Take a fresh look at your lifestyle.

భువన భవనపు బావుటా!

కష్ట జీవికిరువైపులా.. నిలిచినోడే కవని
పెను నిద్దుర వదిలించేది.. మునుముందుకు సాగించేదే
కవిత్వమన్న మహాకవివి నీవు..

మంటల చేత మాట్లాడించి
రక్తం చేత రాగాలాపన చేసి.. నెత్తురు కన్నీళ్ల తో
ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన వృద్ధ ప్రపంచానికి
కొత్త టానిక్‌ ఎక్కిచ్చిన ఎర్రబావుటావు నువ్వు..

ఇప్పుడు గ్లోబల్‌ ‌సంగ్రామంలో..ప్రపంచ కుగ్రామం
కోవిడ్‌ ‌కోరలకు క్లోరో ఫాంలా చీకటికమ్ముకున్నది..
పాలకిలిప్పుడు పాతను బతికించడానికి
కొత్త చిట్కాలు వెతుకుతున్నారు
కొత్తను హత మార్చడానికి
పా( మ )త కత్తులు నూరుతున్నారు..

ప్రజాస్వామ్యం ఇప్పుడు బీరు బిర్యానీ నోటయ్‌
‌నాయకుల జేబుల్లో దాక్కుంటున్నది..
అభాగ్యులు అనాధలు కాళ్ళుతె గిన ఒంటెల్లా ఎదురు చూస్తున్నారు..
భువన భవనపు బావుటాకయ్‌..!!
– ‌సహచరి, మిర్యాలగూడ
(జూన్‌ 15 ‌శ్రీ శ్రీ వర్ధంతి స్మృతిలో ..)

Leave a Reply