- రత్నప్రభను కేంద్రమంత్రిని చేసే సత్తా సోముకు ఉందా
- వైసిపి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి
- తిరుపతి ప్రచారంలో భూమన కరుణాకర్ రెడ్డి పిలుపు
తిరుపతిలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. రేణిగుంట నుంచి శ్రీకాళహస్తి వరకు వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఎంపీ మిథున్‌రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ అభ్యర్ధి డా.గురుమూర్తి పాల్గొన్నారు. వెంకన్న పాదాల సాక్షిగా మోదీ ప్రత్యేక హోదా హావి• ఇచ్చారని.. పచ్చిద్రోహం చేసిన వారికి ఓట్లు ఎందుకు వేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నిలదీశారు. రత్నప్రభను గెలిపిస్తే కేంద్రమంత్రిని చేసే స్థాయి సోము వీర్రాజుకు ఉందా? అని ప్రశ్నించారు. టీడీపీ గెలిస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తామనడం లోకేష్ అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు బాబు, లోకేష్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని దుయ్యబట్టారు.
ఓటమి భయంతో ఎన్నికలు నిలిపివేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని భూమన నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ తిరుపతి లోక్‌సభ అభ్యర్థి గురుమూర్తి ఉన్నతమైన వ్యక్తి అని, అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గురుమూర్తిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పార్టీలకతీతంగా పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంట నడుద్దామని అన్నారు.మేనిఫెస్టోలోని హావి•లు నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్ అని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీకి వస్తున్న అదరణచూసే చంద్రబాబు జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల నుంచి పారిపోయాడు అని తెలిపారు.
ప్రతీ ఒక్కరూ ఓటుహక్కు వినియోగించు కొని జగన్ ఋణం తీర్చుకోవాలని సూచించారు. ఏడాదిన్నర పాలనలో ఊహించని సంక్షేమాన్ని ఇచ్చి సీఎం జగన్ పేదల పెన్నిధిగా నిలిచారని తెలిపారు. దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాల పక్షపాతి అని కొనియాడారు. ఉప ఎన్నికలో హేమాహేవి•లు నిలిచారని, ఎంపీగా, కేంద్రమంత్రిగా ప్రజా సంక్షేమాన్ని పనబాక గాలికి వొదిలేసారని గుర్తుచేశారు. ఇప్పుడు టీడీపీలో చేరి ఓట్లకు వస్తున్నారని చెప్పారు. సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చిన గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగన్‌కి వస్తున్న జనాదరణ చూసి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.