Take a fresh look at your lifestyle.

‘ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌బడ్జెట్‌’‌ పేరుతో అతి పెద్ద అమ్మకం!

“భారతదేశం తన చరిత్రలో ఇప్పటివరకు అతిపెద్ద ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న సమయంలో, 90% కంటే ఎక్కువ మంది ప్రజలు జీవనోపాధి కోసం ఆధారపడే అనధికారిక రంగాలు ఇప్పటికే మోడీ  కార్పొరేట్‌-‌నియంతృత్వ నిర్ణయాలు, నోట్ల రద్దు, జీ ఎస్‌ ‌టీ (సరుకులు మరియు సేవల పన్ను), లాక్డౌన్‌ ‌నిర్ణయాలతో సామాన్య జనజీవితాలు కుప్పకూలి పొయ్యాయి.పెట్రోల్‌-‌డీజిల్‌ ‌ధరల పెంపు ద్వారా చాలా అశాస్త్రీయమైన రీతిలో అతిపెద్ద దోపిడీ జరుగుతుంది.పైపై అలంకారాలు మినహా బడ్జెట్లో సగటు జీవి కోసం పేర్కొనడానికి విలువైనది ఏమీ లేదు.అతి సంపన్న వర్గాల నుండి హృదయపూర్వక మద్దతుకు సాక్ష్యంగా బడ్జెట్‌ ‌ప్రసంగం ప్రారంభమైనప్పుడు, స్టాక్‌ ‌మార్కెట్‌ ‌సెన్సెక్స్ 3.5% ‌పెరిగింది.ఆర్థికవేత్తలు ఇప్పటికే చెప్పినట్లుగా ఈ బడ్జెట్‌ ‌తరువాత సంక్షోభం మరింత తీవ్రమవుతుంది.”

ఆర్థిక సర్వేపై రెండు రోజుల క్రితం ‘‘ఇది రాబోయే బడ్జెట్లో అతిపెద్ద అమ్మకాలకు ముందుమాట’’ అని మేము చెప్పాము .మోడీ 2021-22 బడ్జెట్‌, ‌దాని నియంతృత్వ పాలన ధోరణికి అనుగుణంగా ఉంది.హొఆర్థిక వ్యవస్థకు సంబంధించి దాని కార్పొరేట్‌ అనుకూల విధానంతో మరింత ముందుకు సాగింది.కోవిడ్‌ ‌వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణించినప్పటికీ, భారతదేశం తట్టుకోగలిగింది అన్నప్రకటనతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌తన బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టారు.2020 లో భారతదేశం రికార్డు స్థాయిలో జరిగిన ఆర్థిక పతనానికి ప్రపంచ మరియు దేశీయ గణాంకాలు ఇప్పటికే అంగీకరించినందు వలన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌తన బడ్జెట్‌ ‌ప్రసంగంలో భారతదేశం తట్టుకోగలిగింది అన్నప్రకటనలో ఎటువంటి వాస్తవం లేదు.రూ .35 లక్షల కోట్ల వ్యయాన్ని అంచనా వేసే బడ్జెట్‌ ‌రావడం, దీని కోసం ప్రభుత్వం ఎటువంటి విలువైన దేశీయ వనరుల సమీకరణ లేనప్పుడు 2021-22 లో 12 లక్షల కోట్ల రూపాయల (బడ్జెట్‌ ‌వ్యయంలో 36%) భారీ రుణాలు తీసుకోవడంపై ఆధారపడాలి.‘వ్యవసాయ ఆదాయాలను రెట్టింపు చెయ్యటం, ఉపాధి కల్పన, ఆరోగ్య రంగంపై ప్రాధాన్యత’ అంటు చేసే వాక్చాతుర్యానికి కొరత లేదు.

