Take a fresh look at your lifestyle.

లలితా మహాత్రిపుర సుందరి గా భద్రకాళి అమ్మవారు

వరంగల్‌ ‌ శ్రీ భద్రకాళీ దేవస్థానంలో దేవీశరన్నవరాత్ర మహోత్సవములు ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం గం।। 4-00లకు ప్రారంభమైన ఆలయ నిత్యాహ్నికం ప్రాతఃకాల పూజకాగానే అమ్మవారికి నవరాత్ర విశేష సేవలు ఆరంభింపబడ్డాయి. ఐదవ రోజు శరన్నవరాత్ర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మవారు ‘‘లలితా మహాత్రిపుర సుందరి’’గా అలంకరింపబడి నవదుర్గా క్రమంలోని ఐదవదరోజు స్కందమాత దుర్గా క్రమంలోనూ మరియు బోధాయన ప్రోక్త దేవపూజా విధిననుసరించి ధూమ్రహా క్రమంలో పూజారాధనలు అనంతరం ఉదయం అమ్మవారికి గంధోత్సవం నిర్వహించి సాయంకాలం సాలభంజిక వాహనం మీద అమ్మవారిని ఊరేగించారు. బుధవారం మూలానక్షత్రం నవరాత్ర విధిననుసరించి పుస్తకరూపిణీ సరస్వతీ పూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని మహబూబాబాద్‌ ఎం.ఎల్‌.ఏ ‌శంకర్‌నాయక్‌ ‌సతీమణి డా।। సీతామహాలక్ష్మి, యం.జి.యం హాస్పటల్‌ ‌వరంగల్‌ నిర్వహించారు. బుధవారం కార్యక్రమాలకు ఉభయదాతలుగా వాగ్దేవి విద్యాసంస్థల అధినేతలు చందుపట్ల దేవేందర్‌రెడ్డి-వాణీదేవి-వాహినీదేవి దంపతులు, నగర ప్రముఖ కార్డియాలజిస్ట్ ‌డా।। రామక శ్రీనివాస్‌-‌వాణి దంపతులు, తెలంగాణా రాష్ట్ర డ్రగ్స్ ‌కంట్రోలర్‌ ‌బి. వెంకటేశ్వర్లు-సునీత దంపతులు, డా।। బి. సనత్‌కుమార్‌, ‌కుమారి డా।। బి. వైష్ణవి, కుందూరు రవీందర్‌ ‌రెడ్డి-సుకన్య దంపతులు, హరికృష్ణ-స్మిత అర్చితవాణి, రుక్మిలు వ్యవహరించారు. పండుగ సందర్భంగా అధిక సంఖ్యలో వచ్చే భక్తుల సౌకర్యార్థం క్యూ సిస్టమ్‌ ఏర్పాటు చేయడడానికి కావలసిన ఖర్చులు శంకర్‌నాయక్‌ తమవంతు విరాళంగా సమకూర్చినట్లు కార్యనిర్వహణాధికారి,శ్రీ భద్రకాళీ దేవస్థానం ప్రకటనలో పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply