- బీజేపీని అన్ని రాష్ట్రాల్లో గెలిపించడానికే అసదుద్దీన్ ప్రయత్నం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీజేపీని అన్ని రాష్ట్రాల్లో గెలిపించడానికే అసదుద్దీన్ ప్రయత్నం చేస్తున్నారని వెస్ట్ బెంగాల్ ఎంఐఎం అధ్యక్షుడు ఆరోపించారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ..బీజేపీ, ఎంఐఎం రెండు ఒక్కటేనన్నారు. బండి సంజయ్‌కి హైదరాబాద్ ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో తెలుసా? అని ప్రశించారు. బండి సంజయ్‌కి హైదరాబాద్‌కు ఏం సంబంధం అన్నారు ఉత్తమ్. బీజేపీ వోట్ల కోసం ఎంఐఎం, ఎంఐఎం వోట్ల కోసం బీజేపీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.
బుద్ధి లేకుండా వీళ్ల మాటలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కష్టసుఖాల్లో ప్రజలకు తోడుగా ఉంది. హైదరాబాద్ ప్రజలు గమనించాలి. బండి సంజయ్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారు. కౌన్సిలర్ స్థాయి మాటలు బండి సంజయ్ మానాలి. పీవీ, ఎన్టీఆర్, వైఎస్ ఆర్ గురించి మాట్లాడడానికి వాడెవడు అని అక్బరుద్దీన్‌పై ఉత్తమ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం పెట్టిన ప్రతి బిల్లును కేసీఆర్ మద్దతు పలికారు. రాజకీయ లబ్ది కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మత సామరస్యం కోసం పాటుపడాలి. ఇన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఎన్నికల సంఘం పార్థసారథి చర్యలు తీసుకోవడం లేదు అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.