్రమోదీ ప్రధాని పదవి పోదు, కేసీఆర్ సీఎం అధికారం ఏమిపోదని, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు.
రాష్ట్రంలో అరాచక పాలన : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్మించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాచారం డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి మెడల జ్యోతి మల్లికార్జున్‌కు మద్దతుగా జీవన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెరాస పాలనలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని ఆయన విమర్శించారు. నాచారం డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి మెడల జ్యోతి మల్లికార్జున్ మాట్లాడుతూ తనను గెలిపిస్తే ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతానని అన్నారు. పటేల్ కుంట చెరువు నిండా చెత్త కూరుకుపోయిందని, దాని ద్వారా ఈ పరిసర ప్రాంతాల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పటేల్కుంటను మినీ ట్యాంక్ బండ్‌గా చేసి, మురుగు నీరు లేకుండా చేస్తానని కాలనీ వాసులకు జ్యోతి హా ఇచ్చారు.