Take a fresh look at your lifestyle.

వర్షాకాలం.. జర జాగ్రత్త ..!

కొరోనా ప్రభావం ఎంత..? శాస్త్రవేత్తల పరిశోధనలు
కొన్ని నెలల క్రితం, కొరోనావైరస్‌ ‌మహమ్మారి భారతదేశంలో ఇంకా వ్యాప్తి చెందుతున్నప్పుడు  వేసవి నెలల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రత వైరస్‌  ‌శక్తిని బలహీనపరుస్తుందని, కొరోనా వ్యాప్తిని అరికడుతుంది భావించారు. అది జరగలేదు. ఇప్పుడు వర్షాకాలం కొనసాగుతున్నది. ఈ కాలం కొరోనా వైరస్‌ ‌పై చూపే ప్రభావం చర్చనీయాంశంగా వుంది.

మలేరియా, డెంగ్యూ,చికున్‌గున్యా వంటి అనేక వెక్టర్‌ ‌బోర్న్ ‌వ్యాధులు వర్షాకాలం సహజం.. ప్రస్తుత వానాకాలం కొరోనా వైరస్‌ ‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే చర్చ నడుస్తున్నది. ప్రస్తుత కొరోనా  కొత్త వైరస్‌ ‌కనుక వర్షం వైరస్‌ ‌ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తుందో శాస్త్రవేత్తలకు ఇంకా తెలియదు. వర్షాకాలంలో ఇలాంటి ఇతర వైరస్లు ఎలా ప్రవర్తించే అవకాశం వుంది అనే ఆధారాలు శాస్త్రజ్ఞులు  వెతకడం మొదలు పెట్టారు.   అధిక వర్షం తన ప్రవాహంతో  డెంగ్యూ విషయంలో, కొన్ని అధ్యయనాల ప్రకారం దోమ పునరుత్పత్తి చక్రానికి విఘాతం కలిగిస్తూ.. సంతానోత్పత్తి ప్రదేశాలను నాశనం చేస్తుంది అని తెలుసున్నది. అయితే ప్రస్తుత వైరస్‌ ‌కోవిడ్‌ -19 ‌మనిషికి కలిగించేది  శ్వాసకోశ వ్యాధి.  మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా కన్నా భిన్నమైనది. కొరోనా వైరస్‌ ‌ను సీజన్‌ ‌ప్రకారం అంచనా వేయడం చాలా కష్టం. ఉష్ణోగ్రత లేదా వర్షపాతం లేదా ఇంటి లోపల ఉండడం వంటి ఏ ఒక్క అంశం కూడా నిర్ణయాత్మక ప్రభావాన్ని వైరస్‌ ‌పై చూపటం లేదు. సూర్యరశ్మి, ప్రజలలో విటమిన్‌ ‌డి స్థాయి వంటి అనేక ఇతర అంశాలు వైరస్‌ ‌పై  కీలక పాత్ర పోషిస్తున్నాయి. మానవ సంబంధానికి వ్యతిరేకంగా అంటే గాలి ద్వారా వైరస్‌ ‌వ్యాప్తి ఎంత మేర  జరుగుతుందో స్పష్టంగా లేదు. వర్షాకాలంలో కొరోనా వైరస్‌ ఇం‌డోర్‌ ‌లో ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదు ఈ విషయాలు అన్నింటిపై శాస్త్రవేత్తలు  పరిశోధిస్తున్నారు.

Leave a Reply