Take a fresh look at your lifestyle.

జీవవైవిధ్య తెలంగాణ

“మానవుడు అభివృద్ధి పేరుతో ప్రకృతిని అనేక రకాలుగా ధ్వంసం చేస్తున్నాడు అడవులు నరకడం, రసాయన ఎరువుల అతి వినియోగం, బహుళ అంతస్తుల నిర్మాణాలు, ఖనిజాల కోసం పర్వతాలను తవ్వడం వంటి చర్యలు జీవవైవిధ్యానికి పెను సవాలుగా మారాయి. ఈ చర్యల వల్ల ఆహార భద్రత కు, ఆరోగ్యానికి ముప్పు ఏర్పడింది . ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్యాన్ని కాపాడుకోవలసిన ఆవశ్యకతను గుర్తించిన పలు దేశాలు దీనిపై చర్చలు, సమావేశాలు జరుపుతూనే ఉన్నాయి.2001 నుంచి ఏటా మే 22న ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. ఈసారి ‘‘మేము ప్రకృతి పరిష్కారంలో భాగము ‘‘ అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం ను జరుపుకుంటున్నాయి.”

నేడు అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం

భూగోళం కేవలం మానవాళికి మాత్రమే కాదు సమస్త జీవరాశికి ఆలవాలం. సకల జీవులకు ఆధారమైన భూమిపై జీవ వైవిధ్యం ఒక సహజ ప్రక్రియ.ఒకే పర్యావరణంలో జీవిస్తున్న భిన్నమైన వృక్ష, జంతు జాతులు అన్నిటిని కలిపి జీవవైవిద్యం అంటారు ఇది జాతి, జన్యు ,ఆవరణ వ్యవస్థల పరంగా ఉంటుంది. పెరుగు తున్న జనాభా పట్టణీకరణ పారిశ్రామికీకరణ వల్ల సహజ వనరుల పై తీవ్ర ఒత్తిడి ఏర్పడటంతో పాటు కాలుష్యం పెరిగిపోతుంది. మానవుడు అభివృద్ధి పేరుతో ప్రకృతిని అనేక రకాలుగా ధ్వంసం చేస్తున్నాడు అడవులు నరకడం, రసాయన ఎరువుల అతి వినియోగం, బహుళ అంతస్తుల నిర్మాణాలు, ఖనిజాల కోసం పర్వతాలను తవ్వడం వంటి చర్యలు జీవవైవిధ్యానికి పెను సవాలుగా మారాయి. ఈ చర్యల వల్ల ఆహార భద్రత కు, ఆరోగ్యానికి ముప్పు ఏర్పడింది . ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్యాన్ని కాపాడుకోవలసిన ఆవశ్యకతను గుర్తించిన పలు దేశాలు దీనిపై చర్చలు, సమావేశాలు జరుపుతూనే ఉన్నాయి.2001 నుంచి ఏటా మే 22న ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. ఈసారి ‘‘మేము ప్రకృతి పరిష్కారంలో భాగము ‘‘ అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం ను జరుపుకుంటున్నాయి.

గత ఆరేళ్లుగా తెలంగాణలో చేపట్టిన హరితహారం, మిషన్‌ ‌కాకతీయ ,కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జీవవైవిద్యం వెల్లివిరుస్తుంది. అర్బన్‌ ‌పార్క్ ‌ల నుంచి మొదలుకొని అభయారణ్యాల వరకు, చిన్న చిన్న కుంటల నుంచి పెద్ద లేక్‌ ‌ల వరకు అనేక పక్షులు, జంతు జాతులు వృద్ధి చెందాయి.

