Take a fresh look at your lifestyle.

మోడి కార్పోటికరణ నుండి దేశాన్ని కాపాడుకుందాం..! నల్ల చట్టాల రద్దుకై పోరాడుదాం..

సి.పి.ఎం,సిపిఐ, కాంగ్రెస్, తెలంగాణ ఇంటి పార్టీ, కెవిపిఎస్, విద్యావంతుల వేదిక

దేశం కోసం ధర్మం కోసం న్యాయం కోసం బిజెపి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మోడి అధర్మ పాలన చేస్తూ దేశాన్ని అన్యాయం అన్యాయం గా అప్పనంగా కార్పోరేట్ శక్తులకు అప్పజెపుతున్నాడని తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్ ధ్వజమెత్తారు.

కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మరియు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే మోడి అనేక విధానాలను నిరసిస్తూ భారత్ బంద్ ను విజయవంతం చేయాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపు లో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో సి.పి.ఐ,సిపిఎం, కాంగ్రెస్, తెలంగాణ ఇంటిపార్టీ,సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ,టిడిపి తెలంగాణ విద్యావంతుల వేదిక, కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం మరియు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నల్లగొండ బస్టాండ్ ముందు బైఠాయించడం జరిగింది. బస్సు లను అడ్డుకునే సందర్భంలో పోలీసులకు,నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగింది అనంతరం అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్టేషన్ కు తరలించడం జరిగింది.

అదానీలకు అంబానీలకు ఊడిగం చేసే విధానాలు దేశ ప్రయోజనాల కు భంగకరం.. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్

ఈ సందర్భంగా డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తోడు దొంగలై అరాచక పాలన చేస్తున్నారని ఇది దేశానికి ఏ మాత్రం మంచిది కాదన్నారు.పరిశ్రమలలో పనిచేసే కార్మికులు సంఘం పెట్టుకోవాలంటే కూడ యాజమాన్యం అనుమతి తీసుకోవాలి అనడం అంటే కార్మిక హక్కులను కాలరాయడమే అన్నారు. కేంద్రంలో రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చిన బిజెపి.. అంబానీ ఆదానీ లకు అనుకూలంగా విధానపరమైన నిర్ణయిలు తీసుకుంటున్నారని అన్నారు. మోడి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు సంవత్సరం నుంచి కుటుంబాల తో నిరాహార దీక్ష చేస్తున్నా చీమకుట్టినట్లు లేదన్నారు.పార్లమెంట్ లో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన తెరాస నేడు అరెస్ట్ చేయించడం దుర్మార్గమన్నారు.కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పి రైతు చట్టాలకు వ్యతిరేకంగా కలిసి రావాలన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలవి నిరంకుశ విధానాలు సి.పి.ఎం జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డి
ప్రజా ఆకాంక్ష లను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ విధానాల ను అవలంభిస్తున్నాయని సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు.ఢిల్లీ సరిహద్దుల్లో గత పది నెలలుగా రైతులు శాంతియుతంగా రైతులు ఆందోళన కొనసాగిస్తుంటే బిజెపి ఆటంకం కలిగిస్తుందన్నారు. ఆ.ఎస్.ఎస్.బిజెపి శక్తులు రైతు ల పై దాడులు చేస్తున్నాయన్నారు. గడ్డకట్టే చలిలో..మండే ఎండ లో రైతులు ఆందోళన కొనసాగిస్తుంటే మోడికి మానవత్వం లేకుండా కార్పొరేట్ శక్తుల ప్రయోజనం గా ముంధుకు పోతున్నారన్నారు.వ్యవసాయ చట్టాలను,విద్యుత్ సవరణ బిల్లులను ఊపసంహరించుకునేంతవరకు పోరాటం ఆగదన్నారు.

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి.. సి.పి.ఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయకుండా..రైతు ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ఉద్యమంలో చీలికలు తీసుకురావడానికి బిజెపి అనేక ప్రయత్నాలు చేస్తుందని ఇది దుర్మార్గామైన చర్య సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు.బిజెపి రాజకీయ దురుద్దేశంతో నే..రైతులు చేస్తున్న పోరాటాన్ని నీరుగార్చేందుకు తప్పుడు ప్రచారం చేస్తుంధన్నారు. డిల్లీ ఉధ్యమంలో ఆరువందల యాభై మందికి పైగా రైతులు మరణించినా వేలాది మంది రైతులు గాయపడ్డా ప్రభుత్వాలకు కనికరం లేదన్నారు.

మోడి కేసీఆర్ ను గద్దె దించేంతవరకు ఐక్యం గా పోరాడుదాం… తండు సైదులు గౌడ్,మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

దేశంలో రోజురోజుకీ నిత్యవసర వస్తువులు ధరలు, డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు,నూనె ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తండు సైదులు గౌడ్,గుమ్మల మోహన్ రెడ్డి అన్నారు. ఇటు రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు రోజు రోజుకి వందలకుపైగా అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్నారు. దేశంలో రాష్ట్రంలో దళితులను ఆదివాసులు మోసం చేస్తూ తరతరాలుగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆదివాసుల దగ్గర నుండి వ్యవసాయ భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ రాష్ట్రంలో అనేక మంది రైతులకు రైతులకు బేడీలు వేసిన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ వాళ్ళ ని గద్దె దించడానికి ఐక్యం గా కలిసి పోరాడుదామన్నారు.

కేసీఆర్ ద్వంద వైఖరి సరికాదు. పందుల సైదులు తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు

నూతన వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ లో బిజెపి ప్రవేశపెట్టిన సందర్భంలో కేసీఆర్.. ఇప్పుడు అనుకూలంగా వ్యవహరించడం వారి ద్వంద వైఖరికి నిదర్శనమన్నారు.ఈ కాంట్రాక్టు చట్టాల వల్ల బడా కంపెనీలు కోరిన వాణిజ్య పంటలు పండిస్తూ వారి లాభాపేక్ష కోరికను తీర్చాలే తప్ప రైతులు తమకు అవసరమైన ఆహారధాన్యాలు పండించుకునే స్వేచ్ఛ కూడ కూడ ఉండదన్నారు. తద్వారా రైతులు తమ హక్కులను కోల్పోతారు అన్నారు..నూతన విద్యుత్ సవరణల బిల్లు ద్వారా మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రలను బిజెపి ఉపసంహరించుకోవాలన్నారు. మొత్తానికి ప్రభుత్వం వ్యవసాయ రంగం నుండి తప్పుకొని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.కార్మికవర్గ హక్కులను కాలరాసే లేబర్ కోడ్ లను రద్దు చేయాలన్నారు.ఆదివాసులు తదితర ప్రాంతాల్లో సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు

ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే ప్రైవేటీకరణ ఆపాలి.. కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున

ధరలు విపరీతంగా పెరిగి, దాని ప్రభావం వ్యవసాయం మీద పడి, ఆదాయాలు తగ్గాయన్నారు.లాక్ డౌన్ మూలంగా ఇప్పటి వరకు కోటిన్నర ఉద్యోగాలు పోయాయన్నారు. ఫలితంగా పేదరికం పెరిగి, 24కోట్ల మంది ఒక పూట కూడ తిండి కరువై ఆకలితో ఆలమటిస్తున్నారన్నారు. 14కోట్ల మంది నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు.ఇవేవి పట్టించుకోకుండా వ్యవహరీస్తున్నారన్నారు. బిఎస్ ఎన్ ఎల్,ఎల్ ఐ సి రైల్వేలను,ప్రభుత్వ బ్యాంకు లను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పి ఉద్యోగాలు ఊడపీకుతున్నారన్నారు.

అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ బిజెపి ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడగు ప్రభావతి

బిజెపి కార్పొరేట్లకు లక్షల కోట్లు దోచిపెట్టి చిన్న సన్న కారు వ్యాపారులను దీవాళ తీయించారన్నారు.దేశాన్ని అప్పుల పాలు చేసి మహిళలపై అత్యాచారాలు, డ్రగ్స్, అక్రమ రవాణాకు కేరాఫ్ గా బిజెపి నిలిచిందన్నారు. అందుకే ఈ బంద్ లో దేశం లోని యావత్తు ప్రజలు పాల్గొంటున్నారన్నారు.

ఈ బంద్ లో సిపిఎం నాయకులు ఎండి సలీం,పుచ్చకాయల నర్సిరెడ్డి, తుమ్మల వీరా రెడ్డి, దండంపల్లి సత్తయ్య, కొండా అనురాధ,నలుపరాజు సైదులు, సరోజ,భూతం అరుణ కుమారి,ఉమారాణి, సి.పి.ఐ జిల్లా కార్యవర్గ సభ్యులు,లోడంగి శ్రవణ్ కుమార్, పల్లా దేవేందర్ రెడ్డి, ఏ.ఐ.వై.ఎప్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు,ఏఐఎస్ఎప్ జిల్లా కార్యదర్శి బరిగెల వెంకటేష్, గాదెపాక రమేష్, సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఇందూరు సాగర్,బొమ్మిడి నగేష్,టిడిపి నాయకులు ఎల్.వి యాదవ్ ,బి.ఎస్.పి నాయకులు యాదగిరి,తెలంగాణ ఇంటిపార్టి నాయకులు కొండేటి మురళి, జయచందన్ ,దినేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply