వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులకు తన మద్దత్తు ప్రకటించాలని 80 ఏళ్ళ అమ్మమ్మ బిల్కిస్ బాను సింగు బోర్డర్ చేరుకున్నారు. వయసు రీత్యా చుస్తే గట్టిగా పట్టుకుంటే వడికిపోయే శరీరం ఆమెది. మానవరాళ్లు..మనుమలతో హాయిగా సమయం గడిపే వయసు బామ్మ బిల్కిస్ బానుది. ఈ బామ్మ చల్లటి శీతాకాలంలో రోడ్డెక్కి వున్నారు.తనమానవరాళు..మనుమల హక్కు పోరాటం కోసం నడుం బిగించి పోరాడుతున్నారు. బామ్మా బిల్కిస్ బాను, ఢిల్లీ-హర్యానా సరిహద్దు సింగ్ వద్ద జరుగుతున్న రైతుల పోరాట స్థలానికి చేరుకున్నారు. రైతులకు మద్దత్తు ఇస్తా అని ఆమె ఆరాటం..ఇంట చిన్న విషయం పోరాటం అయిపోయింది.
బామ్మా బిల్కిస్ బాను సింగు బోర్డర్ కి రావటం వెనుక వున్నా కారణం చాలా సాధారణం. మనిషికి మనిషికి మధ్య వుండే స్నేహం బామ్మా బిల్కిస్ ను కదిలించింది. షాహీన్ బాగ్ వద్ద సిఎఎ వ్యతిరేక నిరసనలు చేస్తున్నపుడు బామ్మా బిల్కిస్ బానుకు పంజాబ్ రైతులు వచ్చి ఆ పోరాటానికి మద్దత్తు తెలిపారు. ఆ స్నేహం బామ్మ బిల్కిస్ బాను మనసులో నికరంగా నిలిచిపోయింది. నాడు నా పోరులో రైతులు అండ దొరికింది.. నేడు వారి పోరులో నే.. వారి చెంత నిలబడాలి.. ఇంతే 80 ఏళ్ళ బామ్మ బిల్కిస్ బాను మనసు. ఇంత మాములు విషయం రాజ్యం కంటగింపుకి కారణం అయింది. బామ్మా బిల్కిస్ సింగు చేరుకోగానే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఘటనా స్థలం నుంచి 80 ఏళ్ళ బామ్మ బిల్కిస్ ను తరలించడానికి 20 మంది పోలీసులు ఆమెను చుట్టూ ముట్టారు. ఆమె వలన రైతుల ధర్నా స్థలంలో భద్రతా సమస్యలు తలెత్తుతాయి అని పోలీసుల వాదన. బామ్మ బిల్కిస్ బానును రైతుల నిరసనకి ఎందుకు మద్దత్తు ఇస్తున్నారు అని అడిగితే ‘‘మేము రైతుల కూతుళ్ళం,నేడు రైతుల నిరసనకు మద్దతు ఇస్తాము.మా గొంతు పెంచుతాము, కేంద్ర ప్రభుత్వం మా మాట వినాలి’’ అని నిరసనలో పాల్గొనడానికి ముందు ఆమె ప్రకటించారు.
ఈ ఏడాది ఆరంభంలో షాహీన్ బాగ్ వద్ద జరిగిన ••• వ్యతిరేక నిరసనలకు బామ్మ బిల్కిస్ పర్యాయ పదం అయినారు.టైమ్ మ్యాగజైన్ నూరు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో బామ్మా బిల్కిస్ వున్నారు. వైరుధ్యం ఏమంటే ఈ జాబితాలో •వీ మోడీ కూడా వున్నారు. రైతుల నిరసనలో ‘‘పాకిస్తాన్ అనుకూల’’ మరియు ‘‘ఖలీస్తాన్ అనుకూల’’ దళాలు రైతుల నిరసనను ‘‘హైజాక్’’ చేస్తున్నాయని బిజెపి నాయకులు ఆరోపించిన విషయం మనకి తెలిసిందే..ఇప్పుడు బామ్మ బిల్కిస్ రైతులకి మద్దత్తు ప్రకటించటానికి చేసిన ప్రయత్నం.. ఎన్ని నిందలు మోయాల్సి వస్తుందో ఎవరికి ఎరుక. అయితే ఒకటి మాత్రం స్పష్టం. ఇంత పోరాట పటిమ చూపే బామ్మ బిల్కిస్ ను పాకిస్తాన్ కు రవాణా చేస్తాం.. అంటే ఈ దేశ మహిళ ఒప్పుకునేలాగా కనిపించటం లేదు. గ్యాస్ సిలండర్..ధరల తగ్గుదల వంటి వంటింటి వాగ్దానాలు చూసి మురిసిపోయి ఓటు వేసే స్థాయి నుంచి ఎదుగుతున్న భారత మహిళ.. బామ్మా బిల్కిస్ భానును చూసి స్ఫూర్తిని పొందుతూనే ఉంటుంది.బామ్మా బిల్కిస్ మొదలేసిన పోరు బాట పడుతూనే ఉంటుంది అనేది స్పష్టం. ఇక బామ్మ బిల్కిస్ మనసులో నిండిన రైతు పోరాటం అప్డేట్ చూసినట్టు ఐతే..చర్చలకు రైతులు సిద్ధంగా వున్నారు. వారి షరతు ఒకటే. ఈ కొత్త వ్యవసాయ బిల్లులు ప్రభుత్వం రద్దు చేయాలి. అందుకే ప్రభుత్వం అందించే ఆఫర్లును నిరసన తెలిపే రైతులు తిరస్కరిస్తున్నారు. తమ ఖచ్చితమైన డిమాండ్లపై ప్రభుత్వం మాటాడాలి అని ఎదురు తిరుగుతున్నాయి రైతు సంఘాలు.