అంతరించిపోయే దశలో ఉన్న చిరుత, పెద్దపులి ,అడవి కుక్క, మూషిక జింక ,ఊర పిచ్చుక తదితర వైవిద్య పక్షులు, జంతు జాతుల సంఖ్య గత ఐదేళ్లలో గణనీయంగా పెరిగింది. 150 కిలోమీటర్ల పొడవున తెలంగాణ వ్యాప్తంగా గోదావరి సజీవంగా దర్శనమిస్తూ ఉండడంతో అనేక జీవ జాతులకు విభిన్న రకాల ఔషధ మొక్కలకు ఆలవాలంగా ఉంది.తెలంగాణలో 71 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో మొత్తం 12 రక్షిత అభయారణ్యాలు ఉన్నాయి .కవ్వాల్‌ ,అ‌మ్రాబాద్‌   అభయారణ్యాలు పులుల కోసం ప్రత్యేకం కాగా ,మిగతా జాతీయ వనాల లో అన్ని రకాల జీవజాతులు నివసిస్తున్నాయి. తెలంగాణ బయోడైవర్సిటీ లెక్కల ప్రకారం 300పైగా రకాలు పక్షులు ,60 రకాల క్షీరద జాతికి చెందిన జంతువులు ,60 రకాల సరీసృపాలు మరో వంద రకాల కీటకాలు ఉన్నాయి ,ఇవి కాక ప్రతి ఏటా సీజన్‌ ‌వారీగా అనేక రకాల పక్షులు వలస వస్తాయి అయితే గడిచిన ఐదేళ్లుగా రాష్ట్రంలో పెరిగిన పచ్చదనం మూలంగా వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది . 2018 కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 26 పులులు ఉన్నాయి తాజాగా రాష్ట్ర అటవీ శాఖ అధికారుల అంచనాల మేరకు ఈ సంఖ్య మరో పది వరకు పెరిగి 35 కు చేరుకుంది .స్టేటస్‌ ఆఫ్‌ ‌లెపర్డ్  ఇన్‌ ఇం‌డియా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 334 చిరుతపులులున్నాయి. చిరుతల సంఖ్య 2014 గణాంకాలతో పోలిస్తే దాదాపు యాభై శాతం వరకు వృద్ధి నమోదైంది.

అమ్రాబాద్‌ ‌టైగర్‌ ‌రిజర్వ్ ‌ఫారెస్ట్ ‌లో పాలపిట్టలు ఊర పిచ్చుకలు సంఖ్య గతం కంటే బాగా పెరిగింది
భూపాల్‌ ‌పల్లి అటవీ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా తగ్గిన అడవి పిల్లులు, జింకల వృద్ధి నమోదైంది. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతంలోని లేక్‌ ‌లు ,నదుల్లో జల కళ ఉట్టి పడుతుండడంతో గత ఐదేళ్ల నుంచి తగ్గిన వలస పక్షులు ఈసారి బాగా పెరిగాయి రాష్ట్రంలో జీవవైవిధ్యానికి హెరిటేజ్‌ ‌సైట్‌ ‌గా మెదక్‌ ‌జిల్లాలోని అమీన్‌ ‌పూర్‌ ‌చెరువును గుర్తించడంతో అక్కడికి దేశదేశాల నుంచి పక్షులు వలస వస్తున్నాయి.కాళేశ్వరం ,మిషన్‌ ‌కాకతీయ ప్రాజెక్ట్ ‌లతో పాటు రాష్ట్రంలోని చెరువులు కుంటలు నదులు జలకళను సంతరించుకోవడంతో మత్స్య సంపద గతంతో పోలిస్తే ఈసారి రెండింతలుగా నమోదయింది .’’జంగిల్‌ ‌బచావో -జంగిల్‌ ‌బడావొ ‘‘ నినాదంతో తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం లో 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచడం, పర్యావరణ సమతుల్యతను కాపాడం అనే ద్విముఖ లక్ష్యాలతో అటవీ పునరుద్ధరణ కోసం అడవుల్లో నాటిన 30 కోట్ల మొక్కలను కలుపుకొని ఆరు విడతల హరితహారం కార్యక్రమం లో భాగంగా తెలంగాణలో మొత్తం 214 కోట్ల మొక్కలు నాటారు .ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం గణనీయంగా పెరిగింది. తెలంగాణ బయోడైవర్సిటీ సూచిక 1.97 నుంచి 2.87 కు పెరిగింది.

జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం కోసం సమగ్ర వ్యూహాత్మక, వికేంద్రీకృత ప్రణాళికలను అమలు చేయాలి. జీవ వైవిధ్య సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత అనే విషయం కాకుండా ప్రభుత్వేతర సంస్థలతో పాటు ప్రజలు, పౌర సమాజం వివిధ జీవజాతుల ఆవాసాల సంరక్షణపై దృష్టి సారించాలి. పర్యావరణ అనుకూల, పర్యావరణ హితకర ఉత్పాదకాలను మాత్రమే వినియోగించడం ద్వారా జీవ వైవిధ్య సంరక్షణకు పాటు పడవచ్చు. జీవ వైవిద్య వనరుల పరిరక్షణ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు గా మారాలి. అప్పుడే మానవాళి భవితకు భరోసా.
డా. చల్లా ప్రభాకర్‌ ‌రెడ్డి, 9059734830

Leave a Reply