మొత్తం వ్యయంలో 28% అత్యంత దారుణంగా వడ్డీ చెల్లింపుల కోసం 20% లేదా రూ. 7 లక్షల కోట్లు మరియు రక్షణ రంగం కోసం 8% అంటే సుమారు రూ. 2.8 లక్షల కోట్లు బడ్జెట్‌ ‌చరిత్రలో ఎన్నడు జరగలేదు.బడ్జెట్లో పేర్కొన్నట్టు 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి, మార్చి రెండు నెలలల్లో ప్రభుత్వ రోజువారీ నిర్వహణ కోసం, బహిరంగ రుణ మార్కెట్‌ (‌భారతీయ మరియు విదేశీ కార్పొరేట్‌ ‌ఫైనాన్షియర్లచే నియంత్రించబడుతుంది ) నుండి ప్రభుత్వం వెంటనే రూ .80,000 కోట్ల రుణం తీసుకోవాలి. తాజా అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఎక్కువ మంది ప్రజలు తమ కనీస జీవిత అవసరాలకు కోసం కష్టపడుతుండగా, వచ్చే ఆదాయంలో మూడొంతుల ఆదాయం ఒక శాతం మాత్రమే వున్న అపర కోటీశ్వరులకు లబ్ది చేకుర్చబోతుంది.ఇప్పుడు వున్న కార్పొరేట్‌ ‌పన్ను రేటు 15%.ఇది ప్రపంచంలోనే అత్యల్పం .

2021 – 22 బడ్జెట్లో ప్రవేశ పెట్టిన కార్పొరేట్‌ ‌పన్ను13% మాత్రమే.మౌలిక సదుపాయాల పెట్టుబడి పూర్తిగా ప్రైవేటీకరణ కాబోతుంది, కార్పొరేట్‌ ‌ఫైనాన్షియర్లకు అప్పగించ పడబోతోంది.ఆ విధంగా రైల్వేలు, జాతీయ రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలు, విద్యుత్‌ ‌మరియు అన్ని ఇతర రంగాలు క్రమంగా కార్పొరేట్‌ ‌మూలధనానికి పి పి పి(పబ్లిక్‌ ‌ప్రైవేట్‌ ‌భాగస్వామ్యం) పథకంపై ‘ఆత్మనీర్భర్‌ ‌భారత్‌’ ‌పేరిట అమ్ముడవుతాయి.ప్రభుత్వం చేసే పెట్టుబడులు రుణాల ద్వారా ఉండబోతాయి.ప్రభుత్వం అరువు తెచ్చుకునే విధానం కార్పొరేట్లకు విక్రయించే పరోక్ష మార్గం.

బడ్జెట్లో ప్రకటించిన అతిపెద్ద రహదారి, మెట్రో మరియు కారిడార్‌ ‌ప్రాజెక్టులు లాంటి విలువైన పెట్టుబడులు తమిళనాడు (రూ 1,03,000 కోట్లు) కేరళ (రూ 65,000 కోట్లు) మరియు పశ్చిమ బెంగాల్‌ (‌రూ 25,000 కోట్లు) రాష్ట్రాల మధ్య పంపిణీ చేయబడ్డాయి.తద్వారా మరోసారి బడ్జెట్ను ఓట్లను రాబట్టుకునే సాధనంగా ఉపయోగిస్తుంది.అదే సమయంలో, పీ ఎస్‌ ‌యు( ప్రభుత్వ రంగ సంస్థ) లలో అతిపెద్ద ప్రైవేటీకరణ (రూ 1,75,000 కోట్లు) ఎయిర్‌ ఇం‌డియా లో 2022 నాటికి పూర్తవుతుందని బడ్జెట్‌ ‌ప్రకటించింది.భీమా రంగంలో ఎఫ్డిఐ ( విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి) 74 శాతానికి పెరుగుతుంది.విదేశీ పెట్టుబడులకు పూర్తి పన్ను మినహాయింపు ఇవ్వబడుతుంది.

