తూర్పు సరిహద్దులలో అత్యంత కీలకమిన లడ్డఖ్ ను తన చెప్పుచేతుల్లో పెట్టుకుంటే భారత్ మీద పై చేయి సాధించవచ్చనే కోరిక ఎప్పట్నుంచో చైనా మదిలో ఉన్నదే. ఇక్కడ గల గాల్వాన్ నదికి అభిముఖంగా భారత్ తన సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. లడ్డాఖ్ ఈశాన్య భాగమైన సబ్ సెక్టార్ నార్త్ లేదా దౌలత్ బేగ్ ఓల్డి భారత ఆధీనంలో ఉన్న భూభాగాలు. ఇక్కడ తన సైనికపోస్టులను బలోపేతం చేయాలనుకుంటున్న ప్రతిసారి చైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది.ఇదేప్రాంతంలో ఎల్ ఏసికి అత్యంత సమీపంలోనే పాకిస్తాన్ ఆర్థిక కారిదార్ కోసం చైనా వ్యూహాత్మకంగా ఒక పెద్ద రహదారి నిర్మాణం చేపట్టడం గమనార్హం.
సరిహద్దు వివాదాలు భారతదేశానికి సమస్యాత్మకంగా పరిణమించాయి. ఇటీవలే నేపాల్ తో సరిహద్దు సమస్యలు ఒక కొలిక్కి రాకముందే దీర్ఘకాలికంగా చైనాతో ఉన్న సరిహద్దు వివాద సమస్య ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసి ఇరు దేశాలలో యుద్ద వాతావరణం నెలకొంది.. ఏప్రిల్, మే నెలలలో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఉద్రిక్త వాతవరణానికి పరాకాష్ఠగా ఇప్పుడు ఏకంగా కాల్పులు ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం కరోనా వైరస్ వ్యాప్తి నుంచి అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా తలదించుకున్న చైనా కోవిడ్ విషయాన్ని పక్కదోవన పట్టించే భాగంలో గత నెలలో భారత-నేపాల్ సరిహద్దు వివాదంలో పరోక్షంగా నేపాల్ పక్షం వహించి, ఇప్పుడు ఏకంగా యుద్ద వాతవరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తోందనే విషయం స్పష్టమవుతోంది. భారత-చైనా సరిహద్దులో గత నెలలో ఉద్రిక్తత వాతావరణం నెలకొని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసి) వెంట కనీసం నాలుగు వేర్వేరు ప్రదేశాలలో ఘర్షణలు నమోదయ్యాయి. తూర్పు లడఖ్‌లో సరిహద్దు సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నంలో భారత్, చైనా గత కొన్ని వారాలుగా వరుస సైనిక స్థాయి చర్చలు జరిపాయి. ఇదేసమయంలో పిఎల్ఎ దళాలు నాలుగు చోట్ల చొరబడ్డాయి. మే ప్రారంభంలో, తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఎసి) వెంట చైనా దళాలు బలాన్ని పెంచుకోవడం ప్రారంభించాయి. టిబెటన్ పీఠభూమిపై ఒక సైనిక పాటవ కార్యక్రమంలో పాల్గొనే దళాలను పిఎల్ఎ సరిహద్దుకు దగ్గరగా ఉన్న స్థానాలకు మళ్ళించడం జరిగింది. ఇందులో భారీ వాహనాలు, ట్యాంకులు, ఫిరంగి మరియు 6000 మంది సైనికులు ఉన్నారు.పెట్రోల్ పాయింట్లు 14 (గాల్వన్‌లో), 15, 17 (గోగ్రా) మరియు ఫింగర్ 4 (పాంగోంగ్ త్సో) వద్ద పిఎల్ఎ సైనికులు భారతీయ భూభాగంలోకి చొరబడ్డారు.గాల్వన్ వద్ద భారతీయ సైన్యాలు వంతెన సహిత రహదారిని నిర్మించడం పై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. పాంగోంగ్ వద్ద ఫింగర్ 4 దాటి భారత గస్తీదళాన్ని ఆపడానికి, పిఎల్ఎ తన దళాలను సమాయత్త పరచింది.ఇటీవలికాలంలోనే గల్వాన్ మరియు పాంగోంగ్ వద్ద కనీసం రెండు హింసాత్మక ఘర్షణలు జరిగాయి ఇరు పక్షాలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకొవడంతో చాలా మంది సైనికులు గాయపడ్డారు. చైనాతో సరిహద్దు వివాదాలు భారతదేశానికి కొత్తేమీ కాదు, అయితే ఇటీవలి కాలంలో ఈ వివాదాలు ముదిరి పాకానా పడ్డాయి. తూర్పు లడఖ్ ప్రాంతంలోని పాంగాంగ్ సరస్సు, గాల్వాన్ లోయ విషయం మీద దశాబ్దాలుగా వివాదాలు నడుస్తున్నాయి. నియంత్రణారేఖ వెంబడ గల దౌలత్ ఓల్డి వద్ద భారత్ ఒక రోడ్డు నిర్మించడం సహజంగానే చైనాకు మొదటి నుంచి ఇష్టం లేదు. ఈ రోడ్డు ద్వారా సైనికులను, ఆయుధాలను సత్వరమే రవాణా చేసే వెసులుబాటు ఇండియాకు లభించడంతో చైనా తన దుందుడుకు చర్యలు ప్రారంభించింది. ఒకపక్క గాల్వాన్ లోయ అంశం మీద చర్చలు జరుపుతూనే చైనా ఈ రకమైన కవ్వింపు చర్యలకు పాల్పడడం ఆ దేశ ద్వంద్వవైఖరికి అద్దం పడుతోంది.
చరిత్ర ఏం చెబుతోంది?
బ్రిటీష్ కాన్సులేట్ జనరల్ మాకార్ట్నీ సూచనలపై 1899 లో బ్రిటన్ సవరించిన సరిహద్దును ప్రతిపాదించింది. ఈ సరిహద్దు భారతదేశంలో లక్తాంగ్ శ్రేణికి దక్షిణంగా ఉన్న లింగ్జీ టాంగ్ మైదానాలను మరియు లక్సాంగ్ శ్రేణికి ఉత్తరాన ఉన్న అక్సాయ్ చిన్ను చైనాలో ఉంచారు. అనేక కారణాల వల్ల కరాకోరం పర్వతాల వెంబడి గల ఈ సరిహద్దు బ్రిటిష్ అధికారులు ప్రతిపాదించారు. కరాకోరం పర్వతాలు సహజ సరిహద్దుగా ఏర్పడ్డాయి. ఇవి ఇది టారిమ్ నది వాటర్‌షెడ్‌ను చైనా నియంత్రణలో ఉంచుతూ, బ్రిటిష్ సరిహద్దులను సింధు నది వాటర్‌షెడ్ వరకు ఏర్పాటు చేస్తుంది. 1899 లో సర్ క్లాడ్ మెక్‌డొనాల్డ్ రాసిన నోట్లో బ్రిటిష్ వారు ఈ పంక్తిని మాకార్ట్నీ-మెక్‌డొనాల్డ్ లైన్ అని పిలుస్తారు. అయితే అప్పటి క్వింగ్ ప్రభుత్వం ఈ నోటుపై స్పందించలేదు. 1908 వరకు బ్రిటీష్ వారు ఈ రేఖనే సరిహద్దుగా గుర్తించారు. 1927 లో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం జాన్సన్ రేఖను కరాకోరం పరిధిలో మరింత దక్షిణాన ఉన్న ఒక రేఖకు అనుకూలంగా వదిలివేయడంతో ఈ మార్గం మళ్లీ సర్దుబాటు చేయబడింది. అయినప్పటికీ, పటాలు నవీకరించబడలేదు మరియు ఇప్పటికీ జాన్సన్ లైన్‌ను చూపించాయి. 1917-1933 మధ్య పెకింగ్లో చైనా ప్రభుత్వం ప్రచురించిన ‘‘పోస్టల్ అట్లాస్ ఆఫ్ చైనా’’లో కున్లూన్ పర్వ తాల వెమంబడి జాన్సన్ రేఖ ప్రకారం అక్సాయ్ చిన్ ను సరిహ ద్దుగా చూపి ంచింది. అయితే 1925 లో ప్రచురించబడిన ‘‘పెకింగ్ యూనివర్శిటీ అట్లాస్’’లో అక్సాయ్ చిన్ ను భారతదేశ భూభాగంగా చూపించడం విశేషం. 1947 లో స్వాతంత్య్ర సమయంలో అక్సాయ్ చిన్ భారత దేశంలో భాగం. స్వాతంత్య్రం పొందిన తరువాత భారత ప్రభుత్వం పశ్చిమాన తన అధికారిక సరిహద్దులను నిర్ణయిం చింది, ఇందులో అక్సాయ్ చిన్ కూడా ఉంది.ఇది అర్డాగ్-జాన్సన్ రేఖను పోలి ఉంటుంది. సరిహద్దును నిర్వచించడానికి భారత దేశానికి గల ఆధారం ‘‘ప్రధానంగా దీర్ఘకాలిక వినియోగం’’. 1954లో ప్రధాని నెహ్రూ అన్ని ప్రాంతాలలో ఖచ్చితమైన సరిహద్దులను చూపిం చడానికి భారతదేశ పటాలను సవరించాలని ఒక ఆదేశలు జారీచేశాడు. అప్పటివరకు, జాన్సన్ లైన్ ఆధా1846లోనే బ్రిటీష్ ఇండియా జమ్ముకాశ్మీర్ తన భూభాగంలో కలుపు కొంది. ఇప్పుడు సమ స్యాత్మకంగా పరిణమించిన గుర్తింపబడని ప్రాంతాలను ఇరుదేశాల సరిహద్దుగా గుర్తించాలన్న బ్రిటీష్ ఇండియా ప్రతి పాదనలను చైనా అంగీ కరించలేదు. తన ప్రాతినిథ్యం లేని మెక్ మోహన్ రేఖను సహజంగానే చైనా అంగీకరించలేదు. చివరకు ఇరుపక్షాలు వాస్త్వాధీన రేఖను అంగీకరించినప్పటికిని ఘర్షణలు కొనసాగడం విషాధం. తూర్పు లడ్డాఖ్ ను, ఇరుపక్షాల ఆధీనంలో ఉన్న గుర్తించబడని ఇతర ప్రాంతాలను సరిహద్దులుగా గుర్తిస్తే తాము మెక్ మోహన్ రేఖను అంగీకరించేందుకు సిద్దంగా ఉన్నట్టు 1959 లో నాటి చైనా ప్రధాని ప్రతిపాదించాడు. అయితే భారత్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. చివరకు సరిహద్దు వివాద ప్రాంతాలను వాస్తవాధీన రేఖగా ఇరుదేశాలు అంగీకరించాయి. రంగా అక్సాయ్ చిన్ సెక్టార్‌లోని సరిహద్దు ‘‘గుర్తించబడనిది’’ గా వర్ణించబడింది.
అసలు కారణం:
తూర్పు సరిహద్దులలో అత్యంత కీలకమిన లడ్డఖ్ ను తన చెప్పుచేతుల్లో పెట్టుకుంటే భారత్ మీద పై చేయి సాధించవచ్చనే కోరిక ఎప్పట్నుంచో చైనా మదిలో ఉన్నదే. ఇక్కడ గల గాల్వాన్ నదికి అభిముఖంగా భారత్ తన సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. లడ్డాఖ్ ఈశాన్య భాగమైన సబ్ సెక్టార్ నార్త్ లేదా దౌలత్ బేగ్ ఓల్డి భారత ఆధీనంలో ఉన్న భూభాగాలు. ఇక్కడ తన సైనికపోస్టులను బలోపేతం చేయాలనుకుంటున్న ప్రతిసారి చైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది.ఇదేప్రాంతంలో ఎల్ ఏసి కి అత్యంత సమీపంలోనే పాకిస్తాన్ ఆర్థిక కారిదార్ కోసం చైనా వ్యూహాత్మకంగా ఒక పెద్ద రహదారి నిర్మాణం చేపట్టడం గమనార్హం. అంతెకాదు సియాచిన్ గ్లేషియర్ మీద సైతం కన్నేసి అక్కడ గల భారత దళాలను తరిమేస్తే భవిష్యత్తులో కాశ్మీర్ ను ఆక్రమించవచ్చనేది చైనా ఎత్తుగడ. నిజానికి కాశ్మీర్ మీద చైనా లక్ష్యం ఈనాటిది కాదు.కాశ్మీర్ విషయంలో తలదూర్చి భారత్ ను ఇబ్బంది పెట్టే దిశగా చైనా పావులు కదుపుతోంది. పిఓకే లోని గిల్గిట్ లో గల హుజా ప్రాంతం తనదేనని ప్రకటించుకుని చివరకు పాకిస్తాన్ కు ఇచ్చివేసింది.
ఈ ఘర్షణలు కొత్తవి కావు:
భారతదేశం, చైనాలు 1962లో సరిహద్దు ఆధిపత్య యుద్ధం చేశాయి. రెండు దశాబ్దాల పాటు చర్చలు జరిగినప్పటికీ తమ సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోలేక పోయాయి. ఇరుదేశల భద్రతదళలూ వేలాది కిలోమీటర్ల భూభాగం గల వాస్తవ సరిహద్దు అని గుర్తించబడని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సమాంతరంగా నడవడం ఉద్రిక్తలకు దారితీసే ముఖ్యమైన అంశం. నిజానికి భారత-చైనా ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసే చర్యలు చేసేది చైనా వైపు నుంచి మొదలు కావడం గమనించదగిన విషయం. భారత-చైనా దేశాల మధ్య ప్రాచీనకాలం నుంచి సానుకూల సంబంధాలున్నప్పటికినీ, ఆధునిక కాలంలో ముసుగులో గుద్దులాట దోరణులనే రెండు దేశాలు అనుసరిస్తున్నాయి. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్, నేపాల్ వంటి దేశాలకు వత్తాసు పలకడం.., శ్రీలంక, మాల్దీవుల వంటి చిన్న దేశాలలో సైతం పెట్టుబడులు పెట్టి పరోక్షంగా భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని కలిగించడం ప్రస్తుతం చైనా అనుసరిస్తున్న వ్యూహాత్మక వ్యతిరేకవాదం.
ప్రస్తుతకాలంలో ఇండో-సినో సంబంధాలు సాంస్కృతిక రాజకియార్థిక విషయాల కంటే సరిహద్దు సంబంధిత అంశాల మీదనే తీవ్ర ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. రెండు దేశాల మధ్య సాపేక్షంగా వేరు చేయబడిన చిన్న,పెద్ద, భూభాగాలపై సార్వభౌమాధికారం పొందటం కోసం పోటి ఏర్పడింది.. అక్సాయ్ చిన్ భారత కేంద్ర భూభాగం లడఖ్, చైనా స్వయంప్రతిపత్త ప్రాంతమైన జిన్జియాంగ్ల మధ్య ఉంది. ఇది జిన్జియాంగ్-టిబెట్ హైవే దాటిన వాస్తవంగా జనావాసాలు లేని ఎత్తైన బంజర భూమి. ఇతర వివాదాస్పద భూభాగం మెక్ మోహోన్ రేఖకు దక్షిణంగా ఉంది. దీనిని గతంలో నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అని పిలిచేవారు, ఇప్పుడు దీనిని అరుణాచల్ ప్రదేశ్ అని పిలుస్తారు. బ్రిటిష్ ఇండియా ,టిబెట్ మధ్య 1914లో జరిగిన సిమ్లా ఒప్పందంలో భాగంగా మెక్ మోహోన్ రేఖను ప్రతిపాదించారు. ఈ ఒప్పందంలో చైనాకు ఎటువంటి సంబందంఇ ఆపాదించబడలేదు. ఈ రెండు ప్రాంతాలలో ఆధిపత్యం కోసమే 1962 చైనా-ఇండియన్ యుద్ధం జరిగింది. ఈ ప్రాంత సంబంధిత వివాదాలను పరిష్కరించడానికి 1996 లో ఒక ఒప్పందం జరిగింది. ‘‘విశ్వాసం పెంపొందించే చర్యలు’’, పరస్పరం అంగీకరించబడిన వాస్తవ నియంత్రణ రేఖ ప్రధానాంశాలుగా ఈ ఒప్పందంలో చేర్చబడ్డాయి. 2006 లో భారతదేశంలోని చైనా రాయబారి అరుణాచల్ ప్రదేశ్ అంతా చైనా భూభాగమేనని ప్రకటించడం మళ్ళి ఉద్రిక్తతలను రెచ్చగొట్టినట్టైంది. సరిహద్దులో అదనపు సైనిక దళాలను మోహరిస్తామని భారతదేశం 2009 లో ప్రకటించింది. అంతేకాకుండా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి చైనా ‘‘వన్ ఇండియా’’ విధానాన్ని అంగీకరించాలని 2014 లో భారత్ ప్రతిపాదించింది.
