ఒకనాటి బౌద్ధరామం, మధ్యయుగంలో కాకతీయ సామంత రాజ్యం, గోన బుద్దారెడ్డి పాలించిన ప్రాంతం, స్థానిక శివాలయంలోని శాసనం,ఆనాటి చరిత్రకు తార్కాణం.నాటి బుద్ధాపురమే నేటి భూత్పూర్ పట్టణం
కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన 44వ నెంబర్ జాతీయ రహదారిపై అటు హైదరాబాద్, బెంగుళూరుకు ఇటు శ్రీశైలం, మహబూబ్నగర్ కు జంక్షన్ ప్రాంతంగా ఉంది భూత్పూర్ పట్టణం.
అంతటి ఘనచరిత్ర,రవాణా ప్రాధాన్యాన్ని కలిగిన ప్రాంతం సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురి చెయ్యబడింది. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలిచింది.స్వరాష్ట్రంలో మేజర్ గ్రామ పంచాయతీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేయడంతో మున్సిపాలిటీగా మారింది భూత్పూర్ పట్టణం.మున్సిపాలిటీగా మారిన రెండున్నర సంవత్సరాల్లోనే రాష్ట్ర స్థాయితో పాటు జాతీయస్థాయిలో కూడా అవార్డు అందుకొని స్వరాష్ట్రంలో ప్రగతి వెలుగులు విరజింబుతుంది.2021-22 సంవత్సరంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమములో PT/CT విభాగములో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానములో నిలిచి గౌరవ పురపాలకశాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామరావు గారి ప్రశంసలు సైతం పొంది,అదే స్థాయి ఒరవడిని కొనసాగిస్తూ 2022-2023 సంవత్సరంలో 90 అంశాలు పరిగణలోకి తీసుకుని కేంద్రం ప్రకటించిన జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేక్షన్ లో ఎంపికై రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు అందుకొని ఢీల్లీ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్ఠ ను రెపరేపలాడించింది.
భూత్పూర్ మునిసిపాలిటీకి మంత్రి కేటీఆర్,శాసన సభ్యులు ఆలా వెంకటేశ్వర్ రెడ్డి గార్ల చొరవతో 21 కోట్లు మంజూరైనాయి,వైకుంఠధామ నిర్మాణానికి 1కోటి,వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ కు రెండు కోట్లు,మునిసిపాలిటీ పరిధిలోని తండాలకు బిటి రోడ్డ నిర్మాణానికి 12.52 కోట్లు, సమీకృత భావన నిర్మాణానికి ఐదున్నర కోట్లు మంజూరైనాయి.288 డబుల్ బెడ్ రూమ్స్,22 లక్షల వ్యయంతో రైతు వేదిక నిర్మించుకోవడం జరిగింది.మునిసిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు రైతులకు రైతు బంధు కింద 18 కోట్లు,రైతు భీమా కింద 44 మంది రైతు కుటుంబాలకు 2 కోట్లు,పెన్షన్ల కింద 50 లక్షలు అందజేయడం జరిగింది. ‘‘ పట్టణములో ఉత్పత్తయ్యే వ్యర్ధం కావేదీ అనర్థం’’ అన్నట్లు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చెత్తకుప్పలు ,బహిరంగ ప్రదేశాలలో డంపింగ్ యార్డులు కనిపించకుండా భూత్పూర్ పట్టణములో సేకరించిన చెత్తను 100% ఉపయోగకరమైన రీతిలో తడి చెత్త ద్వారా సేంద్రీయ ఎరువులు, పొడి చెత్తను వికేంద్రీకరించి DRCC కేంద్రానికి పంపడం జరుగుతుంది.చాలా ఏళ్లుగా కలగానే మిగిలిన పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటు నేడు భూత్పూర్ చౌరస్తాలో పారిశుద్ద్యాన్ని పంచుతుంది.