మౌలిక సదుపాయాల కోసం రుణలలో ప్రధాన భాగం ఎఫ్‌ ఐ ఐ (‌విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు) లేదా విదేశీ పెట్టుబడులు.భవిష్యత్తులో దీని కొరకు ఆర్థిక అభివృద్ధి సంస్థ నెలకొలుపుతారు.మూడు క్రూరమైన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చారిత్రాత్మక రైతుల ఆందోళన రోజురోజుకు బలపడుతున్నప్పుడు, కుట్రలు మరియు అణచివేత ఉన్నప్పటికీ, ప్రజల దృష్టి మళ్లించడానికి ‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చెయ్యాలి’ అనే ప్రభుత్వ ఉద్దేశాన్ని బడ్జెట్లో పదేపదే ప్రక టించారు (మోడీ తన 2014 ఎన్నికల ప్రచారం లో చేసిన వాగ్దానం ) .స్వామినాథన్‌ ‌కమిషన్‌ ‌రిపోర్ట్ ‌గురించి ఏమీ ప్రస్తావించకుండా, ఏ పీ ఎం సి( వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్‌ ‌కమిటీ) లు బలోపేతం చేయడం, వ్యవసాయ వ్యయం కంటే ఎం ఎస్‌ ‌పీ(కనీస మద్దతు ధర) ఒకటిన్నర రెట్లు ఉంటుందని బడ్జెట్లో లోపాయకరంగా ప్రతిపాదించారు.వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, రైతుల ప్రాథమిక డిమాండ్లలోఎం ఎస్‌ ‌పీ(కనీస మద్దతు ధర ) చట్టంగా మార్చాలి అన్న ఈ రెండు డిమాండ్లను చాకచక్యంగా ప్రభుత్వం బడ్జెట్‌ ‌లో ప్రకటించలేదు.ఇది ఎకనామిక్‌ ‌సర్వేలో ఇప్పటికే ప్రదర్శించిన అదే విధానాన్ని పునరావృతం చేయడం.ఇది రైతుల గాయాల పై కారం చల్లటం లాంటిది.

భారతదేశం తన చరిత్రలో ఇప్పటివరకు అతిపెద్ద ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న సమయంలో, 90% కంటే ఎక్కువ మంది ప్రజలు జీవనోపాధి కోసం ఆధారపడే అనధికారిక రంగాలు ఇప్పటికే మోడీ  కార్పొరేట్‌-‌నియంతృత్వ నిర్ణయాలు, నోట్ల రద్దు, జీ ఎస్‌ ‌టీ (సరుకులు మరియు సేవల పన్ను), లాక్డౌన్‌ ‌నిర్ణయాలతో సామాన్య జనజీవితాలు కుప్పకూలి పొయ్యాయి.పెట్రోల్‌-‌డీజిల్‌ ‌ధరల పెంపు ద్వారా చాలా అశాస్త్రీయమైన రీతిలో అతిపెద్ద దోపిడీ జరుగుతుంది.పైపై అలంకారాలు మినహా బడ్జెట్లో సగటు జీవి కోసం పేర్కొనడానికి విలువైనది ఏమీ లేదు.అతి సంపన్న వర్గాల నుండి హృదయపూర్వక మద్దతుకు సాక్ష్యంగా బడ్జెట్‌ ‌ప్రసంగం ప్రారంభమైనప్పుడు, స్టాక్‌ ‌మార్కెట్‌ ‌సెన్సెక్స్ 3.5% ‌పెరిగింది.ఆర్థికవేత్తలు ఇప్పటికే చెప్పినట్లుగా ఈ బడ్జెట్‌ ‌తరువాత సంక్షోభం మరింత తీవ్రమవుతుంది.మోడీ మరియు అతని సామ్రాజ్యవాద-కార్పొరేట్‌ అధిపతుల  దుర్మార్గపు పోకడలను కార్మికులు, రైతులు మరియు అణచివేతకు గురైన ప్రజలందరూ ప్రతిఘటించాలి.

N ramachandran
ఎన్‌.‌రామచంద్రన్‌
‌ప్రధాన కార్యదర్శి సిపిఐ (ఎంఎల్‌) ‌రెడ్‌ ‌స్టార్‌
‌న్యూఢిల్లీ
1 ఫిబ్రవరి 2021

Leave a Reply