- తెలంగాణ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం
- ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్
- పండిట్ నెహ్రూ తరవాత అంతటి మహానేత
- పార్లమెంటులో విగ్రహం ఏర్పాటు చేయాలి
- పీవీ బహుముఖ ప్రజ్ఞతో దేశం ఆర్థికాభివృద్ది : సీఎం కేసీఆర్
- పీవీని కాంగ్రెస్ సమున్నతంగా గౌరవించింది : సీఎల్పీ నేత భట్టి
తెలంగాణ ముద్దుబిడ్డ, భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈమేరకు శాసనసభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, శాసనమండలిలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రవేవపెట్టిన తీర్మానాలను ఆయా సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. పివి శత జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం తీర్మానాన్ని సిఎం కెసిఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. దీనిపై సుదీర్ఘ చర్జ జరిగిన అనంతరం అధికార పార్టీకి చెందిన సభ్యులతో పాటు, విపక్ష కాంగ్రెస్ సభ్యులు సైతం ప్రసంగించి తీర్మానానికి మద్దతు ప్రకటించారు. అయితే సీఎం ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని టీఆర్‌ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎం వ్యతిరేకించింది. వీపీకి భాతతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన మజ్జీస్ పార్టీ ఆ సమయంలో సభ నుంచి వాకౌట్ చేసింది.ఈ మేరకు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తీర్మానంపై సుదీర్ఘంగా చర్చించిన సభ్యులు పివికి భారతరత్న ఇవ్వాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. దీంతో పీవీకి భారత రత్న పురస్కార• ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు..
పివి గ్లోబల్ లీడర్ : సీఎం కేసీఆర్
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో భాగంగా రెండో రోజైన మంగళవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ భారత దేశాన్ని అగ్రదేశాల సరసన నిలబెట్టిన గ్లోబల్ లీడర్ పివి అని, శతజయంతి ఉత్సవాలు జరుపు కుంటున్న ఈ వేళ మరణనానంతరం పివికి భారతరత్న ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త పీవీ అనీ, దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టడమే గాకుండా భారత ఖ్యాతిని దిగంతాలకు వ్యాప్తి ంపజేశారని కొనియాడారు. అనేక రంగాల్లో భారత్‌ను ప్రపంచ దేశాలతో పోటీపడేలా చేసిన పీవీ ఆర్థికరంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణల కారణంగా నేడు భారత దేశం అగ్రరాజ్యాల సరసన చేరిందని అన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ మన ఠీవి అని ఆయనకు లభించాల్సిన గౌరవం దక్కలేదన్నారు. ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వివరించారు. గ్లోబల్ ఇండియా నిర్మాత పీవీ నరసింహారావు అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో పీవీ ప్రధానిగా అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ప్రణబ్ ముఖర్జీని ఆర్థికమంత్రి చేసిన ఘనత పీవీది అని పేర్కొన్నారు. భూ సంస్కరణలకు పీవీనే నాంది పలికారని గుర్తుచేశారు.
తన సొంత భూమి 800 ఎకరాలను ప్రభుత్వానికి స్వాధీనం చేశారని కొనియాడారు. హైదరాబాద్‌లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలనీ అలాగే, పార్లమెంట్ ఆవరణలో ఆయన విగ్రహం పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రధానిగా సేవలందించే అవకాశం కొద్ది మందికే ఉంటుందనీ, ఈ పదవి చాలా అరుదుగా దక్కుతుంది. అలాంటి పదవి తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు దక్కింది. పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వాన్ని భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నాం. దేశానికి చేసిన సేవలను ప్రజలందరూ స్మరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్నది. భారత్ వేగంగా అభివృద్ధి చెందడానికి, ఆర్థిక వ్యవస్థలో పురోగమించడానికి పీవీ కారణం. పీవీ మన ఠీవీ అని తెలంగాణ సగర్వంగా చెప్పుకుంటున్న సందర్భం ఇది. పీవీ ప్రధానిగా బాద్యతలు స్వీకరించిన సమయంలో దేశం సమస్యల సుడిగుండంలో సతమతవుతోంది. ఈ సమయంలో నూతన సంస్కరణలతో దేశ ఆర్థికరథాన్ని పీవీ ప్రగతి రథంలో పరుగులు పెట్టించారని గుర్తు చేశారు. ప్రధాని పదవికి చేపట్టిన మొట్టమొదటి దక్షిణాది వ్యక్తిగానే కాకుండా రాజకీయాలతో సంబంధంలేని ఆర్థికవేత్త మన్మోహన్‌ను ఆర్థిక శాఖ మంత్రిగా నియమించి పీవీ తన ప్రత్యేకతను చాటుకున్నారు.
సరళీకృత విధానాలతో దేశ ఆర్థిక గమనాన్ని మార్చివేశారు. సగటు భారతీయుని జీవన శైలి మారడంలో కూడా పీవీ దార్శనికత ఉంది. గ్లోబల్ ఇండియా రూపశిల్పి పీవీ. పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితాలను నేడు మనం అనుభవిస్తున్నాం. ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన తొలి వ్యక్తి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అయితే..రెండో వ్యక్తి పీవీ అని శ్లాఘించారు. రాష్ట్ర విద్యామంత్రిగా గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. కేంద్రంలో మానవ వనరుల శాఖ మంత్రిగా నవోదయ విద్యాలయాలు ప్రారంభించారు. ఈ విద్యాలయాల్లో చదివిన వారు ఎందరో ఉన్నత పదవుల్లో ఉన్నారు. తెలుగు అకాడని నెలకొల్పిన ఘనత కూడా పీవీకే దక్కుతుందన్నారు. పీవీది సమున్నత వ్యక్తిత్వం. మ•న్నత తాత్వికవేత్త. అఖండమైన పాండిత్యం ఉన్న వ్యక్తి. రాజకీయాల్లో మునిగితేలుతూనే వేయి పడగలు అనే నవలను హిందీ భాషలోకి అనువాదం చేశారు. ఈ నవల ఇతిహాసం వలే ఉంటుంది. ఈ నవలతో పీవీ పాండిత్యం ఏమిటో అర్థమవుతుంది. పీవీ దేశానికి, రాష్ట్రానికి ఎన్నో సేవలందించాలరు. అలాంటి మ•న్నత వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.