Take a fresh look at your lifestyle.

బీహార్‌ ఎన్నికల షెడ్యూల్‌

  • మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ
  • నవంబర్‌ 3,7‌న రెండోమూడో విడతలు
  • నవంబర్‌ 10‌న వోట్ల లెక్కింపు ..ఫలితాల ప్రకటన
  • దేశంలోని 15 రాష్ట్రాల్లో 64 స్థానాలకు ఉప ఎన్నికలు
  • కోవిడ్‌ ‌నిబంధనల మేరకు ఎన్నికల ఏర్పాట్లు..  

నామినేషన్లు, ప్రచారంలో కఠిన నిబంధనలు..వివరాలు ప్రకటించిన సీఈసీ సునీల్‌ ఆరోరా
బీహార్‌ ఎన్నికల షెడ్యూల్‌ను  కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనుంది. అక్టోబర్‌ 28‌న తొలివిడత పోలింగ్‌, ‌నవంబర్‌ 3‌న రెండో విడత ,మూడో విడత నవంబర్‌ 7‌న జరుగనుంది. నవంబర్‌ 10 ఓట్ల లెక్కింపు చేపట్టి తుది ఫలితాలను ప్రకటించనుంది. శుక్రవారం ఢిల్లీలోని నిర్వాచన్‌ ‌సదన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీఈసీ సునీల్‌ ఆరోరా ఈ వివరాలను వెల్లడించారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీ గడువు నవంబర్‌ 29‌తో ముగియనుంది. దేశంలో కొరోనా విజృంభణ అనంతరం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఈసీ ప్రత్యేక మార్గదర్శకాల నడుమ ఎన్నికలు నిర్వహిస్తోంది. బహిరంగ సభలు, ర్యాలీలకు ఈసీ అనుమతి నిరాకరించింది. నామినేషన్ల పక్రియను ఆన్‌లైన్‌లోనూ నమోదు చేసుకునే అవకాశాన్ని సైతం కల్పించింది. కొరోనా వ్యాప్తి దృష్ట్యా పోలింగ్‌ ‌కేంద్రాల వద్ద శానిటైజర్లను సైతం అందుబాటులో ఉంచుతున్నట్లు అరోరా తెలిపారు. 80 ఏళ్లు పైబడిన వారికే పోస్టల్‌ ‌బ్యాలెట్‌ ‌ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని 15 రాష్ట్రాల్లో 64 స్థానాలకు ఉప ఎన్నికలకు సైతం షెడ్యూల్‌ను ప్రకటించింది.

చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ ‌సునిల్‌ అరోరా డియాతో మాట్లాడుతూ.. దేశంలోని అతి పెద్ద రాష్ట్రాల్లోబీహార్‌ ఒకటి అని, కోవిడ్‌ ‌వేళ ప్రపంచంలో జరుగుతున్న అతిపెద్ద ఎన్నికల సమరంగా ఆయన పేర్కొన్నారు.  బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలను నిర్వహించ నున్నట్లు తెలిపారు. సోషల్‌ ‌డిస్టాన్సింగ్‌ ‌కారణంగా.. అధిక సంఖ్యలో పోలింగ్‌ ‌బూత్‌లు ఉంటాయని తెలిపారు. ప్రతి పోలింగ్‌ ‌బూత్‌లో 1500 మందికి బదులుగా వెయ్యి మందికి ఓటింగ్‌ అవకాశం కల్పించ నున్నారు. ఎన్నికల నియమావళి తక్షణమే అమలులోకి వస్తుందని రావత్‌ ‌ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా లక్ష పోలింగ్‌ ‌కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా పోలింగ్‌ ‌సమయాన్ని మరో గంట పాటు పొడగించారు. ఎన్నికల సందర్భంగా 46 లక్షల మాస్కులు, 6 లక్షల పీపీఈ కిట్స్, 6.7 ‌లక్షల ఫేస్‌ ‌షీల్డులను, 23 లక్షల హ్యాండ్‌ ‌గ్లౌజులను వాడుతామని తెలిపారు.

నామినేషన్లు వేసేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతిస్తామని, అంతకంటే ఎక్కువ మందిని అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. పోలింగ్‌ ‌కేంద్రాల వద్ద శానిటైజర్లను ఉంచుతామని, ఓటర్లు, అధికారలందరూ తప్పనిసరిగా భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనని కరాఖండిగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఓటు వేసే సమయంలో ప్రతి ఒక్కరూ గ్లౌజులు ధరించాలని సూచించారు. పోలింగ్‌ ‌స్టేషన్లను పూర్తిగా శానిటైజ్‌ ‌చేస్తామని తెలిపారు.  ఇంటింటికి ప్రచారంలో భాగంగా కేవలం ఐదుగురు కార్యకర్తలు మాత్రమే వెళ్లాలని, నామినేషన్లు కేవలం ఆన్‌లైన్‌ ‌ద్వారా మాత్రమే నింపాలని, డిపాజిట్లను కూడా ఆన్‌లైన్‌ ‌ద్వారా కట్టాలని ఆయన సూచించారు. అయితే నామినేషన్లు వేసే సమయంలో మాత్రం అభ్యర్థితో కేవలం ఇద్దరు మాత్రమే రావాలని, రెండు వాహనాలను మాత్రమే వాడాలని రావత్‌ ‌స్పష్టం చేశారు.  పోలింగ్‌ ‌చివరి సమయంలో కరోనా రోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని, ఈ వ్యవహారం అంతా కూడా ఆరోగ్య అధికారుల పర్యవేక్షణలో సాగుతుందని రావత్‌ ‌తెలిపారు. 243 స్థానాల్లో 38 సీట్లు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించినట్లు సీఈసీ సునిల్‌ ‌తెలిపారు. క్వారెంటైన్‌లో ఉన్నవారికి కూడా ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు. పోలింగ్‌ ‌సమయాన్ని ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్దారించారు. అయితే పెంచిన గంట సమయం.. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు వర్తించదని సీఈసీ సునిల్‌ అరోరా తెలిపారు.

బీహార్‌ ఎన్నికల పిటిషన్‌ ‌తిరస్కరణ
బిహార్‌ ‌రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
అక్టోబర్‌, ‌నవంబర్‌లలో జరిగే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ఈ మేరకు భారత ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా సుప్రీంలో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. కొవిడ్‌ -19 ‌మహమ్మారి, రాష్ట్రంలో వరద పరిస్థితుల దృష్ట్యా అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతకుక్రితం సైతం ఆగస్టు 28న ఇదే విధమైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. తాజా పిటిషన్‌పై తీర్పును వెలువరిస్తూ ఇదే మైదానం కాదని,  ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎన్నికల సంఘం ప్రతిదీ పరిశీలిస్తుందని తెలిపింది.

Leave a Reply