Take a fresh look at your lifestyle.

హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ ‌కుమ్మక్కు

 • అక్కడ డవ్మి అభ్యర్థిని పెట్టిన కాంగ్రెస్‌ ‌పార్టీ
 • అందుకే రేవంత్‌ ‌రెడ్డి అక్కడికి వెళ్లడం లేదు
 • సాగర్‌లో జానానే ఓడించాం..ఈటల మాకో లెక్క కాదు
 • అవసరాన్ని బట్టి  జాతీయరాజకీయాల్లోకి కెసిఆర్‌
 • ‌దేశానికి దిక్సూచిగా రాష్ట్ర పథకాలు
 • కాంగ్రెస్‌లో వాయిస్‌ ‌లేని ఓ మంచినేత భట్టి
 • టిఆర్‌ఎస్‌ది 20 ఏళ్ల అప్రతిహత జైత్రయాత్ర
 • ఎన్టీఆర్‌ ‌టిడిపి తరవాత టిఆర్‌ఎస్‌ ‌మాత్రమే మనగలిగింది
 • వరంగల్‌ ‌సభతో మరోసారి టిఆర్‌ఎస్‌ ‌సత్తా చాటుతాం
 • నవంబర్‌ 15‌న ప్రజలు ప్రయాణాలు మానుకోవాలి
 • వి•డియాతో చిట్‌చాట్‌లో టిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌

హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ ‌కుమ్మక్కయ్యాయని అయినా టీఆర్‌ఎస్‌ ‌పార్టీ కచ్చితంగా గెలుస్తుందని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ అన్నారు. జానారెడ్డి లాంటి వారినే సాగర్‌లో ఓడించామని ఇక ఈటల రాజేందర్‌ ఎం‌త అని అన్నారు. ఈటల కోసం కాంగ్రెస్‌ ‌డవ్మి అభ్యర్థిని నిలబెట్టిందని మండిపడ్డారు. ఇదే సందర్భంలో అవసరమైనప్పుడు కెసిఆర్‌ ‌జాతీయ రాజకీయాల్లోకి వెళతారని రాష్ట్ర రాజకీయాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఉదయం వి•డియాతో కేటీఆర్‌ ‌చిట్‌ ‌చాట్‌ ‌చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌ ‌రెడ్డికి దమ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్‌ ‌తెచ్చుకోవాలని సవాల్‌ ‌చేశారు. కొంతకాలం తర్వాత ఈటలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారని, మాజీ ఎంపీ వివేక్‌ ‌కూడా కాంగ్రెస్‌లోకి వెళ్తారని వినిపిస్తుందని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. నాగార్జున సాగర్‌లో జానా రెడ్డినే వోడించాం…ఈటల రాజేందర్‌ అం‌తకన్నా పెద్ద లీడరా? అని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.

బీజేపీని ఈటల సొంతం చేసుకోవడం లేదని, జై ఈటల అంటున్నారు తప్ప జై శ్రీరామ్‌ అని ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు. రాజేందర్‌ ఎం‌దుకు రాజీనామా చేశారో ఇంత వరకు చెప్పడం లేదు. గెలిస్తే ఏం చేస్తాడో చెప్పకుండా.. వేరే విషయాలు మాట్లాడుతున్నారు. హుజూరాబాద్‌లో ఈటల, రేవంత్‌ ‌కుమ్మక్కయ్యారు. హుజూరాబాద్‌లో కావాలనే కాంగ్రెస్‌ ‌పార్టీ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపలేదు. పీసీసీ అధ్యక్షుడు అయ్యాక.. ఇది తొలి ఉప ఎన్నిక. తనను తాను నిరూపించుకోవాలి కదా..? ఎందుకు హుజూరాబాద్‌కు వెళ్లడం లేదని రేవంత్‌ను ఉద్దేశించి కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న సన్నాసి ఎందుకు రాజకీయ సన్యాసం తీసుకోలేదన్నారు. సమయం, సందర్భాన్ని బట్టి కేసీఆర్‌ ‌జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని కేటీఆర్‌ ‌తెలిపారు.

