Take a fresh look at your lifestyle.

కోవిడ్‌ ‌బాధితులను ఆదుకోండి సిఎం కెసిఆర్‌కు భట్టి లేఖ

ఢిల్లీలో మెడలు వంచుతానని..వంచుకుని వొచ్చారు : సిఎం కెసిఆర్‌ ‌తీరుపై జీవన్‌ ‌రెడ్డి మండిపాటు
కొరోనా భారిన పడి ఎందరో తమ జీవితాలు, ఆస్తులను పోగొట్టుకున్నారని, వారిని ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌కు సీఏల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. ఇలాంటి కష్ట సమయంలో ప్రభుత్వం కోవిడ్‌ ‌బారిన పడి చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా వీలైనంత ఎక్కువ ప్రకటించాలని లేఖలో కోరారు. కోవిడ్‌ ‌భారిన పడి చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ ‌గ్రేషియా ఎప్పుడు ఇస్తుందని ప్రశ్నించారు. రూ. 50 వేల ఎక్స్ ‌గ్రేషియా సరిపోదని, రూ. 4 లక్షల ఎక్స్ ‌గ్రేషియా ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్‌ ‌చేశారు. రూ. 4 లక్షల పరిహారం ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రం వాదిస్తుందని, ఇది సరైన వాదన కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం పరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుందో తెలియజేయాలని భట్టి విక్రమార్క డిమాండ్‌ ‌చేశారు.

ఢిల్లీలో మెడలు వంచుతానని.. వంచుకుని వొచ్చారు: సిఎం కెసిఆర్‌ ‌తీరుపై జీవన్‌ ‌రెడ్డి మండిపాటు
సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తాగుబోతుల సంఘం అంతా కలిసి ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. మోదీ మెడలు వంచుతానని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌ ‌మెడలు వంచుకున్నారన్నారు. కొప్పుల ఈశ్వర్‌కు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రైతుల వి•ద లేదన్నారు. ప్రభుత్వ ఆఫీసర్లు మిల్లర్లకు ఏజెంట్లుగా మారారన్నారు. సీఎంకు రైతు సమస్యలపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌ ‌ప్రధాని మోదీ ఇంటి వద్ద ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు. ఆయనకు మోదీ అపాయింట్‌ ‌మెంట్‌ ఇవ్వకపోవడం తెలంగాణకు అవమానమన్నారు. ఢిల్లీకి వెళ్లిన సీఎం ఇంట్లోంచి బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. తాడో పేడో తేల్చుకుంటానని మాట్లాడిన ఆయన ఢిల్లీలో ఏం జరిగిందో ఎందుకు చెప్పలేదని నిలదీశారు.

Leave a Reply