Take a fresh look at your lifestyle.

కొరోనా వ్యాక్సిన్‌ ‌తయారీలో బిల్‌గేట్స్ ‌సంస్థ

  • క్లినికల్‌ ‌దశలో ఉందన్న ఇనోవియా
  • త్వరగా వ్యాక్సిన్‌ ‌తయారకు సిద్దం కావాలన్న జి20 దేశాలు

మైక్రోసాప్ట్ ‌వ్యవస్థాపకుడు బిల్‌ ‌గేట్స్ ‌సారథ్యంలోని బిల్‌ ‌మిలిండా గేట్స్ ‌ఫౌండేషన్‌ ‌కొరోనా కట్టడికి తన వంతు పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ ఫౌండేషన్‌ అం‌దించిన నిధులతో రూపుదిద్దుకున్న కరోనా నిరోధక వ్యాక్సిన్‌కు సంబంధించి క్లినికల్‌ ‌ట్రయల్స్ ‌త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇనోవీయో ఫార్మాసిటుకల్స్ ‌సంస్థ దీన్ని రూపొందించింది. ఐఎన్‌ఓ-4800 ‌పేరుగుల ఈ వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది. దీంతో ఈ సంస్థ.. క్లీనికల్‌ ‌ట్రయల్స్ ‌కోసం పూర్తి ఆరోగ్యంతో ఉన్న వలంటీర్లను సమకూర్చుకునే పనిలో నిమగ్న మైంది. అయితే.. అమెరికాలో కరోనా వ్యాక్సిన్‌ను పరీక్షిస్తున్న రెండో సంస్థ ఇనోవియో. ఇప్పటికే మాసాచుసెట్స్‌కు బయోటెక్‌ ‌కంపెనీ మోడర్నా మర్చిలోనే వ్యాక్సిన్‌ ‌పరీక్షలు ప్రారంభించింది. అయితే ఏ వ్యాక్సిన్‌ అయినా అందుబాటులోకి రావాలంటే కనీసం ఏడాది పడుతుందని అమెరికాకు చెందిన అంటు వ్యాధుల జాతీయ పరిశోధనసంస్థ డైరెక్టర్‌ ఆం‌టోనిఫాసీ ఇటీవల పలుమార్లు స్పష్టం చేశారు.

ఇదిలావుంటే ప్రపంచాన్ని స్తంభింపజేసిన కరోనాను పూర్తిగా రూపుమాపేందుకు జీ20 దేశాలే పూనుకోవాలని ప్రపంచంలోని పలువురు మాజీ దేశాధినేతలు, వీఐపీలు, సెలబ్రిటీలు కోరారు. కొన్ని దేశాల్లో కరోనా తగ్గి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో రెండోసారి కరోనా ప్రపంచాన్ని నాశనం చేయకండా కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకోసం 8బిలియన్‌ ‌డాలర్ల నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. కరోనాకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను తయారుచేయాలని జీ20 దేశాధినేతలకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్‌తోపాటు 165 మంది ప్రముఖులు సంతకాలు చేశారు. వీరిలో 92 మంది మాజీ దేశాధినేతలు, కొందరు ప్రస్తుత అధ్యక్షులు, ప్రధానులు ఉన్నారు. పేద దేశాల్లో సరైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు కనీసం 150 బిలియన్‌ ‌డాలర్లు అవసరమవుతాయని లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply