- ‘కొత్త బీహార్’ నిర్మాణానికి ఇదే సమయం
- కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు
బీహార్ ఎన్నికల మొదటి దశ వోటింగ్‌కు ఒక రోజు ముందు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం జెడియు-బిజెపి ప్రభుత్వం తన లక్ష్యాలు చేరుకోలేకపోయింది అని అన్నారు. అధికార గర్వంతో నితీష్ ప్రభుత్వం కాలయాపన చేసిందని ఆరోపించారు. బీహార్ లో మార్పుకు సమయం ఆసన్నమైంది అని సోనియా అన్నారు. నాలుగు నిమిషాల వీడియోలో, నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం మంచి చెప్పడం అనే వాగాడంబరమే కానీ, మంచి చేయడం లేదని అన్నారు. బీహార్ కార్మికులు నిస్సహాయంగా ఉన్నారు, రైతులు కలత చెందుతున్నారు, బీహార్ యువత నిరాశలో ఉన్నారని సోనియా అన్నారు.
అధికారంలో ఉన్న సమయంలో అహంకారంతో ఉన్న బీహార్ ప్రభుత్వం తన లక్ష్యాలను చేరుకోలేదు. బీహార్ ప్రజలు నితీష్ మాట నమ్మి నిస్సహాయంగా ఉన్నారు. ముఖ్యంగా యువత ఉద్యోగాలు లేక నిరాశలో కూరుకుపోయారు. బీహార్‌లో డీమోనిటైజేషన్, కోవిడ్ -19 లాక్డౌన్, ఎకనామిక్ షట్‌డౌన్ తీసుకువొచ్చాయని, దీని వలన రాష్ట్రంలో ఉద్యోగాలు లేకుండా పోయాయని సోనియా ఆరోపించారు. తరువాతి తరం కోసం ‘‘కొత్త బీహార్’’ ను నిర్మించాలని ఆమె బీహార్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.