Take a fresh look at your lifestyle.

భాషణ్ నహీ…రేషన్ దో..!

  • ప్రధాని మోడి ని అనుకరిస్తూ కశ్మీర్ ప్రజల ప్రదర్శనలు
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ: దేశంలో లాక్ డౌన్  అమలు అవుతున్నప్పుడు ప్రధాన మంత్రి మోడీ తనదైన శైలిలో ప్రజలతో కమ్యూనికేట్ చేశారు.. ఫలితంగా  ప్రధానమంత్రి పిలుపుమేరకు ప్రజలు తప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం చూసాము. ప్రధానమంత్రి చేసిన లాక్ డౌన్ కమ్యూనికేషన్ స్టైల్ ను భరత మాత శిరస్సు భాగంలో ఉన్న ప్రజలు కాపీ కొట్టారు. అవును మీరు చదివింది అక్షరాల నిజం. ప్రధానమంత్రి కమ్యూనికేషన్ స్టయిల్ ను జమ్మూ కాశ్మీర్ ప్రజలు కాపీ కొట్టారు. ఆర్టికల్ 35a ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత, కాశ్మీర్ ను పూర్తిగా లాక్ డౌన్ చేసిన విషయం మనకు తెలిసిందే. భారత మాత తల భాగంలో నివసించే ప్రజలకి నిర్బంధం, ప్రభుత్వం కనుసన్నల్లో ఉండటం అనే కష్టం కొత్త కాదు. కాశ్మీర్ ప్రజలకు కరోనా వైరస్ లాక్ డౌన్ అమలు నిజానికి కొత్తగా అనిపించే అవకాశమే లేదు. నిరంతరం కర్ఫ్యూలో ఉండే ప్రజలు….ఎవరైనా వున్నారు అంటే వారు కాశ్మీర్ ప్రజలే…  అటువంటి కాశ్మీర్ ప్రజలు ప్రధానమంత్రి లాక్ డౌన్ సమయంలో అనుసరించిన కమ్యూనికేషన్ విధానాన్ని అలవర్చుకొని తమ బాధలు ప్రపంచానికి తెలియ చెప్పటానికి ప్రయత్నం చేశారు.. జమ్మూ కాశ్మీర్ లో ఉన్న రైతులు, కార్మికులు, హాకర్స్, హైడ్రో ప్రాజెక్ట్ కర్మాగారాలలో పనిచేసే కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు మంగళవారం తమ ఇళ్ళల్లో నిలబడి చేతుల్లో నిరసన ప్లకార్డులు పట్టుకుని “ప్రసంగాలు ఆపండి  భోజనం పెట్టండి “అన్న నినాదాలు ఇచ్చారు.ఇదంతా తమ సెల్ ఫోనుల్లో రికార్డు చేసారు. తమ సెల్ఫోన్ లో చిత్రీకరించింది ప్రపంచానికి చెప్పాలి అని ప్రయత్నించారు.
bhashan nahi retion dho
తమను ప్రధాన స్రవంతి మీడియా ప్రభుత్వం చెప్పినట్టు కవర్ చేస్తుంది. అందుకే తమ బాధని దేశం నలుమూలల వున్నా తమ స్నేహితులకి పంపారు.దేశవ్యాప్తంగా అమలు అవుతున్న లాక్ డౌన్ తర్వాత దేశవ్యాపితంగా వలస కార్మికులు పడుతున్న బాధలు మన కళ్లముందే ఉన్నాయి.. కానీ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి రిపోర్ట్ అయినది అతి తక్కువ .అందుకే కాశ్మీర్ ప్రజలు అందరు భారత దేశానికి విరోధులు అన్న చందాన ప్రధాన స్రవంతి మీడియా వారిని మర్చిపోయింది. అయితే కాశ్మీర్ ప్రజలు మాత్రం మేము వున్నాం.. మా గురించి పట్టించుకోండి అని జమ్మూ కాశ్మీర్ శ్రామిక ప్రజలు ప్రధాన మంత్రిని అనుకరించి ప్రధాని దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసారు. తమ ఇళ్లలో నిలబడి తమ ఆకలి తీర్చమని ప్రధానిని డిమాండ్ చేసారు. మోడీ ఉంటే అన్ని సాధ్యం అయినప్పుడు మా ఆకలి తీరటం కూడా సాధ్యం కావాలి అని వీరు తమ ఇళ్ల వాకిళ్లలో నిలబడి ‘భాషణ్ నహి రేషన్ దో ‘అని నినాదాలు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply