Take a fresh look at your lifestyle.

ఎన్నారై వివాహాల పట్ల జాగ్రత్తవహించాలి : ఐ.జీ స్వాతి లక్రా

Beware,NRI Marriages,IG Swati Lakra,Women's Safety
ఎన్నారై వివాహాలు, వేధింపులపై మహిళా భద్రతా విభాగం ఆద్వర్యంలో సదస్సు

వివాహ సంబంధిత అక్రమాలు, మహిళలపై వేధింపులకు పాల్పడే ఎన్నారై  కేసులను వేగంగా విచారించి నిందితులకు తగు శిక్ష పడేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మహిళా ఎన్ఆర్ఐ  సెల్ తో పాటు రాష్ట్రంలోని పలు మహిళా పోలీస్ స్టేషన్లలో 586 వైవాహిక సంబంధిత కేసులు నమోదయ్యాయని మహిళా భద్రతా విభాగం ఐ.జీ స్వాతి లక్రా వెల్లడించారు. ఎన్.ఆర్.ఐ వివాహాలు, మహిళలపై  వేధింపులు, వరకట్నం, మోసాలకు సంబంధించి ఎన్.ఆర్.ఐ కేసుల సత్వర పరిష్కారానికి గాను వివిధ శాఖల మధ్య అంతర్గత సహకారం, సమన్వయానికి మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నేడు కన్వర్జెన్స్ వర్క్ షాప్ జరిగింది. మహిళా భద్రతా విభాగం డీ.ఐ.జీ సుమతి, ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ వైజయంతి తదితరులు హాజరైన ఈ సదస్సులో స్వాతి లక్రా మాట్లాడుతూ 2019 జులై 17 న హైదరాబాద్ లో  ప్రారంభించిన  ప్రత్యేక ఎన్ఆర్ఐ సెల్ లోనే ఇప్పటివరకు 73 ఫిర్యాదులు అందగా వీటిలో 70 ఫిర్యాదులకు సంబంధించి కేసులు నమోదు చేశామని, వీటిలో 41 పెండింగ్ ట్రయల్స్ లో, 46 లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు. మరో 32 కేసులకు సంబంధించి నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఎన్.ఆర్. ఐ కేసులలో మరింత సమర్దవంతంగా విచారించేందుకు దర్యాప్తు అధికారులకు వెసులుబాటు వుండే విధంగా ఎస్.ఓ.పీలను రూపొందించామని స్వాతి లక్రా వివరించారు.

ఈ కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వ విదేశీ మంత్రిత్వ శాఖ, జాతీయ మహిళా కమీషన్, విదేశీ ఎంబసీలతో సమన్వయము చేసేందుకు తగు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ అనంతరం నమోదైన మొత్తం 574 ఎన్.ఆర్.ఐ కేసులలో అత్యధికంగా 248 కేసులు హైదరాబాద్ కమిషనరేట్ లో, 99 కేసులు రాచకొండ పరిధిలో, 99 సైబరాబాద్ పరిధిలో, వరంగల్ లో 42, కరీంనగర్ లో 21, నిజామాబాద్ లో 8 , నల్గొండ , సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో ఏడు కేసుల చొప్పున, మహబూబ్ నగర్ లో ఆరు, రామ గుండం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, జగిత్యాల జిల్లాల్లో  ఐదు కేసుల చొప్పున నమోదు అయ్యాయని వివరించారు.

ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ వైజయంతి మాట్లాడుతూ తెలంగాణా పోలీస్ శాఖ అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ వాళ్ళ సామాన్య ప్రజల్లో పోలీస్ లపై ఎలా నమ్మకం ఏర్పడిందో, ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు అనంతరం ప్రవాస భారతీయులు చేసే వివాహాల సంబంధిత మోసాల్లో బాధితుల్లో భరోసా ఏర్పడిందని అభిప్రాయపడ్డారు.

డీ.ఐ.జీ  సుమతి మాట్లాడుతూ ఎన్నారై కేసుల విషయం లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్నారై సెల్ బాధితులు, విచారణా  సంస్థల మధ్య వారధిలా పనిచేస్తుందని అన్నారు. ఈ సందర్బంగా  ఎన్నారై వివాహాల ఎంపిక లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్య పరిచే ఆడియోను,కరపత్రంను  విడుదల చేశారు. పలు ఎన్.ఆర్.ఐ కేసులను ఎన్నారై సెల్  ఏవిధంగా పరిష్కరించిoది, కాంప్రమైస్ చేసిన కొన్ని కేసులను ఈ వర్కషాప్ లో వివరించిన ఉమెన్ సేఫ్టీ విభాగం అధికారులు వివరించారు.

Tags: Beware,NRI Marriages,IG Swati Lakra,Women’s Safety

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply