Take a fresh look at your lifestyle.

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా.. 25న భారత్‌ ‌బంద్‌

  • ఆలిండియా కిసాన్‌ ‌సంఘర్ష్ ‌సమన్వయ కమిటీ పిలుపు
  • వ్యాపారవేత్తలకు లాభం చేకూర్చే విధంగా వ్యవసాయ బిల్లు : రాహుల్‌ ‌గాంధీ ట్వీట్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈనెల 25న భారత్‌ ‌బంద్‌కు ఆలిండియా కిసాన్‌ ‌సంఘర్ష్ ‌సమన్వయ కమిటీ(ఏఐఎస్‌సీసీ) పిలుపునిచ్చింది. పంట ఉత్పత్తులను రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయకుండా నిరోధిస్తూ ప్రభుత్వం బిల్లులను రూపొందించిందని విమర్శించింది. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నందుకుగాను దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని ప్రకటించింది. కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులకు వ్యతిరేకంగా హర్‌సిమ్రత్‌ ‌కౌర్‌ ‌తన కేంద్ర మంత్రి పదవికి గురువారం రాత్రి రాజీనామాచేశారు. దానిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌కూడా ఆమోదించారు. అయితే కౌర్‌ ‌తన మంత్రిపదవికి రాజీనామా చేస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పటికే చాలా ఆలస్యమైందని కిసాన్‌ ‌మజ్దూర్‌ ‌సంఘర్ష్ ‌కమిటీ(కేఎంఎస్‌సీ) విమర్శించింది. అది ప్రజల ఆగ్రహాన్ని ఏమాత్రం తగ్గించలేదని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి సర్వన్‌ ‌సింగ్‌ ‌పంధేర్‌ అన్నారు. కేందప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక నిర్ణయాలను శిరోమణి అకాలీదల్‌ అధినేత సుఖ్‌బీర్‌ ‌సింగ్‌ ‌బాదల్‌ ‌గ్రహించినట్లయితే పార్లమెంటును గెరావ్‌ ‌చేయాలన్నారు.

వ్యాపారవేత్తలకు లాభం చేకూర్చే విధంగా వ్యవసాయ బిల్లు : రాహుల్‌ ‌గాంధీ ట్వీట్‌
‌మోదీ చేస్తున్న మోసాలు రైతులకు కాబట్టే వ్యవసాయ బిల్లులను వారు వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు. మోదీ ప్రభుత్వంపై రైతులకు ఏమాత్రం విశ్వాసం లేదని, అది గతంలో అనేక సార్లు నిరూపితం అయిందని ఆయన అన్నారు. ఈ విషయమై ట్విట్టర్‌ ‌వేదికగా ప్రధాని మోదీపై రాహుల్‌ ‌విమర్శలు గుప్పించారు. మోదీ ప్రభుత్వంపై రైతులకు విశ్వాసం ఏమాత్రం లేదు. ఎందుకంటే మోదీ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు. నోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీ, డీజిల్‌ ‌ధరలు ఇష్టారీతిన పెంచడం లాంటి అనుభవాలు వారికున్నాయి. ఇప్పుడు తెస్తున్న వ్యవసాయ బిల్లుల ద్వారా తన మిత్రులైన వ్యాపారవేత్తలకు లాభం చేకూర్చేది. రైతుల జీవనోపాధిపై దాడి చేసేంది. అందుకే రైతులు ఏకమయ్యారని రాహుల్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాలు ముగిసేలోపు మూడు అగ్రి బిల్లులను ఆమోదింపజేసేందుకు కేంద్రం ప్రభుత్వం ఓవైపు సన్నాహాలు చేస్తోంది. అయితే దీనిపై రైతుల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతోంది. ముఖ్యంగా దేశ రాజధానికి సరిహద్దు రాష్ట్రాలైనా పంజాబ్‌, ‌హర్యానా రైతులు కొద్ది రోజులుగా ఉధృతంగా నిరసనలు చేపడుతున్నారు. ఈ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన అకాళీదళ్‌ ‌నేత హర్‌ ‌సిమ్రత్‌ ‌కౌర్‌ ‌ప్రభుత్వం నుంచి గురువారం వైదొలగారు.

కొత్త మార్కెట్‌ ‌విధానం రైతులకు గొడ్డలి పెట్టు : రాష్ట్ర మంత్రి నిరంజన్‌
•ం‌ద్రం తెస్తున్న కొత్త మార్కెట్‌ ‌విధానం రైతులకు గొడ్డలిపెట్టు వంటిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. మద్దతు ధర అడిగే హక్కు రైతులకు లేకుండా పోతోందన్నారు. పంట విక్రయం సొమ్ము కూడా ఎవరిని అడగాలో తెలియదు అని చెప్పారు. కార్పొరేట్లకు దోచి పెట్టేందుకే కేంద్రం కొత్త మార్కెట్‌ ‌విధానం తీసుకువస్తోందని తెలిపారు. కొత్త మార్కెట్‌ ‌విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. దేవరకద్రలో మార్కెట్‌ ‌కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. దేవరకద్ర వ్యవసాయ మార్కెట్‌ ‌కమిటీ నూతన చైర్‌పర్సన్‌గా కొండ సుగుణ శ్రీనివాస్‌ ‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. మార్కెట్‌ ‌కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రులు నిరంజన్‌ ‌రెడ్డి, శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్‌ ‌మాట్లాడుతూ రైతులకు రోణ లేకుండా పోతుందన్నారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఫ్రీ మార్కెట్‌ ‌పేరుతో రైతులకు మద్దతు ధరలు ఎగవేసే అవకాశం ఉందన్నారు.

Leave a Reply