Take a fresh look at your lifestyle.

శతకోటి టీకోత్సవం..!

నిజమే ఇది శుభ తరుణం
దేశం గర్వించదగ్గ సందర్భం

శతకోటి టీకా లక్ష్యం ఛేదించి
కొత్త చరిత్ర లిఖించిన సమయం

కొరోనా కట్టడికి సాగిన పోరులో
భారత్‌ ‌సాధించిన ఘనవిజయం

శాస్త్ర ,సాంకేతిక రంగాలలో మన
సత్తాను ప్రపంచానికి చాటిన క్షణం

నెల్లాళ్లుగా వైద్యులు ఆశ వర్కర్ల
అవిశ్రాంత శ్రమకు తగిన ఫలితం

టీకాలేమితో తపించిన కాలం వీడి
ఔషదాల సమృద్ధిని సాదించుకొని
అగ్ర దేశాల సరసన తలెత్తి నిలిచాం

ఇంతమాత్రానికే  ముప్పు తప్పిందని
ముంగిల్ల ముందర  దీపాలు వెలిగించి
చప్పట్లు కొట్టి ,పాటలు పాడితే  తగదు
ఆనక చేతులు దులుపుకుంటే కుదరదు

మనం ఉహీంచినట్లుగా…
కొరోనా కర్కశి ఇంకా కడతేరలేదు
రూపం మార్చి వ్యూహం ఏమార్చి
మానవ హననం గావిస్తూనే ఉంది

ఈ విజయోత్సవం జరుపుకుంటు
ముందున్న సవాళ్లను ఎదురిద్దాం

ఇందుకు జనగణమంతా…
నినతం మాస్కు ధరిస్తూ …
భౌతిక దూరాలు పాటిస్తూ …
నియమాలు నిష్ఠగా ఆచరిస్తూ…
టీకా యజ్ఞం నిర్విఘ్నంగా సాగిస్తేనే..
కొరోనా పిశాచి పీడ విరగడ అయ్యేను
భారతవని స్వస్థతా క్షేత్రమై విలసిల్లేను

(భారత్‌ 100 ‌కోట్ల డోసుల మైలురాయి దాటిన సందర్భంగా..)
 – కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply