Take a fresh look at your lifestyle.

శ్రీ‌సీతారాముల కల్యాణముకు టిక్కెట్లు సిద్దం

నేటి నుండి భక్తులు ఆన్‌లైన్‌ ‌ద్వారా కొనుగోలు చేసే అవకాశం
భద్రాచలం,మార్చి 04 (ప్రజాతంత్ర ప్రతినిధి) : భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి తిరుకల్యాణ మహోత్సవం ఏప్రిల్‌ 21‌వ తేదీన నిర్వహించనున్నారు. 22 వ తేది మహాపట్టాభిషేకం నిర్వహిస్తారు. ముందుగా ఏప్రిల్‌ 13 ‌నుండి 27వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

ఇందుకోసం స్వామివారి కల్యాణానికి మరియు మహాపట్టాభిషేకం వీక్షించే భక్తులకు 5000/-,2000/-, 1116/-,500/-,200/-, 100/- రూపాయలు విలువగల సెక్టారు టిక్కెట్లు మార్చి 5వతేదీ శుక్రవారం నుండి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు దేవస్థానం ఇఓ శివాజీ తెలిపారు. ఆసక్తిగల భక్తులు శ్రీస్వామివారి కల్యాణోత్సవం మరియు పట్టాభిషేకం టిక్కెట్లను www.bhadrachalamonline.com  ఆన్‌లైన్‌ ‌ద్వారా పొందవచ్చని తెలిపారు. కాగా 5000/- శ్రీరామనవమి కల్యాణ ఉభయం టిక్కెట్లు కార్యాలయం నందుకూడ విక్రయించబడతాయని తెలిపారు. మిరిన్ని వివరాల కోసం 08743-232428ను సంప్రదించాల్సిందిగా కోరారు.

Leave a Reply