Take a fresh look at your lifestyle.

రైతువెన్నముక విరుస్తున్న కేంద్ర,రాష్ట్రాలు

  • భూములు ఇవ్వకపోగా..ఉన్నవి లాక్కుంటున్నారు
  • డిండి పేరుతో దోపడికీ పాల్పడుతున్నారు
  • సిఎం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ భట్టి విక్రమార్క

‌రైతులు సమస్యలు తెలుసుకొని పరిష్కారం కనుకునే ప్రయత్నంలో భాగంగానే యాత్ర చేపట్టామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. మేము రాజకీయాలు, ఎన్నికల కోసం రాలేదు. రైతుల వెన్నుముక విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను అడ్డుకునేందుకు వచ్చామని అన్నారు. రైతుల్లో ఎంతో ఆవేదన, ఆందోళన కనపడుతోంది. పేదవాళ్ళుకు కొత్తగా భూములుఇవ్వకపోగా గతంలో ఇచ్చినవి లాక్కుంటున్నారని మండిపడ్డారు. మన రాష్ట్రంలో మన నీళ్ళు, నిధులు మనకే అన్న కేసిఆర్‌ ‌నీటిపారుదల ప్రాజెక్టస్ ‌లో పెద్దయెత్తున దోపిడీ చేస్తున్నారు. డిండి పేరు వి•ద కోట్లు దోచుకుంటున్నారు కానీ అస్సలు నీళ్ళు ఎక్కడి నుండి తేస్తరో చెప్పడం లేదు. వేల కోట్లు దోచుకోవడమే తప్ప ప్రజలకు చేసింది పెద్ద సున్న అని అన్నారు.

- Advertisement -

ఏడు ఏళ్లుగా పేదలకు దక్కాల్సిన నిధులన్నీ కేసిఆర్‌ ‌దోచుకుతింటున్నడు. కొనుగోలు కేంద్రాలను ఎత్తి వేస్తా అంటున్న కేసిఆర్‌ ‌ను డిండిలో ఎత్తిపారేయాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌కింద చట్టబద్దంగా పెట్టవలసిన 1,75,000 కోట్లు గత 7 ఏళ్లు ఖర్చు పెట్ట కుండా ఈ వర్గాలను మోసం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలో లేకపోవడం వల్లే ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలు 1,75,000 కోట్లు నష్ట పోయారు.. మన డబ్బులు మనకు ఖర్చు చేసే కాంగ్రెస్‌ ‌మళ్ళీ అధికారంలోకి రావాలన్నారు. మాయపు మాటలతో మోసం చేస్తున్న కేసిఆర్‌ను ఇంటికి పంపించాలి. రైతు, మహిళ, దళిత, గిరిజన వ్యతిరేక కేసిఆర్‌ ‌ప్రభుత్వంను బంగాళాఖాతం లో కలిపేయలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

Leave a Reply