Take a fresh look at your lifestyle.

సెల్ఫ్ ‌లాక్‌డౌన్‌ ‌పాటిస్తున్న భద్రాచలం పట్టణ వ్యాపారస్తులు

కోవిడ్‌ -19 ‌వైరస్‌ ‌వ్యాప్తి ఉధృతంగా కొనసాగు తున్న నేపధ్యంలో భద్రాచలం చాంబర్‌ ఆఫ్‌ ‌కామర్స్ ‌గతరెండు రోజులుగా చర్చోపచర్చల అనం తరం పట్టణంలోని వ్యాపార సముదాయాలను ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయానుసారం సోమవారం నాడు భద్రాచలం పట్టణంలోని అన్నీ రకాల వ్యాపారస్తులు సాయంత్రం 6 గంటలకు తమ దుకాణాలను స్వచ్చందంగా మూసివేసారు.

భద్రాచలంలో వ్యాపార సముదాయాలు 6 గంటల వరకే కొనసాగుతాయని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు తమ అవసరాలను 6గంటల లోపు ముగించుకోవాలని చాంబర్‌ ఆఫ్‌ ‌కామర్స్ ‌భాధ్యులు తెలిపారు.  హోటళ్ళు, మందుల షాపులు ప్రభుత్వ నియమాల ప్రకారం నడుపుకోవచ్చని తెలిపారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!