Take a fresh look at your lifestyle.

బీవరేజెస్‌ ‌కంపనీ హామాలీల సమ్మె

కూలీరేట్లు పెంచాలని డిమాండ్‌
‌కాకినాడ,డిసెంబర్‌5 : ‌బేవరేజెస్‌ ‌హమాలీల కూలి రేట్ల పెంపు సమస్యను పరిష్కరించకపోతే ఈ నెల 10వ తేదీ నుండి సమ్మెలోకి వెళతామని హమాలి వర్కర్స్ ‌యూనియన్‌ అధ్యక్షుడు ఎన్‌వివి.సత్యనారాయణ అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి ఎగుమతి కూలి రేట్లు వెంటనే పెంచాలని కోరుతూ … సోమవారం స్థానిక ఐఎంఎఫ్‌ఎల్‌ ‌డిపో వద్ద యూనియన్‌ ‌ప్రధాన కార్యదర్శి నారపాటి వీరా అప్పారావు ఆధ్వర్యంలో 7వ రోజు ఒంటి కాళ్లపై నిలుచొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా హమాలీ వర్కర్స్ ‌యూనియన్‌ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ … ఏళ్ల తరబడి ఐఎంఎఫ్‌ఎల్‌ ‌డిపోలలో ఎగుమతి దిగుమతి పనులు చేస్తూ రాష్టాన్రికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న బేవరేజ్‌ ‌హమాలీలకు మాత్రం ఎగుమతి కూలి రేట్లు పెంచి ఇచ్చే విషయంలో సిగ్మా యాజమాన్యం తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు.

తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 2021 సిగ్మా యాజమాన్యం ఎగుమతి కూలీ రేట్లు పెంచి ఇవ్వాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో సమ్మె చేపడతామని హెచ్చరించారు. ప్రధానంగా డిపోల వద్ద కార్మికులకు కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆదాయం అధికంగా సమకూర్చే వనరుగా ఉన్న బేవరేజెస్‌ ‌హమాలీలకు కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం దారుణమని అన్నారు. తక్షణం ఉన్నత అధికారులు స్పందించి హమాలీల న్యాయమైన డిమాండ్లను తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో హమాలీ వర్కర్స్ ‌యూనియన్‌ ఉపాధ్యక్షులు బుర్రె ఆదినారాయణ, పప్పల సత్తిబాబు, వెన్నెల గోవిందు, నాలం తిరుమలరావు, నక్క ఈశ్వరరావు, ఏ.అర్జున్‌, ‌బుర్రె శ్రీనివాస్‌, ‌వీర అర్జున్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో రామచంద్ర ఇంటిపై దాడి
మండిపడ్డ జనసేన నేత నాదెండ్ల మనోహర్‌
అమరావతి,డిసెంబర్‌5 : ‌వైసీపీ ప్రభుత్వ తీరుపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ ‌నాదెండ్ల మనోహర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరులో రామచంద్రయాదవ్‌ ఇం‌టిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రైతుసభ నిర్వహించా లనుకోవడమే రామచంద్ర యాదవ్‌ ‌చేసిన నేరమా? అని ప్రశ్నించారు.

ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తున్నారన్న మనోహర్‌.. ఎదిరించి మాట్లాడితే ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇలా దాడులకు పాల్పడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు ? అని ప్రశ్నించారు. ప్రశ్నించే వారు లేకుండా చేసేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని, అందులో భాగంగానే ఇలా దాడులకు తెగబడుతోంది తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply