హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : అగ్ని పథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆందోళనల్లో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి హరీష్ రావు డాక్టర్లను ఆదేశించారు. పోలీసుల కాల్పులు, లాఠీచార్జ్‌లో గాయపడిన 13 మందిని గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. ఈ నేపథ్యంలో వారికి మెరుగైన చికిత్సను అందించాలని గాంధీ హాస్పిటల్ వైద్యులకు మంత్రి హరీష్ రావు సూచించారు.