- ఖాళీల విషయంలోనూ ఇంత మోసమా..?
- ఉద్యోగాల ప్రకటనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
- నిరుద్యోగ భృతి సంగతి మరిచారా..? : విహెచ్
ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 9 : సీఎం కేసీఆర్ ఆర్భాటం చూస్తే ఆశ్చర్యం వేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ…బిస్వాల్ కమిటీ లక్షా 91 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు చెప్పిందన్నారు. కానీ కేవలం 80 వేల ఉద్యోగాల ప్రకటనతో మరోమారు మోసం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి క్యాలండర్ ఏడాది వెనకబడిందన్నారు. ఎంతోకాలంగా ఎదురుచూపులు చూపి ఇప్పుడు పూర్తిస్థాయిలో ఖాళీలను భర్తీ చేయడంలో వెనకంజ వేశారని అన్నారు. నిరుద్యోగులను ఆత్మహత్యలకు నెట్టి ఇవాళ ఆర్భాటం చేస్తున్నారని విమర్శించారు. అదనపు జిల్లాలతో అదనపు ఉద్యోగాలు ఎందుకు క్రియేట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ఏర్పడే నాటికి ఉన్న ఖాళీలు, రిటైర్‌మెంట్‌తో ఏర్పడ్డ ఖాళీల భర్తీకి ఇంత హంగామా అవసరమా? అన్నారు. కేవలం 13 వేల ఉపాధ్యాయ ఖాళీలకు ఇంత ఆర్భాటమా?.. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. స్థానికత పట్ల చిత్తుశుద్ధి ఉంటే ప్రైవేట్‌లో కూడా స్థానికులకే అవకాశం దక్కేలా చూడాలన్నారు. 80 వేల ఉద్యోగాల భర్తీకి నిర్ణీత కాల వ్యవధి ప్రకటించాలన్నారు. ఉపాధి హావి• ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించిన దుర్మార్గుడు కేసీఆర్ అని, కనీసం టెట్ కూడా ప్రభుత్వం నిర్వహించలేదని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు.
నిరుద్యోగ భృతి సంగతి మరిచారా..? : విహెచ్
నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే సీఎం కేసీఆర్ ఈరోజు ఈ ఉద్యోగ ప్రకటన చేశారని వీహెచ్ వ్యాఖ్యానించారు. ఉద్యోగాల ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని.. కానీ గతంలో హావి• ఇచ్చిన విధంగా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో కొత్తగా 80 వేల ఉద్యోగాల భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఈ అంశంపై స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఒక్క కేసీఆర్ వల్లే రాలేదని..అందరి త్యాగాల ఫలమే రాష్ట్రమని వీహెచ్ అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 3 వల్ల తెలంగాణ వొచ్చిందన్నారు.
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారు కాబట్టే ఈరోజు ఉద్యోగాల ప్రకటన చేశారని వీహెచ్ ఆరోపించారు. వయోపరిమితిపై కాంగ్రెస్ ఎన్నో ఏళ్ల నుండి పోరాడితేనే ఇప్పుడు ప్రభుత్వం 49 సంవత్సరాల వయో పరిమితిని పెంచిందన్నారు. తక్షణమే నిరుద్యోగులకు 3 వేలు నిరుద్యోగ భృతి అందించాలని.. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం చనిపోయిన కుటుంబాలను కూడా కేసీఆర్ ప్రభుత్వం ఆదుకోవాలని హితవు పలికారు.