Take a fresh look at your lifestyle.

లాయర్‌ ‌జంట హత్య కేసులో..ఏ4 బిట్టు శ్రీను అరెస్ట్

  • పుట్ట మధు మేనల్లుడిగా గుర్తింపు
  • హత్యకు సంబంధంచి దర్యాప్తు ముమ్మరం

న్యాయవాద జంట గట్టు వామన్‌రావు- పీవీ నాగమణి హత్య కేసులో బిట్టు శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశంలో అతడిని విచారిస్తున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే కుంట శ్రీనివాస్‌ను(ఏ1), చిరంజీవిని (ఏ2), అక్కపాక కుమార్‌(ఏ3)‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బిట్టు శ్రీను కూడా పట్టుబడటంతో నలుగురు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా బిట్టు శ్రీను పెద్దపల్లి జిల్లా పరిషత్‌ ‌ఛైర్మన్‌, ‌మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు మేనల్లుడు.

- Advertisement -

వామనరావు దంపతుల హత్యలో భాగంగా రిజిస్ట్రేషన్‌ ‌కాని బ్రీజా కారును, కొబ్బరికాయలు కోసే కత్తులను బిట్టు శ్రీను ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్‌కు సమకూర్చాడు. ఈ క్రమంలో శ్రీను కారు డ్రైవర్‌ ‌చిరంజీవితో కలిసి శ్రీనివాస్‌ ‌నడిరోడ్డుపైనే అడ్వకేట్‌ ‌జంటపై హత్యాకాండకు తెగబడ్డాడు. ఇక సొంత గ్రామం గుంజపడుగులో మృతులతో నిందితులకు నెలకొన్న గొడవలే ఈ ఘటనకు కారణమని పోలీసులు వెల్లడించారు. కుంట శ్రీనివాస్‌ ఇం‌టి నిర్మాణాన్ని వామన్‌రావు అడ్డుకోవడం, అదే విధంగా ఊరిలో నిర్మిస్తున్న దేవాలయం పనులకు అభ్యంతరం తెలపడం, రామాలయ కమిటీ వివాదాల కారణంగా హత్యలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిపారు.

Leave a Reply