1950 లలో చైనా జిన్జియాంగ్,పశ్చిమ టిబెట్లను కలిపే 1,200 కిలోమీటర్ల రహదారిని నిర్మించింది. వీటిలో 179 కిలోమీటర్లు జాన్సన్ రేఖకు దక్షిణంగా భారతదేశం పేర్కొన్న అక్సాయ్ చిన్ ప్రాంతం గుండా వెళ్తుంది. అక్సాయ్ చిన్ చైనా నుండి సులభంగా చేరుకోవచ్చు. కాని కరాకోరం పర్వత శ్రేణి యొక్క దక్షిణ భాగంలో ఉన్న భారతీయులకు అక్సాయ్ చిన్కు ప్రవేశించడంలో ఒక సమస్యగా మరింది. 1957 వరకు భారతీయులు ఇక్కడి రహదారి ఉనికి గురించి తెలుసుకోలేదు. 1958 లో ప్రచురించబడిన చైనీస్ పటాలలో ఈ రహదారిని చూపించినప్పుడు ఈ రహాదారి గురించి తెలిసింది. నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ‘‘అక్సాయ్ చిన్ శతాబ్దాలుగా భారతదేశంలోని లడఖ్ ప్రాంతంలో భాగమని, ఈ ఉత్తర సరిహద్దుకు సంభందించి ఎవరితోనూ చర్చలు జరిపే ప్రసక్తే లేదని’’ ప్రకటించాడు. దీనికి వ్యతిరేకంగా చైనా మంత్రి చౌ ఎన్ లై ‘‘ అక్సాయ్ చిన్ ను చైనా ప్రాంతమని మెకార్టి-మెక్ డొనాల్డ్ రేఖను మాత్రమే తాము గౌరవిస్తామని, ప్రస్తుతం ఈ ప్రాంతం చైనా అధికారపరిధిలోనే ఉందన్న విషయం గమనించాలని’’ ప్రకటించడం మళ్ళీ వివాదానికి దారితీసింది. హిమాలయ పర్వత సానువుల్లోని సిక్కిం సరిహద్దులలో గల నాథూలా, చోలా కనుమ ప్రాంతంలో 1967లో జరిగిన సంఘటనలు మళ్ళీ భారత-చైనా సంబందాల మీద నీలి నీడలను కప్పాయి. 1967 సెప్టెంబర్ 11న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సైన్యాలు నాథూలా వద్ద భారతీయ సైనికపోస్టుల మీద దాడులు చేసింది. ఈ దాడి సెప్టెంబర్ 15 వరకు కొనసాగాయి. అదేసమయంలో అక్టోబర్ 1967లో చోలా వద్ద మరో కవ్వింపు చర్య జరిగింది. రెండో ఇండో-సినో యుద్ధంగా అభివర్ణించబడే ఈ పోరాటంలో ఈ రెండు ప్రాంతాలలో నిర్ణాయాత్మక విజయాన్ని సాధించిన భారత్ పిఎల్ఎ సైన్యాలను తరిమికొట్టాయి. 1986లో భారతదేశం అరుణాచల్ ప్రదేశ్ కు రాష్ట్ర హోద ఇచ్చింది. తీవ్ర అభ్యంతరం తెలిపిన చైనా తన దళాలను ఎల్ ఏసీ దాటించి, సుందోరంగ్ లోయలో ప్రవేశపెట్టి అక్కడ హెలిప్యాడ్ నిర్మాణాలను చెపట్టింది. భారత దళాలు కూడా ప్రతిఘటించడంతో తీవ్రతను పసిగట్టిన చైనా ఆ ప్రాంతం నుంచి తన సైన్యాలను ఉపసంహరించుకుంది. 2013 ఏప్రిల్ 15న 50 మంది చైనా సైనిక దళం రాకీ నాలా లోయలో దౌలత్ బేగ్ ఓల్డికి ఆగ్నేయంగా నాలుగు గుడారాల శిబిరాన్ని ఏర్పాటు చేసింది. మరుసటి రోజు ఈ శిబిరాన్ని కనుగొన్న ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు చైనీయులకు 300 మీటర్ల దూరంలో ఎనిమిది గుడారాలతో కూడిన సొంత స్థావరాన్ని ఏర్పాటు చేశారు. దీనిని అత్యంత తీవ్రమైన సరిహద్దు సంఘటనగా భావించిన భారత ప్రభుత్వం సంప్రదింపులతోనే సమస్యను పరిష్కరించడం విశేషం.
2017 జూన్ లో డోకాలా పాస్ సమీపంలో వివాదాస్పద భూభాగమైన డోక్లాంలో భారతదేశం మరియు చైనా మధ్య సైనిక వివాదం జరిగింది. 2017 జూన్ 16న, చైనీయులు డోక్లాం ప్రాంతానికి భారీ రహదారి నిర్మాణ సామగ్రిని తీసుకువచ్చి వివాదాస్పద ప్రాంతంలో రహదారిని నిర్మించడం ప్రారంభించారు. ఇక్కడ ఉన్న భారత దళాలను తొలగించే ఉద్దేశంతో అంతకుముందే చైనా డోకాలా వద్ద ఒక మురికి రహదారిని నిర్మించింది. వారు అప్పటి నుండి జంపేరి రిడ్జ్ వద్ద రాయల్ భూటాన్ ఆర్మీ పోస్ట్ వరకు పెట్రోలింగ్ నిర్వహించారు. రహదారి నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. 1988, 1998 లలో రెండు దేశాల మధ్య జరిగిన వ్రాతపూర్వక ఒప్పందాలను చైనీయులు ఉల్లంఘించారని భూటాన్ పేర్కొంది. మార్చి 1959 లోపు డోక్లాం ప్రాంతంలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఒప్పందాలు పేర్కొన్నాయి. 72 రోజుల ఉద్రిక్త పరిస్థితుల అనంతరం డోక్లాం ప్రాంతం నుంచి తమ సైన్యాలను ఉపసంహరించుకుంటున్నట్టు భారత్-చైనాలు ప్రకటించాయి.
ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వ్యాధి వ్యాప్తికి ప్రత్యక్షంగా కారణమై, ప్రపంచ దేశాల ముందు పరువుపోగొట్టుకున్న పొరొగుదేశం ప్రస్తుతం విషయాన్ని పక్కదారిపట్టించే ప్రయత్నాలలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. 1950 తరువాత నుంచి త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న చైనా శాస్త్ర సాంకేతిక రంగాలలో దూసుకుపోతోంది. అదేసమయంలో భారత్ సైతం ఆయా రంగాలలో సాధిస్తున్న విజయాలు చైనాను కలవరపెట్టాయి. అవకాశం వచ్చిన ప్రతిసారి తన సైనికపాటవాలతో సరిహద్దు వెంబడి ఉద్రిక్త వాతవరణాన్ని సృష్టించడం చైనాకు పరిపాటైంది. ప్రస్తుత పరిస్థితులలో యుద్ధాల సంభావ్యత శాతం కనిష్ఠంగానే ఉంటుంది. ఒకవేళ యుద్ధం జరిగినా ఏ దేశానికి విజయం లభించదు, విద్వంసంసాన్ని మాత్రమే లెక్కగ ట్టవచ్చు. ఆధునిక కాలంలో జరిగే యుద్ధాలకు నైతిక విజయాలంటూ ఉండవు, కేవలం ఘోర మానవ హననం తప్పా.
