Take a fresh look at your lifestyle.

జీవ వైవిధ్యం నశిస్తోంది. నేడు ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం

మానవాళికి ప్రకృతి, జీవ వైవిధ్యం రెండు కళ్ళ లాంటివి. ప్రతి సంవత్సరం మే 22 వ తేదీని ‘అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం’’ జరుపుకుంటాము. ఈ సంవత్సరం ‘మన పరిష్కారాలు అన్ని ప్రకృతిలోనే ఉన్నాయి’’ అనే నినాదం(థీం) తో జరుపుకుంటున్నాము. జీవిత భవిష్యత్తును నిర్మించడానికి ఆశ, సంఘీభావం మరియు అన్ని స్థాయిలలో కలిసి పనిచేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. భూమిపై ఓకే జాతి జీవుల మధ్య భేదాన్నే ‘జీవవైవిధ్యం’ అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్‌ ‌సంవత్సరాల పరిణామం. మన జీవనశైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతుంది. దీనితో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి . దాదాపు 20 ఏళ్లలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా కలిగే నష్టాలు 150 శాతం మేర పెరిగాయి. వాతావరణ భూ భౌతిక వైపరీత్యాల వల్ల ఏకంగా 13 లక్షల మంది చనిపోయారు. పేద తరగతి మధ్యతరగతి దేశాల్లోనే మరణాలు ఎక్కువగా ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు నివేదిక 2019లో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ఆందోళన కర అంశాలు వెల్లడించింది. సముద్ర మట్టాలు సాగరాల ఆమ్లత పెరుగుతుండగా గత నాలుగేళ్లలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. దాదాపు 10 లక్షల మొక్కలు, జీవజాతులు కనుమరుగయ్యే ప్రమాదం ముంచుకొచ్చిందని స్పష్టం చేసింది. ఈ భూమి ఏర్పడి 350 కోట్ల సంవత్సరాలు అవుతుండగా, ప్రపంచ వ్యాప్తంగా 1కోటి 40 లక్షల జీవ రాశులు ఉండగా 80 లక్షలు మాత్రమే గుర్తించినట్లు చెప్పారు. అందులో మన దేశంలో కేవలం 17 లక్షల జీవ రాశుల సమాచారం మాత్రమే ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వన, జల, జీవ రాశులున్న దేశాల్లో మన దేశం 17 స్థానంలో ఉండగా, మొత్తం 12 శాతం అడవులు ఇక్కడే ఉన్నాయి.ఇప్పటికి మన దేశంలో జీవ వైవిధ్యంపై 60 శాతం మంది ఆధారపడి బతుకుతున్నారు.

పెరుగుతున్న జనాభాకు తోడు, వనరులను మితిమీరి వినియోగించడంవల్ల జీవవ్కెవిధ్య పరిరక్షణ ఇప్పుడు క్లిష్టమైన సమస్యగా మారుతోంది. ఫలితంగా భూభాగంపై ఉన్న కోట్లాది జీవరాశుల్లో మూడింట రెండొంతుల మేర అంతరించిపోయే ప్రమాదం ముంచుకొస్తోందని అంతర్జాతీయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అందుకే ఐక్యరాజ్యసమితి ‘2010-2020’’ను జీవవ్కెవిధ్య దశాబ్దంగా ప్రకటించింది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంతోపాటు పేదరిక నిర్మూలన, సుస్థిర జీవనోపాధి, అభివృద్ధిలో సమానత వంటి అంశాలతోనూ జీవవ్కెవిధ్యం ముడివడి ఉంది. ప్రపంచంలోని 12 మహా జీవవైవిధ్య ప్రాంతాలలో మనదేశం ఒకటి. సుమారు 45 వేల వృక్ష జాతులు, దాదాపు 77 వేల జంతు జాతులు మనదేశంలో ఉన్నాయి.. నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో 10 శాతానికిపైగా ప్రమాదంలో ఉంది. గత కొన్ని దశాబ్దాలలో 50 శాతానికిపైగా అరణ్యాలు, 70 శాతానికి పైగా నీటి వనరులు తగ్గి పోయాయి. విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్ళను మన జీవనశైలితో రూపుమాపేశాము. సముద్రతీరాలను అతలాకుతలం చేసేశాము. ఇవన్నీ చాలవన్నట్టు అరణ్యాలలోని వన్యప్రాణుల్ని వేటాడి కొందరు అంతమొందిస్తున్నారు. వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు, కీటక నాశనులకు ప్రాధాన్యత పెరిగింది. మందుల కంపెనీల లాభాపేక్ష వాటిని అధికంగా, విచక్షణా రహితంగా వాడేలా చేసింది. దీంతో మన నేలను, దానిపై నివసించే విలువైన జీవ సంపదను కోల్పోవాల్సి వచ్చి ంది. అంతేకాదు మన దేశ ంలో అత్యధిక కీటక నాశను లను ఉత్పత్తి చేసే దేశంగా విరాజిల్లుతోంది.

