Take a fresh look at your lifestyle.

కృష్ణా జలాల సాధనకు భట్టి నిరసన దీక్ష

ఖమ్మం,జూన్‌ 2, ‌ప్రజాతంత్ర (ప్రతినిధి) : కృష్ణా జలాల సాధనకోసం మంగళవారం జిల్లా కాంగ్రె స్‌ ‌పార్టీ కార్యాలయంలో సి.ఎల్‌.‌పి.నాయకుడు మల్లు. భట్టి విక్రమార్క నిరసన దీక్ష చేపట్టారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తొలుత తెలంగాణ జెండాను ఆవిష్కరించి ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యాలయంలో దీక్షకు పునుకున్నారు. ఈ సందర్భ:గా ఆయన మాట్లాడుతూ నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మ గౌరవం కోసం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణను ఇచ్చారని అన్నారు. కానీ గత ఆరు సంవత్సరాల నుండి రాష్ట్రంలోని తెరాస ప్రభుత్వం ఆదిశగా ప్రయత్నించలేద న్నారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం ప్రస్తుతం ఫ్యూడల్‌ ‌వ్యవస్థను అమలు చేస్తుదన్నారు. అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని,రాష్ట్రంలో భూమి అంతా నాదే, నేను చెప్పిన పంటే వేయాలి అని రైతులను హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేనికోసం తెలంగాణ ఏర్పడింది అది సాధించలేక పోయాం, నియామకాలు లేవు, నిధులు లేవు, చివరకు నీళ్లు కూడా లేకుండా చేసే పరిస్థితి తయారయిందన్నారు. పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌ ‌కృష్ణా జలాలను అక్రమం గా పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ‌ద్వారా తరలిస్తున్న దన్నారు.

తెలంగాణా ప్రభుత్వం మన వాటా నీళ్లను కూడా రక్షించలేక పోతుందని, ఆంధ్ర అక్రమంగా నీళ్లను రాయలసీమకు తరలిస్తుందని , ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు వివరిం చాలని ఆలోచనతో కాంగ్రెస్‌ ‌పార్టీ పిలుపునిచ్చి జల దీక్షకు పిలుపునిస్తే ఈ ప్రభుత్వం అడుగ డుగున ఆటంకాలు సృష్టించి నాయకు లను అరెస్ట్ ‌చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు నేను పాలేరు లో జల దీక్ష నిబంధనలకు అనుగు ణంగా, భౌతిక దూరం పాటిస్తూ, చేస్తా అని చెప్పినా కూడా అనుమతి ఇవ్వకుండా హౌస్‌ అరెస్టు చేశారని అన్నారు. మా నాయకులను కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఎంపీలను హౌస్‌ అరెస్ట్ ‌చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అందులో భాగంగానే కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యాలయంలో కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ‌ద్వారా తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కృష్ణా జిల్లాల్లో వాడుకునే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్‌ ,‌మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నాయకులు సోమ్లా నాయక్‌, ‌నాగండ్ల దీపక్‌చౌదరి,జావీద్‌, ‌సలీం, కొత్తా సీతారాములు, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!