Take a fresh look at your lifestyle.

భదాద్రిలో కన్నుల పండువగా ఉత్తర ద్వారదర్శనం

వైకుంఠ రాముడిని చూసి తరించిన భక్తులు

ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఉత్తర ద్వారదర్శనం శుక్రవారం తెల్లవారుజామున వైభవంగా జరిగింది. కోవిడ్‌ ‌నిబంధనలు పాటిస్తూ నిడారంబంగానే ఉత్తరద్వార దర్శనం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, దూప, దీపాల నడుమ జయ జయ గంటలు మోగుతుండగా స్వామివారి దర్శనాన్ని చూసి తరించే ప్రతీ భక్తుడు జై శ్రీరామ్‌ ‌జై శ్రీరామ్‌ అం‌టూ తన్మయంతో వైకుంఠ రాముడి కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ఆ గడియలు రావడంతో భక్తులు తన్మయత్వంతో మునిగిపోయారు.

ఉదయం 5 గంటలు ఉత్తర ద్వారం తలుపులు తెరుచుకోగానే భక్తులు తమ ఆరాధ్య దైవమైన స్వామిని కనులారా దర్శించుకుని నిర్మలమైన మనస్సుతో పునీతులయ్యారు. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున ఉత్తరద్వారం గుండా గురుడ వాహనంపై శ్రీరామచంద్రుడు భక్తులకు శ్రీమహావిష్ణువు రూపంలో దర్శనం ఇచ్చారు. ముక్కోటి ఏకాదశి అంటేనే పరమ పవిత్రమైన రోజే కాక దేవదేవునికి ఇష్టమైన రోజు. ఉత్తర ద్వారంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకుంటే ఏకకాలంలో ముక్కోటి దేవతలను దర్శించుకున్నట్లే అని పురాణాలు చెప్తున్నాయి.

ఈ తరుణంలో ఉత్తర ద్వారదర్శనంకు విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. వైకుంఠాన్ని తలపించేలా ఉత్తర ద్వారదర్శనం జరిగింది. ద్వారదర్శనం కోసం తెల్లవారుజామున 5 గంటలకు మంగళహారతులు, మేళతాళాల మధ్య, వేదపండితుల నడుమ ఉత్తర వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. స్వామివారిపై పుష్పవర్షం పడుతుండగా గరుడ వాహనంపై స్వామివారి దర్శనం జరిగింది. కోవిడ్‌ ‌ప్రభావం ఉండటంతో ఈ ఏడాది కేవలం అర్చకులు,వేధపండితులు, కొద్దిమంది భక్తులతోనే తెప్పోత్సవం, వైకుంఠ ఉత్తర ద్వారదర్శనం నిర్వహించారు.

Leave a Reply