Take a fresh look at your lifestyle.

బద్‌ ‌లా….!!

నాయిన పేరు చెప్పిండు
ఆ…బిడ్డను గెలిపించిండు

బ్రహ్మణ కులం కార్డు చూపిండు
ముల్లును ముల్లుతోనే వోడించిండు

బీజేపీ సిట్టింగ్‌ ‌ను మట్టి కరిపించిండు
‘దుబ్బాకదెబ్బ’ కు బదలా తీసిండు

ఇంట్లున్నామెను పిలిచిండు
రాజకీయ తోవ తొక్కించిండు

గులాబీ కండువా కప్పిండు
ఇగ ప్రచారం హోరెత్తించిండు

అన్నీ తానై చూసుకుండు
పీవీ పరువు నిలిపిండు

అపరమేధావి మాజీ ప్రధాని వారసత్వం!
చూపాలే గ్రాడ్యుయేట్ల పట్ల మానవత్వం!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్

Leave a Reply