Take a fresh look at your lifestyle.

భదాద్రిలో కన్నుల పండుగగా వైకుంఠ ఉత్తర ద్వారదర్శనం

వైకుంఠ రాముడిని చూసి తరించిన భక్తులు

భద్రాచలం, జనవరి 13 (ప్రజాతంత్ర ప్రతినిధి) : ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఉత్తర ద్వారదర్శనం గురువారం తెల్లవారుజామున కన్నులపండుగగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ ‌నిబంధనలు పకడ్బందిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయటంతో దేవస్థానం అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేసారు. భక్తులను అనుమతించ లేదు. కేవలం అర్చకులు, ఉన్నతాధికారులు, ఆలయ సిబ్బందితో నిరాడంబరంగానే ఉత్తరద్వార దర్శనం నిర్వహించారు. వేదపండితులు మంత్రోచ్ఛారణలు, ధూప, దీపాల నడుమ జయ జయ గంటలు మోగుతుండగా స్వామివారి దర్శనాన్ని చూసి తరించే ప్రతీ భక్తుడు జై శ్రీరామ్‌ ‌జై శ్రీరామ్‌ అం‌టూ తన్మయంతో వైకుంఠ రాముడి కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ఆ గడియలు ఆసన్నం అయ్యాయి. ఉదయం 5 గంటలు ఉత్తర ద్వారం తలుపులు తెరుచుకోగానే భక్తులు తమ ఆరాధ్య దైవమైన స్వామిని కనులారా దర్శించుకుని నిర్మలమైన మనస్సుతో పునీతులయ్యారు. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున ఉత్తరద్వారం గుండా గురుడ వాహనంపై శ్రీరామచంద్రుడు భక్తులకు శ్రీమహావిష్ణువు రూపంలో దర్శనం ఇచ్చారు. ముక్కోటి ఏకాదశి అంటేనే పరమ పవిత్రమైన రోజు కాడంతో పాటు దేవదేవునికి ఇష్టమైన రోజు.

ఉత్తర ద్వారంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకుంటే ఏకకాలంలో ముక్కోటి దేవతలను దర్శించుకున్నట్లే అని పురాణాలు చెప్తున్నాయి. ఈ తరుణంలో ఉత్తర ద్వారదర్శనంకు విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. వైకుంఠాన్ని తలపించేలా ఉత్తర ద్వారదర్శనం జరిగింది. ద్వారదర్శనం కోసం తెల్లవారుజామున 5 గంటలకు మంగళహారతులు, మేళతాళాల మధ్య, వేదపండితుల నడుమ ఉత్తర వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి.స్వామివారిపై పుష్పవర్షం పడుతుండగా గరుడ వాహనంపై స్వామివారి దర్శనం జరిగింది. ధూప దీప నైవేధ్యాల మధ్య సీతారామచంద్రస్వామి వారిని ఉత్తర ద్వారంలో దర్శించుకుని పునీతులయ్యారు. కోవిడ్‌ ‌ప్రభావం ఉండటంతో ఈ ఏడాది కేవలం అర్చకులు, వేదపండితులు, కొద్దిమంది ఉన్నతాధికారులు. భక్తులతోనే తెప్పోత్సవం, వైకుంఠ ఉత్తర ద్వారదర్శనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య, అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జీ సబ్‌కలెక్టర్‌ ‌వెంకటేశ్వర్లు, ఏఎస్పీ ఆకాంఁ్‌ ‌యాదవ్‌ , ‌పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌ ‌రాజ్‌, ‌తహశిల్దారు శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ఇం‌టిలిజెన్స్ ‌సిఐ హరిసింగ్‌, ‌దేవస్థానం ఇఓ శివాజీ, సిబ్బంది ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply