Take a fresh look at your lifestyle.

‘‘బర్కత్‌ ‌తక్కువ పనులు’’!

“ఇటు రాష్ట్రంల అటు కేంద్రంల సర్కార్లు ఏం జేయాల్నో జేయకుంట,ఏం జేయద్దో జేషి చేతులెత్తేషినయి.మొత్తానికి సర్కార్‌ ‌సచ్చేటిదారులకు సడలింపులిచ్చుడు ఎంత బర్క త్‌ ‌తక్కువ పనో ఇప్పుడు మాగనే కానత్తాంది.కరోనా ఆపది  వందలల్ల వున్నప్పుడు జోర్‌ ‌దార్‌ ‌తాళాలేషి, వేలూ లచ్చల కాడికచ్చినంక ఇచ్చేటి సడలింపు సావుతోవలు జూపుడు గాక ఇంకేమైతది. ఎవలికి ఎసొంటి సావు కావాల్నో, ఇష్టమున్న తీర్గ సచ్చే సేచ్ఛనిచ్చిన సర్కార్కో దండం బెట్టాలె! “

yelamandhaఅందరనుకున్నట్టే అయితాంది.కరోనా బీమారంటు కున్నోళ్ళు పదులు,వందలుదాటి లచ్చల కాడికచ్చిండ్లు. చిన్నచిన్న దేశాలు లాక్‌ ‌డౌన్‌ ‌లేకుంటనే కరోనాను యెళ్ళ గొట్టిండ్లు.మనదేశం లాక్‌ ‌డౌన్‌ ‌జేసుట్ల ముందున్నది ,గని టెస్టింగులు జేసుట్ల యెనుకున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ టెస్టింగ్‌ ‌ల మీద పడమన్నది. టెస్టింగ్‌ ‌లే బరాబర్‌ ‌కాకుంటె బీమారి యెవలికం టుకున్నదో,యెంతమంది కంటుకున్న దో యెట్లెరుకైతది.లాక్డౌన్‌ ‌కరోనా బీమారికి మందు కాదం టె ఇనకపోతిరి. దేశదేశాలు మనదేశం దిక్కే జూడబట్టిం డ్లంటె జూడరా మరి!? దునియా మొత్తంల కరోనా సంగతి జూసుట్ల మనమే తోపన్నరు.దీపాంతలెలిగిచ్చుడు, సప్ప ట్లు గొట్టుడు,గో కరోనా ఉరుకుట్లు,గివన్ని కలిషచ్చేటి కాల మచ్చింది.వారం పది దినాల సంది ‘‘రా కొరోనా’’! ‘‘రా!’’ అ నుకుంట ‘‘లాక్‌ ‌డౌన్‌’’ ‌కాని ‘‘లాక్‌ ‌డౌన్‌’’‌ల చీకటి పడి,అంద రు నిద్రల జారినంక ‘‘కర్ఫ్యూ’’బెట్టి అడ్డగోలు సడలింపుయ్యబట్టె! జిల్లా, రాష్ట్రాలు దాటే బస్సులు మొదలైనయి.రైళ్ళు సుత కూతవెడ్తె కొరోనా ‘‘పండుగ’’ జేసుకునుడే అయితది. రైళ్ళ కూత కరోనా సావుపాటకు కోరస్‌ ‌పాడుతది. హోటల్లు,రెస్టారెంట్లు సుత తెర్సుకుంటె కొరోనా ఆకలి తీరుడే గాదుల్లా!  అజీర్ణం దాంక మోపయితది.దర్వాజల సాటున పైలంగ దాషిన దేముళ్ళందరు బొట్లుబోనాలతోని తయారైండ్లనుకుంట! అన్ని మతాల దేముళ్ళందరు దర్వాజలు దీషినిమ్మళంగ దర్శనం మాగిత్తరు గావచ్చు.ఎదురు జూషినకండ్లతోని భక్తులు ఒక్కపాలే ఎగబడ్తె భక్తి సంగతే మోగని’’కరోనా నైవేద్యం’’ దేముళ్ళకు,’’కరోనా ప్రసాదం’’ భక్తులకు మాగనే అందుతది పైలం!.

ఇటు రాష్ట్రంల అటు కేంద్రంల సర్కార్లు ఏం జేయాల్నో జేయకుంట,ఏం జేయద్దో జేషి చేతులెత్తేషినయి.మొత్తానికి సర్కార్‌ ‌సచ్చేటిదారులకు సడలింపులిచ్చుడు ఎంత బర్క త్‌ ‌తక్కువ పనో ఇప్పుడు మాగనే కానత్తాంది.కరోనా ఆపది వందలల్ల వున్నప్పుడు జోర్‌ ‌దార్‌ ‌తాళాలేషి, వేలూ లచ్చల కాడికచ్చినంక ఇచ్చేటి సడలింపు సావుతోవలు జూపుడు గాక ఇంకేమైతది. ఎవలికి ఎసొంటి సావు కావాల్నో, ఇష్టమున్న తీర్గ సచ్చే సేచ్ఛనిచ్చిన సర్కార్కో దండం బెట్టాలె! కడుపుకింత బువ్వ కావాలంటే లాక్డౌన్‌ ‌ల సుత జేషేందుకో పని దొరుకాలె! బయటికి బోయినంక పాణం దీషే కరోన కంటె ఇంట్లుంటె కడుపుల పేగుల్ని పిండేటి ఆకలిప్పుడే పిడాత పాణం తీషేటట్టున్నది! ఆకలి తోని సావు కంటె ఆకలి తీరిన సావే జరింత నయం! పొట్టాపతికి దొరికిన పనేదైనా గని జేసుకోని బతుకాలె!సాలు పొడుగున గీ బతుకు బతికేందుకు దినాంసచ్చేటోళ్ళకు కరోనా సావు లెక్కేంది!? ఛలో! కరోనాకెదురు బోవాలె! సద్ది బట్టుకోని సడకెక్కి అడ్డకాడ నిల్సుంటె అదృట్టం పనిత్తదో లేదో తెల్వదు, గని కరోనా కు ఎదు రువోయి బలయ్యే గరీబ్‌ ‌పాజిటివ్‌ ‌సావులకు సర్కార్‌ ‌జవాబుదారైతె కావాలె గదా! బీమారని అనుమానమత్తె టెస్టింగ్‌ ‌జేయాలె గని దారిపొంట బోయెటోళ్ళకు టెస్టింగ్‌ ‌లెందుకు!?అనేటి ఇగురం ముందటేసుకున్న సర్కార్‌ ‌ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శికాలను బేఖాతరు జేషిందనాలె!కొత్తల టెస్టింగ్‌ ‌సామానుకిట్ల గిరాకీ యెక్కువుండి దొరకలేదేమొ! ఇప్పుడు పుర్సత్‌ ‌గ దొరుకుతానయి. టెస్టింగ్‌ ‌లు యేపాటి జేషిండ్లు!యే లెక్కల జూపెట్టి లాక్‌ ‌డౌన్‌ ‌తీయబట్టిండ్లు!?బ్రెజిల్‌,అమెరికోళ్ళ తర్వాత మనమే మూడో నెంబర్లుంటిమి.లాక్‌ ‌డౌన్‌ ‌పెట్టాలన్నా , తీయాలన్నా యే లెక్కలు జేషిండ్లో ప్రపంచానికిజెప్పాలెకదా! ఐదో పాలి లాక్‌ ‌డౌన్‌ ‌ల యే ఇగురం లేదు!..రాష్ట్ర సర్కార్లు కరోనా ఆపదిని అడ్డం జేసుకోని ఆగం జేయ బట్టినయి. దేశ అర్ధిక రంగాన్ని అటిటు జేషేటి కార్పొరేట్‌ ఆసాములు కరోనాను కావల్సింత వాడుకున్నరు.వాళ్ళకన్న సర్కార్‌ ఒక్కాకు ఎక్కువనే జదివింది. మద్దె తరగతి, గరీబు జనాన్ని ఆగంల బడేషే ప్యాకేజీల కతలు బడ్డది.

కరోనాకు మందు లేనప్పుడు దేశప్రజల్ని కాపాడుకునేటందుకు పనికచ్చే పనేం జేషిందో సర్కార్‌ ‌జెప్పాలె గద!.కరోనా కాలంల కేంద్ర సర్కార్‌ ‌తీరు ‘‘దేవతా వస్త్రా’’లేసుకున్న తీర్గనే కొడ్తాంది. అవో జూషి దేశభక్తులంత మస్తు న్నయని సప్పట్లు కొట్టుడే చిత్రం గున్నది.పస్కలైన సంఘ పరివార జనులకే ఆ వస్త్రాలు ఫెళఫెళమెరుసుకుంట కానత్తానయి.మిగితోళ్ళందరికి యేం గానత్తానయే యెరికేనా యె! కరోనా పేరుమీద వందల అవతరాలెత్తి జనాన్ని ఆగం బట్టిచ్చే కతలపడ్డరు.కరోనా వేలల్ల అవతారాలు మార్సుకుంట, మందుకు జిక్కని బీమొరై దేశమంతట్ని ఇంకింత ఆగం జేయబట్టింది.సర్కార్లు కరోనా కాలంల ఆర్ధికరంగం దివాల దీషిందని లెక్కలు జెప్పబట్టిండ్లు. ప్రధానమంత్రి సహాయనిధి వుండంగనె ఆడిట్‌ ‌లెక్కల్లేని ఇంకో కేర్‌ ‌ఫండ్‌ అని తెరిషిండ్లు.రూపాయి కర్సు లేని ప్యాకేజీలం బరిషి జనాల షెవుల క్యాబేజీలు బెట్టిండ్లు. వానాకాలం మొదలైతె కరోనా ఇసిరేటి సవాళ్ళకు ఎదురుబడి నిల్సుండే విధానపరమైన ప్రణాళికలు సర్కార్‌తాన యేం కానత్తలేవు. కరోనా పరీక్షలు జేసుడు, దావకాన్ల తోలుడు ఈ రొండు పనులే మనల్ని కాపాడుతయి.రాష్ట్ర సర్కార్ల మైండ్‌ ‌సెట్‌ ‌మార్సుకునుడు తప్ప ఇంకో తోవ లేదు. పరీక్షలు లచ్చలు దాటనీ గాక,యేమైతది!?
మనం ఎసోంటి పరిస్థితిలున్నమో తెలుసుడైతది కదా! ప్రపంచ ఆరోగ్య సంస్థ జెప్పేటి పాఠాలు ఈ షెవితోని ఇని అవుతల షెవి తోని ఇడిషి పెట్టే కతలు బందు బెట్టాలె! సావులేని కరోనాదే సాగుబాటైతాంది, పాజిటివ్‌ ‌కేసుల లెక్కలు దినామింత పెరిగి లచ్చలల్ల బడ్డది.ఎవలికాల్లు జరంత పైలంగుండాలె! సూడ్రా!బయ్‌!ఇ‌క్రమార్క్! ఇం‌టివి కద! ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా పరీక్షలే ముఖ్యం అని అంతగా జెప్పినంక కూడ సర్కార్‌ ఎం‌దుకు పట్టించుకోలేదు గావచ్చు!? జర నా ప్రశ్నకు జవాబు చెప్పాలె! ముందుగాల మాస్కు ముక్కు మీదికి గుంజుకో! అని బెదిరిచ్చేటి భేతాళ్‌ ‌ను ఎప్పటి తీర్గనే భుజంమీద మోసుకుంట ‘‘ఇను భేతాళ్‌! ‌కరోనా విపత్తును ఆసరా చేసుకోని సర్కార్‌ ‌ప్రజా వ్యతిరేక,రాజ్యాంగ వ్యతిరేక ఆర్డినెన్స్ ‌లను తెచ్చుడే సరిపోయింది. ప్యాకేజీల పేరుతోని దేశ మూలాలను సుత ప్రయివేట్‌ ‌కార్పొరేట్‌ ‌దోస్తులకు అప్పజెప్పింది. ఈ దృష్టి తప్ప నిర్మాణాత్మక విధానాలు అమలుజేసి కరోనాను తరిమే ఆలోచన లేదు. ఉత్తర కొరియా,స్వీడన్‌,ఇ‌జ్రాయిల్‌ ‌లాంటి దేశాలు కరోనా లొల్లి లేకుంటున్నయి.నేర్సుకోవాలనుకుంటె గుణపాఠా లుంటయి. నేర్సుకోని మొండి వాళ్ళకేముంటయి. టెస్టింగ్‌ ‌కిట్లు అంతర్జాతీయ మార్కెట్ల అందుబాటులున్నయి,గని సర్కారే ప్రజలకు అందుబాట్ల లేదు’’అని జెప్పి ఎప్పటిలాగనే నడ్వబట్టిండు…నడ్వ బట్టిండు…
– ఎలమంద, తెలంగాణ

Leave a Reply