పరిశుభ్రతలో కీలక భూమిక పోషించే పారిశుద్ధ్య కార్మికులకు ఎప్పటికప్పుడు పెరిగిన జీతాలను రెగ్యులర్ గా ఇవ్వడంతో పాటుESI, EPF, , జీవితభీమా సౌకర్యం కల్పిచడం జరుగుతుంది. హరితహారం పట్టణ మణిహారం.
భూత్పూర్ మున్సిపాలిటి ఛైర్మన్ సత్తూర్ బస్వరాజ్ గౌడ్,కమీషనర్ నురూల్ నజీబ్ గార్ల పట్టుదలతో మహాబూబ్ నగర్ జిల్లాలోనే రోల్ మోడల్ గా భూత్పూర్ పట్టణ హరితహారం నిలిచింది.వివిధ వార్డులలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు,రహాదారికి ఇరుప్రక్కల 6230 ఎవెన్యూ ప్లాంటేషన్, 4400 మల్టీ లేయర్ ప్లాంటేషన్ చేయించగా నేటికి వాటి అందాలు పట్టణకి మణిహారంగా నిలిచాయి.డివైడర్ల పై 4200 మొక్కలతో పాటు పట్టణ నడిబొడ్డున చౌరస్తాలో సుందరీకరణ చేయడంతో హరితహారంలో భాగంగా భూత్పూర్ పట్టణం మొత్తం నేడు ఆహ్లాద వాతావరణం దర్శనమిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
ప్లాస్టిక్ రహిత భూత్పూర్ లక్ష్యంగా ప్రజలు మరియు పట్టణ వ్యాపారస్తులకు పలు సూచనలు,అవగాహనాలు కల్పించుటయేగాక నింబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.మహాయజ్ఞంగా మహమ్మారి సేవ. మహమ్మారిలా విజృభించిన కరోనా వైరస్ ను అరికట్టేందుకు భూత్పూర్ పాలకవర్గం మరియు శానిటరీ సిబ్బంది యుద్ధప్రాతిపదికన పనిచేస్తూ 2020లో చేసినట్లుగానే 2021లోకూడా సేవలను కొనసాగించింది.ఈ మహమ్మారిని పట్టణములో ప్రబలకుండా తెలంగాణ ప్రభుత్వ దిశానిర్దేశానుసారము భూత్పూర్ మెప్మా సిబ్బంది. పురపాలక వార్డు అధికారులు, అంగన్ వాడీ, ఆశా మరియు వైద్య సిబ్బందిని ఒక టీంగా ఏర్పాటు చేసి, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఇంటింటికి జ్వర సర్వే నిర్వహించి కరోనా వ్యాధి లక్షణములు గల వారిని గుర్తించి తగు నివారణ చర్యలతో పాటు తగిన మందులను తక్షణమే ఇచ్చిబ్లీచింగ్, సోడియం హైపోక్లోరైడ్ ను చల్లించడం, విస్తృతంగా మాస్కులను పంపిణీ చేయడం జరిగింది. ముందస్తు చర్యలను తీసుకొని పట్టణ ప్రజలకు ఎప్పటికప్పుడు తగు వైద్య సలహాలు, సూచనలు ఇస్తూ,వార్డు ప్రజలకు గౌరవ కౌన్సిలర్లు అందుబాటులో వుంటూ 24 గంటలు సేవలు అందించి పట్టణాన్ని సంక్షించుకోవటం జరిగింది.
రహదారుల రాత్రి అందాలు పట్టణకె స్వంతం.
రాత్రి అందాలు భూత్పూర్ పట్టణ సొంతం అని చెప్పే విధంగా రూ. 8.00 కోట్లతో భూత్పూర్ చౌరస్తా నుండి సాక్షి కార్యాలయము వరకు రోడ్డు విస్తరణ, సెంట్రల్ మెడియన్, సెంట్రల్ లైంటింగ్ ను గౌరవ పురపాలక శాఖామాత్యులు శ్రీ కల్వకుంట్ల తారకరామరావు మరియు గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆల వెంకటేశ్వర్ రెడ్డి గార్ల సహకారములో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన రహదారిలో రంగు రంగుల బల్బులతో అందాలు విరజిమ్మేటట్టు 3 కి.మీ. పొడవున ఎల్,ఇ,డి లైట్లు మరియు స్తంభాలకు సిరీస్ లైట్లు ఏర్పాటు చేయనైనది. అమావాస్య చీకటిలో సైతం భూత్పూర్ పట్టణం మొత్తం దగదగా మెరుస్తుంది.