కేసీఆర్‌కు ఉప రాష్ట్రపతి పదవి అనేది వాట్సాప్‌ ‌యూనివర్సిటీ ప్రచారం అని పేర్కొన్నారు. తాను వేరే వారిలాగా చిలుక జోస్యం చెప్పలేనని అన్నారు. తాను హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లడం లేదని, నాగార్జున సాగర్‌, ‌దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లలేదని తెలిపారు. హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ ‌ప్రచారం షెడ్యూల్‌ ‌ఖరారు కాలేదన్నారు. తెలంగాణ పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయి. కేసీఆర్‌ ‌విజనరీ  నేత..మిగతా పార్టీల నేతలు టెలివిజనరీలు. రేవంత్‌ ‌రెడ్డి చిలక జోస్యం చెప్పుకుంటే మంచిది. కాంగ్రెస్‌ ‌పార్టీలో భట్టి విక్రమార్క ఒక్కరే మంచి వ్యక్తి. కానీ కాంగ్రెస్‌లో భట్టిది నడవట్లేదు..గట్టి అక్రమార్కులదే నడుస్తుందని కేటీఆర్‌ అన్నారు. ‘టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధ్యక్ష పదవికి కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ 10 నామినేషన్లు దాఖలు అయ్యాయన్నారు. ద్విదశాబ్ది వేడుకకు సన్నాహకాలు జరుగుతున్నాయి.

విజయగర్జన సభకు భారీగా ఆర్టీసీ బస్సులు తీసుకుంటాం. నవంబర్‌ 15‌న ప్రజలు ప్రయాణాలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. 20 రోజుల్లో కొవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌ 100 ‌శాతం పూర్తవుతుంది’ అని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. కొరోనాతో పార్టీ కార్యక్రమాలు ఆలస్యంగా జరుగుతున్నాయన్నారు. నవంబర్‌ 15‌న ప్రజలు ప్రయాణాలు పెట్టుకోవద్దని, ఆ రోజు 7 వేల ఆర్టీసీ బస్సులు తీసుకుంటామని, వరంగల్‌ ‌తమకు కలిసొచ్చిన జిల్లా అని.. అక్కడ ఏసభ అయినా విజయవంతమవుతుందని మంత్రి పేర్కొన్నారు. అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాల నిర్మాణం దాదాపు పూర్తయిందన్నారు. త్వరలో అన్ని స్థాయిల నాయకులకు శిక్షణ తరగతులు ప్రారంభిస్తామన్నారు. 6 నుంచి 9 నెలల వరకు శిక్షణ తరగతులు ఉంటాయని, ముందస్తు ఎన్నికల కోసం పార్టీ కార్యక్రమాలు అనుకోవడం తప్పన్నారు. పార్టీగా..ప్రభుత్వంగా సాధించిన విజయాలు నెమరువేసుకుంటామన్నారు. 20 ఏళ్లుగా ఓ పార్టీ మనుగడ సాధించడం చాలా గొప్ప విషయమన్నారు.

1956 తర్వాత ఎన్టీఆర్‌ ‌పెట్టిన టీడీపీ, కేసీఆర్‌ ‌పెట్టిన టిఆర్‌ఎస్‌ ‌పార్టీలు మాత్రమే నిలదొక్కుకున్నాయని మంత్రి కేటీఆర్‌ ఈ ‌సందర్భంగా పేర్కొన్నారు. నవంబర్‌ 15 ‌తర్వాత తమిళనాడుకు వెళ్తామని కేటీఆర్‌ ‌తెలిపారు. డీఎంకే, అన్నాడీఎంకే నిర్మాణాన్ని అధ్యయనం చేస్తామన్నారు. నీట్‌ ‌రద్దుపై స్టాలిన్‌తో 100 శాతం ఏకీభవించలేం. తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌ ‌చదువుతున్నారు. రాష్ట్ర విద్యార్థులకు ఏది మేలైతే..ఆ నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply