పిలవని పేరంటమైంది
హఠాత్తు గా ఊడి పడింది
నోటికాడికి వచ్చింది మింగేసింది
మండుటెండలలో మడత పెట్టేసింది
ఉరమని పిడుగై ముంచ్చేసింది
రైతన్నలను ఉసూరు మనిపించింది
ఎప్పుడైనా ఈ వింత
చూసామా అనిపించింది
బ్రహ్మం గారి వాక్కు నిజ మనిపించింది
పంట విరగ పండింది
రేటు బాగుంది
రైతు రాతను మార్చేసింది
అప్పుల సుడిలోంచి బయట
పడేసే మార్గం లేకుండా చేసింది
రతైన్నను చిత్ర వద చేసేసి వెళ్ళిపోయింది
అసరా కానే కాదది
అకారణం గా వచ్చి పడింది
పుట్టెడు దుఃఖంలో ముంచి పోయింది
రుణాలు రద్దు చేయండి
రైతుకు అండగా నిలవండి
మరో పంటకు చేయూత నివ్వండి
– గాదిరాజు రంగ రాజు
8790122275
(అసరా తో దుఃఖం లో కూరుకు పోయిన రైతన్నకు
ఉపశమనం కోసం ..)