Take a fresh look at your lifestyle.

రామాలయంలో అపచారం నిత్య అన్నదాన సత్రంలో వర్ధంతి భోజనాలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం నిర్వహించే నిత్యాన్నదానం సభలో అపచారం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి 50వ సంవత్సరం వర్ధంతి సందర్భంగా ఏకంగా నిత్యాన్నదాన సత్రంలోనే వర్ధంతి భోజనాలు ఏర్పాటు చేసారు. సుమారు 30 మంది ఈ వర్ధంతి భోజనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయంపై భక్తుల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అంతేకాకుండా వర్ధంతి కార్యక్రమంకు సంబంధించిన వ్యక్తి ఫ్లెక్సీని కూడ నిత్యాన్నదానం సత్రంకు కట్టడంపై పలు విమర్శలకు దారితీసింది. దేవస్థానం అధికారులు ఇటువంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

భద్రాచలం పుణ్యక్షేత్రంలో ప్రతీ రోజు స్వామివారి దర్శనం కోసం వొస్తూంటారు. వారికి దేవస్థానం టోకెన్‌ల ద్వారా నిత్యాన్నదాన సత్రంలో భోజన సదుపాయం కల్పిస్తారు. మంగళవారం జరిగిన వర్ధంతి భోజనాల సంఘటనతో భక్తులు తీవ్ర నిరాశ చెందారు. వర్ధంతి భోజనాల అనంతరం చనిపోయిన వ్యక్తి జ్ఞాపకార్ధం ఒక గిఫ్ట్‌ను కూడ అందచేసారు. ఈ జ్ఞాపకార్థ గిఫ్ట్‌ను కొంతమంది రామభక్తులు తెలియక స్వీకరించారు. తరువాత జ్ఞాపకార్థ గుర్తు అని తెలిసి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.

Leave a Reply