- దిల్లీ హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభం
- యాత్రలో రాహుల్‌తో కలసి నడిచిన రా మాజీ చీఫ్ అమర్జిత్ సింగ్ దులత్
- యూపిలో ప్రవేశించగానే స్వాగతించిన ప్రియాంక
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,జనవరి3: భారత్ జోడో యాత్రను తిరిగి ప్రారంభించిన రాహుల్.. భారీ జనసందోహం మధ్య ఢిల్లీలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. దిల్లీలో యాత్ర తిరిగి ప్రారంభమైన ఈ సందర్భంగా.. ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ స్పెషల్ డైరెక్టర్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) మాజీ సెక్రటరీ అమర్జిత్ సింగ్ దులత్ రాహుల్ గాంధీతో కలిసి యాత్రలో పాల్గొన్నారు. రా నుంచి పదవీ విరమణ తర్వాత ఏఎస్ దులత్ జనవరి 2000 నుంచి మే 2004 వరకు ప్రధాన మంత్రి కార్యాలయంలో జమ్మూకాశ్మీర్ విషయంలో సలహాదారుగా కూడా పనిచేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం నుంచి పునఃప్రారంభం అయ్యింది. శీతాకాలం 9 రోజుల విరామం అనంతరం మళ్లీ ప్రారంభం కావడం విశేషం. ఇప్పటి వరకు యాత్ర 110 రోజులు, 3000 కి. సాగింది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి వద్ద ప్రారంభమైన యాత్ర.. తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్టాల్ర దుగా సాగి దిల్లీ వరకు చేరుకుంది.
ఈ రోజు ఉదయం దిల్లీ లోని ఎర్రకోట సపంలోని హనుమాన్ దేవాలయం నుంచి యాత్ర ప్రారంభం అయ్యింది. ప్రముఖ వ్యాపారవేత్తలు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీలు దేశంలోని అగ్రనాయకులను కొనుగోలు చేయగలిగారు కాని తన సోదరుడిని ఎవరూ కొనలేరని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. తన సోదరుడు సత్యాన్ని నిలబెట్టాడని.. రాహుల్ గాంధీని చూసి ఆమె గర్వపడుతున్నట్లు చెప్పారు. అనంతరం దిల్లీ నుంచి ఉత్తర్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్రకు ప్రియాంక గాంధీ స్వాగతం పలికారు. ఈ ప్రాంతం ఒకప్పుడు భారీ రైతు నిరసనలకు వేదికైందని ప్రియాంక గాంధీ అన్నారు. యూపీలో భారత్ జోడో యాత్రను స్వాగతిస్తున్నందుకు తాను సంతోషంగా ఉన్నానని చెప్పారు. 3,000 కిలోటర్ల పాదయాత్ర తర్వాత కవాతు ఇక్కడకు చేరుకుందన్నారు.
తన సోదరుడిని జోడో యాత్రకు వ్యతిరేకంగా ఎన్నో శక్తులను ప్రయోగించారని అయినా అతడు వెనకడుగు వేయలేదని ప్రియాంక చెప్పారు. ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్‌ల దుగా జమ్ముకశ్మీర్ చేరుకుంటుందని తెలిపారు. జనవరి 30న జాతీయ జెండా ఆవిష్కరణతో యాత్ర ముగియనుంది. చివరి రోజు యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే సభలో రాహుల్ ప్రసంగిస్తారు. ఈ యాత్ర కాంగ్రెస్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచి పోతుందన్నారు. జోడో యాత్రలో తాము కూడా పాల్గొంటామని జేడీయూ ప్రకటించింది. నితీశ్ మాత్రం యాత్రకు దూరంగా ఉంటారని తెలిపారు. బుధవారం ష్లా దుగా వెళ్లి జనవరి 5 సాయంత్రం పానిపట్‌లోని సనౌలీ దుగా హర్యానాలోకి ఈ యాత్ర ప్రవేశించనుంది. వర్షాకాలంలో కూడా రాహుల్ వానలో తడుస్తూ పాదయాత్ర చెప్పట్టారు.