Take a fresh look at your lifestyle.

రామాయణ సర్క్యూట్‌లో భద్రాచలం

  • అలంపూర్‌ ‌జోగులాంబ దేవాలయ అభివృద్ధికి రూ.35 కోట్లు
  • కెనడా నుంచి అన్నపూర్ణ విగ్రహం
  • యూపి ప్రభుత్వానికి అప్పగింత
  • త్వరలోనే ఏపీకి సంబంధించిన ఒక విగ్రహం అప్పగింత
  • కేంద్ర పర్యాటక శాఖ మంత్రి  కిషన్‌రెడ్డి వెల్లడి

దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలంను రామాయణ సర్క్యూట్‌లో చేరుస్తున్నామని కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. భద్రాచలం వద్ద  భక్తుల మౌలిక సౌకర్యాల కోసం అవసరమైన నిధులు మంజూరు చేస్తామని అన్నారు. భద్రాచలం విషయంపై స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైల్వే శాఖతో మాట్లాడారని తెలిపారు. రామాయణ సర్క్యూట్‌లో ఏపీలోని అంజనాద్రిని చేర్చెందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.  ఆయన గురువారం వి•డియాతో మాట్లాడుతూ..దానికి సంబంధించిన ప్రతిపాదన తమ ముందుకు వొస్తే పరిశీలిస్తామని తెలిపారు. అలంపూర్‌ ‌జోగులాంబ దేవాలయ అభివృద్ధికి రూ.35 కోట్ల మంజూరు చేశామని తెలిపారు. వందల ఏళ్ల కింద దేశం నుంచి కెనడా తరలిపోయిన అన్నపూర్ణ విగ్రహాన్ని యూపి ప్రభుత్వానికి అప్పగించామని పేర్కొన్నారు.

ఏపీకి సంబంధించిన ఒక విగ్రహాన్ని త్వరలోనే రాష్ట్రానికి విగ్రహం ఇస్తామని చెప్పారు. వందల ఏళ్ల కిందట దేశం నుంచి అనేక విగ్రహాలు దేశం నుంచి బయటకు వెళ్లిపోయాయని తెలిపారు. వాటిని తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. వందేళ్ల క్రితం దొగిలించబడిన అన్నపూర్ణ దేవి విగ్రహం తిరిగి భారత్‌కు రప్పించింది కేంద్ర ప్రభుత్వం..18వ శతాబ్దానికి చెందిన అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి గురువారం ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వానికి అప్పగించారు. వదేళ్ల క్రితం చోరీకి గురైన ఈ విగ్రహాన్ని కెనడాలో గుర్తించారు. కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన కేంద్రం..చివరకు అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని వెనక్కి తీసుకువచ్చింది. ఇక, మాత అన్నపూర్ణా దేవి యాత్ర పేరుతో 4 రోజులపాటు విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించనున్నారు.. ఈనెల 15న కాశీ విశ్వేశ్వర ఆలయంలో అన్నపూర్ణా దేవి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది.

యూపీ సీఎం యోగి చేతుల వి•దుగా ఈ విగ్రహం పునఃప్రతిష్ట చేయనున్నారు.. ఇక, 100 ఏళ్ల క్రితం దొగిలించబడిన అన్నపూర్ణ దేవి విగ్రహం తిరిగి యూపీ ప్రభుత్వానికి అందించడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. కెనడా ప్రభుత్వంతో అనేక సంవత్సరాలు సంప్రదింపులు జరిపి అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని వెనక్కి తీసుకొచ్చామని వెల్లడించారు. మరికొద్ది రోజుల్లో తమిళనాడు, ఆంధప్రదేశ్‌, ‌రాజస్థాన్‌ ‌ప్రభుత్వాలకు సైతం విదేశాల్లో ఉన్న విగ్రహాలు అందజేయనున్నట్టు తెలిపారు. భారత సంస్కృతికి చెందిన విగ్రహాలు వివిధ దేశాల్లో ఉన్నాయన్న కిషన్‌రెడ్డి..సాధు, సంతుల దీవెనలతో, విదేశాల్లోని విగ్రహాలు, చిహ్నాలు, చిత్రపటాలు ప్రధాని నరేంద్ర మోడీ వెనక్కి తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. విదేశాల్లోని విగ్రహాలు వెనక్కి తీసుకువచ్చిన ప్రధాని మోడీకి దేశ ప్రజల తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply