Take a fresh look at your lifestyle.

‌గ్రీన్‌ ‌ఛాలెంజ్‌ ‌పోస్టర్‌ను రూపొందించిన భద్రు

మణుగూరు మండలంలోని సాంబాయిగూడెం జిల్లా ఉన్నత పాఠశాలలో మంగళవారం గ్రీన్‌ ‌ఛాలెంజ్‌ ‌పోస్టర్ల రూపకల్పన కార్యక్రమం నిర్వహించారు. 5వ రోజు జరిగిన బాలల దినోత్సవం కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ ‌రేగా కాంతారావు మాట్లాడుతూ ప్రతీ పాఠశాలలో విద్యార్ధులు మరియు ఉపాధ్యాయులు గ్రీన్‌ ‌చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలను దత్తత తీసుకుని పరిరక్షించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాడాలని సూచించారు.

అందులో భాగంగానే సాంబాయిగూడెం ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు భద్రు ప్రతీ రోజు విద్యార్దులతో పాటు మొక్కలకు నీరు పోసి విద్యార్దులు మొక్కలను దత్తత తీసుకునే విధంగా సూచించారు. మొక్కలను పరిరక్షించటంలో గ్రీన్‌ ‌పాఠశాలగా చేయటం కోసం ఆయన కృషి చేస్తున్నారు. అందులో భాగంగా విద్యార్దులతో గ్రీన్‌ ‌ఛాలెంజ్‌ ‌పోస్టర్లను ఆకర్షణీయ ఆకారంలో రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జీ హెచ్‌యం వెంకమ్మ, ఉపాధ్యాయులు సారయ్య, కల్పన దేవి, తిరుపతిరాఆవు, బాలు, రవి బాబు పాల్గొన్నారు.

Leave a Reply