అక్కడిక్కడే మృతి చెందిన తండ్రీకూతుళ్లు
బైక్ అదుపుతప్పి లారీని ఢీకొనడంతో తండ్రి, కుమార్తె మృతి చెందిన ఘటన మంగళవారం ఉదయం కృష్ణా జిల్లా 65 వ నంబరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు… భార్య, భర్త వారి ఇద్దరు కుమార్తెలు బైక్‌పై ప్రయాణిస్తున్నారు. వత్సవాయి మండలం భీమవరం సమిపంలోకి రాగానే బైకు అదుపుతప్పి, ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొంది.
ఈ ఘటనలో బైక్ పై ముందు కూర్చొని ఉన్న కుమార్తె, తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి భార్య, మరో కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. బాధితుల స్వస్థలం కృష్ణా జిల్లా నాగాయలంకగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.