– కుక్కల దాడిపై స్పందించిన సీఎం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 3: హయత్‌నగర్‌లో మూగ బాలుడు ప్రేమ్‌చంద్‌పై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచిన ఘటనపై దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయ అధికారులతో మాట్లాడి బాలుడి పరిస్థితిపై ఆరా తీశారు. గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని, అతడికి అవసరమైన తక్షణ సాయం అందించాలని అదేశించారు. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్వయంగా బాలుడిని పరామర్శించటంతోపాటు ఆ కుటుంబాన్ని కూడా కలిసి వారి బాగోగులు పరిశీలించి, ప్రభుత్వపరంగా వారిని ఆదుకోవాలని కమిషనర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో జరిగిన సంఘటనలు, అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తక్షణం వీధి కుక్కల దాడుల కట్టడికి చర్యలు చేపట్టాలని అదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాలుడి చెవికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అతడి తల్లిదండ్రులు వెల్లడిరచారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