అంతేకాదు అపార జీవజాతులు అంతరించిపోయాయి. ఈ పరిణామాలకు కారకుడు బుద్ధిజీవిగా పేరొందిన ‘మనిషే’’నన్న కఠోర నిజం ఆలోచింపజేయాల్సిన తరుణమిదే. ‘ఈ భూప్రపంచం ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చగలదు. కానీ దురాశను తీర్చడం మాత్రం సాధ్యం కాదు’ అన్నాడు మహాత్మాగాంధీ. కాని మనం ప్రకృతి వనరులను మితిమీరి వాడేస్తున్నాము. పంట రక్షణ పేరిట పంట పొలాలు, చెరుకు తోటలు, దుంప, కూరగాయలు, ఇతర వ్యవసాయ పంటలను వన్యప్రాణుల నుంచి రక్షించుకునే పేరిట గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే చర్యలకు ఎక్కువ జంతువులు బలవుతున్నాయి. కొన్ని అటవీ ప్రాంతాల్లో విద్యుత్తు తీగలు ఏర్పాటు చేస్తున్నారు. అడవిపందులు, జింక, దుప్పిలను వేటాడి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారు. క్వారీల పేలుళ్ల ప్రభావం వన్యప్రాణుల పాలిట శాపంగా మారింది. రిజర్వు అటవీ ప్రాంతంలో ఎటువంటి పేలుళ్లు చేపట్టకూడదన్న అంశాన్ని పెడచెవిన పెడుతున్నారు వ్యాపారులు.అటవీ ప్రాంతంలో ఉన్న విలువ్కెన కలప అక్రమ నరికివేతకు గురవుతున్నాయి. కలప దొంగలు మద్ది, టేకు, ఇరుగుడు, తెల్ల గుమ్మడి, మామిడి, నరమామిడి, నీలగిరి, వెదురు వంటి వాటిని నరికివేసి అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఇలా మొక్కలను, జంతువులను చంపేస్తున్నారు. జీవవ్కెవిధ్యానికి విఘాతం కలిగించి వన్యప్రాణుల ఉనికికి ముప్పు కలిగిస్తే ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. వివిధ కారణాలతో వన్యప్రాణులు జనావాసాల మధ్యకు రావడం పరిపాటిగా మారింది. తాగునీటికోసం గ్రామాలవ్కెపు వస్తున్న మూగ జీవాలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. వన్యప్రాణులను వేటాడిన వారికి వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం వివిధ కేసులు నమోదు చేయాలి . వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తే అటవీ శాఖాధికారులకు సమాచారమివ్వాలి. అడవుల నరికివేతను ఆపి సహజసిద్ధంగా ఉన్న నీటి వనరులు నాశనం కాకుండా చర్యలు తీసుకోవాలి.

అడవుల్లో వన్యప్రాణులను, సముద్రలోతుల్లో జలచరాలను వేటాడుతున్నారు. నివాస సముదాయాలు, అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట చిత్తడి నేలలు, మడ అడవులను కబళిస్తున్నారు. దీనివల్ల అరుద్కెన జీవవ్కెవిధ్య వనరుల ఉనికి ప్రమాదంలో పడిపోతోంది. ఇప్పటివరకూ భూభాగం మీద 14.36లక్షల జాతులకు చెందిన జీవరాశులు శాస్త్రీయంగా ఉన్నట్టు గుర్తించారు. ఏటా 1.6కోట్ల హెక్టార్లలో అడవులు కనుమరుగవుతున్నాయి.గుట్టలు క్వారీలుగా మారి హరించుకుపోతున్నాయి. వాటితోపాటూ అందులోని జీవవ్కెవిధ్యమూ అంతరించిపోతోంది. గడచిన వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఏటా 20వేల జాతులు కనుమరుగవుతున్నాయన్నది పర్యావరణ నిపుణుల ఆవేదన. జీవ వ్కెవిధ్య పంటలూ 75శాతం మేర అంతర్ధానమయ్యాయి. 24శాతం క్షీరదాలు, 12శాతం పక్షుల జాతులూ అంతరించిపోయే దశలో ఉన్నాయి. ప్రపంచ భూభాగంలో భారత భూభాగం 2.4శాతం మాత్రమే ఉన్నా జీవవ్కెవిధ్యం వాటా 8.1శాతం. దీన్ని కాపాడుకొనే విషయంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతుండటం బాధాకరం. నేడు అనేక జీవజాతులు అంతరించి పోవడానికి ప్రభుత్వ వైఫల్యాలే కారణము .జీవ వైవిధ్యాన్ని పరిరక్షించా ల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది .

