Take a fresh look at your lifestyle.

ఇద్దరు బాలనేరస్థులను అదుపులోకి తీసుకున్న భద్రాచలం పోలీసులు

వివరాలు వెల్లడించిన భద్రాచలం ఏఎస్పీ డా. వినీత్‌

భద్రాచలం,ఆగష్టు 11 (ప్రజాతంత్ర ప్రతినిధి) : భద్రాచలం పట్టణంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు బాలనేర స్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు రుజువైనట్లు భద్రాచలం ఏఎస్పీ డా.వినీత్‌ ‌తెలిపారు. బుధవారం ఏఎస్పీ కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. భద్రాచలం టౌన్‌ ‌సిఐ స్వామి మరియు సిబ్బంది ఇద్దరు బాల నేరస్తులను అదుపులోకి తీసుకొని విచారిం చంగా వారు (6) దొంగతనాలు భద్రాచలంలో మరియు ఒక ఆటొ దొంగతనం ఖమ్మం 2 వ టౌన్‌ ‌పరిది లో చేసినారని ఒప్పుకున్నట్లు తెలిపారు. గురజాపు రవి అనున తను వీరి వద్ద నుండి చోరీ సొత్తు స్వీకరించాడని ఏఎస్పీ వివరిం చారు.. వీరి ముగ్గురి వద్ద నుండి దొంగిలించబడిన సొత్తు అనగా నగదు, బంగారు ఆభరణాలు, టివి లు, ఎలెక్ట్రానిక్‌ ‌పరికరాలు, ఆటొ-1 మొత్తం రూ. 5,99,200 విలువ గల వాటిని స్వాధీపరచుకోవడం రిగిందని తెలిపారు,ఒక బాల నేరస్థుడికి క్రిమినల్‌ ‌హిస్టరి ఉన్నదని తెలిపారు.

గతంలో ఇతని మీద (7) కేసులు ఉన్నాయని, దుమ్ముగూడెం పోలీసు స్టేషన్‌ ‌లో 2 కేసులు, యటపాక లో 1 కేసు, టేకులపల్లి లో ఒక కేసు, బూర్గం పహాడ్‌ ‌లో 1 కేసు, భద్రాచలంలో 1 కేసు మరియు ఖమ్మం (2) టౌన్‌ ‌లో ఒక కేసు ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఇట్టి కేసులలో ఇతనిని జువైనల్‌ ‌జస్టిస్‌ ‌బోర్డు వారి ముందు హాజరు పరచగా బెయిల్‌ ‌పై విడుదలై మళ్ళీ వరుసగా దొంగతనాలు చేస్తూనే ఉన్నాడని తెలిపారు.మరొక బాల నేరస్థుడు మొదటి బాల నేరస్థుడికి సహచ రుడు, వీరిద్దరు కలిసి భద్రాచ లంలో 5 ఇండ్ల లో దొంగతనాలు మరియు ఖమ్మం 2 టౌన్‌ ‌పరిదిలో ఒక ఆటొ దొంగతనం చేసారని అన్నారు. గురజాపు రవి,ఐటిడిఏ రోడ్‌ ‌భద్రాచలం, దుమ్ముగూడెం పైన చూపిన బాల నేరస్తుల వద్ద నుండి చోరీ సొత్తు కొన్నట్లు తెలిపారు.వీరు రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇండ్లను ఎంచుకొని గడ్డ పలుగులతో తాళాలు పగులగొట్టి దొంగతనం చేస్తున్నారని తెలిపారు. ఇట్టి కేసులను తన పర్యవేక్షణలో సి.సి.టి.వి. ఫుటేజ్‌ ఆధారంగా ఫింగర్‌ ‌ప్రింట్‌ ‌యూనిట్‌ ‌మరియు కొత్తగూడెం సిసిఎస్‌ ఇన్స్పెక్టర్‌ ‌వారి సహకారంతోటి. స్వామి, ఎస్‌హెచ్‌ఓ ‌భద్రాచలం టౌన్‌ ‌మరియు సిబ్బంది (7) చోరీ కేసులను ఛేదించారని తెలిపారు.. చోరీ కేసులు ఛేదించినందుకు గాను భద్రాచలం ఏఎస్‌పి వీరిని అభినందించినారు.

భద్రాచలం పట్టణ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి: భద్రాచలం పట్టణ పోలీసు వారు వాట్సాప్‌ ‌నెంబర్‌ 8125-436-437‌ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఎవరైనా ఇంటికి తాళాలు వేసి ఊరికి వెళ్ళితే వారు ఈ నెంబర్‌ 8125-436-437 ‌కు వారి ఇంటి నెంబర్‌, ఏరియా, ఏ రోజు నుండి ఏ రోజు వరకు వెళతారో తదితర వివరములను వాట్సాప్‌ ‌మెసేజ్‌ ‌ద్వారా గాని, టెస్ట్ ‌మెసేజ్‌ ‌ద్వారా గాని తేలియపరిచినచో వారి ఇండ్ల మీద రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘా ఉంచబడుతుందని తెలిపారు.

Leave a Reply