భూత్పూర్ పురపాలికలో మంచినీటి సరఫరా.
తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరధ (పట్టణ) పథకం కింద ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించాలనే లక్ష్యంతో భూత్పూర్ మున్సిపాలిటిలో 587.7 లక్షలతో కొత్తగా నిర్మించిన 21 OHSRట్యాంకులు,పాతవి 8 OHSR ట్యాంకుల ద్వారా ప్రతి రోజు 1.8 వీ•ణ నీటి సరఫరా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 40,444 మీటర్ల మిషన్ భగీరథ పైప్ లైన్ వేయడం జరిగింది. 2685 వాటర్ ట్యాప్ కనెక్షన్ మిషన్ భగీరథ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు మంచినీటి సరఫరా విషయంలో అంతరాయం లేకుండా పవర్ బోర్స్ ద్వారా కూడా మంచినీటి సరఫరా చేయబడుతుంది.
వీధి వ్యాపారులకు వ్యాపార సముదాయ ఏర్పాటు వారి ఆత్మ గౌరవానికి పెద్ద పీట.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పట్టణ ప్రగతి కార్యక్రమలలో భాగంగా వీధుల వెంట, ఎండకు ఎండుతూ, వానకు నానుతూ చిరు వ్యాపారము చేసుకొనుచున్న చిన్న చిన్న వ్యాపారుల ఆత్మగౌరవమునకు సూచనగా పట్టణములో వ్యాపార సముదాయము ఒకేచోట ఉండే విధంగా వెండర్ జోన్ ఏర్పాటు చేసి,వారందరికి ఒకేచోట సురక్షిత ప్రాంతములో వ్యాపార సముదాయ దుకాణాల(స్ట్రీట్ వెండర్ జోన్) ఏర్పాటు కొరకు, భూత్పూర్ పట్టణములో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చేయడము కొరకు, నాగర్ కర్నూల్ రోడ్డు ప్రధాన రహదారి ప్రక్కన సేకరించిన 1.00 ఎకరా స్థలములో సమీకృత వెజ్ • నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేయబడుచున్నది.
సకల వసతుల ‘‘స్వర్గధామం’’ వైకుంఠధామం.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మనిషి తన జీవితంలో జీవించినపుడు ఎంత విలాసవంతమైన జీవనము గడుపుతాడో చివరి మాజిలిలో స్వర్గస్తుడైనప్పుడు కూడా వారు స్వర్గధామంలోనే చివరి మజిలి చేరుకోవాలనే సదుద్దేశ్యంలో ప్రతి పట్టణంలో మరియు పల్లెల్లో వైకుంఠధామాల నిర్మాణములు చేయవలెనని ఆదేశించినారు.భూత్పూర్ పట్టణములోని మున్సిపాలిటీ పరిధిలో 1 ఎకరా విస్తీర్ణంలో మెరుగైన సౌకర్యాలతో భోజనశాల, ఆస్తికల నిలువ కేంద్రం, స్నానం గదులు,పార్కు,మరుగుదొడ్లు తదితర సదుపాయాలతో వైకుంఠధామం ఏర్పాటు చేయడుచున్నది.. సమైక్య పాలనలో మరుగునపడిన గత చారిత్రక వైభవం స్వరాష్ట్రంలో పునర్నిర్మించుకుంటుంది.కాకతీయ,
జుర్రు నారాయణ యాదవ్,
తెలంగాణ టీచర్స్ యూనియన్,
జిల్లా అధ్యక్షులు,భూత్పూర్,మహబూబ్