మన రాజ్యాంగం అధికరణం 48(ఏ) లో పర్యావరణ రక్షణకు, అభివృద్ధికి, ప్రభుత్వం కృషి చేయాలని దేశంలోని వనాలను వన్యప్రాణులను కాపాడడం రాజ్య విధి అని ఆదేశిక సూత్రాలలో చెప్పింది. అంతేకాదు పర్యావరణ రక్షణ చేయడం పౌరుల ప్రాథమిక విధి అని 51 ఏ(జి) లో స్పష్టంగా చెప్పింది. అంటే పౌరులుగా మనం ఎక్కడైనా నీళ్లు నేలా చెట్టు గాలి నాశనం అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోకూడదు. ఆ విషయాన్ని అధికారులకు, ప్రజాప్రతినిధులకు, చివరికి కోర్టుకి కూడా చెప్పాలి. అదే మన మొదటి బాధ్యత. రాజ్యాంగంలోని 21వ అధికరణం కింద ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉంది. ఆ జీవించే హక్కు లోనే మంచి గాలి మంచినీళ్లు ఆరోగ్యవంతమైన పర్యావరణంలో బతికే హక్కు కూడా ఉంది. ఇది పౌరులుగా పర్యావరణం పట్ల మనం చేసే బాధ్యత మీద ఆధారపడి ఉంటుంది. ప్రఖ్యాత ఆవరణ శాస్త్రవేత్త ఇ.ఓ.విల్సన్‌ అభిప్రాయం ప్రకారం ప్రపంచం అంతటా సంవత్సరానికి 10,000 జాతులు లేదా రోజుకు 27 జాతులు అంతరించి పోతున్నాయి. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే మానవుని ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రపంచ వన్య ప్రాణుల సమాఖ్య, అంతర్జాతీయ వన్య ప్రాణుల సంరక్షణ సంఘం అంతరించిన, అంతరించాబోతున్న, ఆపదలో ఉన్న మొక్కలు జంతుల సమాచారాన్ని ‘రెడ్‌ ‌లిస్టు బుక్‌’’ ‌లేదా ‘రెడ్‌ ‌డేటా బుక్‌’’ ‌లో ప్రచురిస్తుంది. ఇది సూచికగా ఉపయోగపడుతుంది. ఆర్కిడ్స్, ‌గంధం చెట్టు సైకస్‌ ‌సఫ్ఫా గ్రంధి,మొదలగు ఔషద మొక్కలు, చిరుతపులి సింహం తోడేలు, ఎర్రనక్క, ఎర్రపాండా, పులి, ఎడారి పిల్లి, మొసలి, తాబేలు, కొండచిలువ, బట్టమేకపిట్ట, పెలికాన్‌, ‌నెమలి, గ్రేట్‌ ఇం‌డియన్‌ ‌హార్న్ ‌బిల్‌ , ‌గోల్డెన్‌ ‌మంకి, లయన్‌ ‌టేల్ద్ ‌మకాక్‌, ‌నీలగిరి లంగూర్‌, ‌లారిస్‌ , ‌వంటి జంతువులు అంతరించిపోయే ప్రమాదం లో ఉన్నాయి.

మన దేశంలో ఆదివాసులు(గిరిజనులు, కొండజాతి ప్రజలు) ఎక్కడున్నారో అక్కడ జీవవైవిధ్యం ఎక్కువగాను, పదిలంగాను ఉంది. మన దేశంలో 53 మిలియన్ల కంటే ఎక్కువమందే ఆదివాసులు నివసిస్తున్నారని ఒక అంచనా . వారిలో దాదాపు 53 తెగలున్నాయి. మేఘాలయ, నాగాలాండ్‌, ‌మిజోరాం,అరుణాచల్‌‌ప్రదేశ్‌లో 80 శాతానికంటే ఎక్కువమంది గిరిజనులు ఉన్నారు. అక్కడే జీవ వైవిధ్యం కూడా ఎక్కువగా ఉంది. ఎన్నో పంటలలో వైవిధ్యాలు, రకాలు, ఆదివాసులు నివాసాలున్న ప్రాంతాలలోనే అధికం. అడవులను కాపాడాల్సిన ప్రభుత్వాలే వాటిని గనులు, ఇతర అంశాలకు కేటాయించి జీవ వ్కెవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.మన జీవనశైలిని మార్చుకోవాలి. రసాయన కాలుష్యాన్ని అరికట్టి భూతాపాన్ని తగ్గించాలి. జంతువుల్ని, మొక్కల్ని పరిరక్షించుకోవాలి. చాలా మంది జంతువుల చర్మాలతో చేసే వస్తువుల్ని వాడుతుంటారు. దీన్ని మానుకోవాలి. మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. రాబోయే తరాలు ఇబ్బందుల పాలుకాకుండా ఇప్పటికైనా మన మందరం ప్రకృతి పర్యవారణాన్ని పర్యావరణపరిరక్షణకు ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలి.. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో చెట్లను నరకాల్సి వచ్చినప్పుడు ఒక్క చెట్టు స్థానాంలో పది చెట్లు నాటే విధంగా చర్యలు తీసుకోవాలి. అందరం పర్యావారణాన్ని కాపాడడానికి ప్రతిన పూనాల్సిన అవసరం ఉన్నది.. జీవవ్కెవిధ్య వనరుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా మారాలి. అప్పుడే మానవాళి భవితకు భద్రత.

nerupati anandh

Leave a Reply