Take a fresh look at your lifestyle.

మెరుగైన వైద్యం ప్రజల ‘‘ప్రాధమిక హక్కు’’ సర్వోన్నత న్యాయస్థానం

కోవిడ్‌ ‌కాల ంలో వైద్య సిబ్బంది సాధక బాధలు, కోవిడ్‌ ‌రోగుల అంతిమ సంస్కారాల విష యంలో హుం దాగా వ్యవరించ డం లేదనే అంశాన్ని సర్వోన్నత ధర్మాసనం స్వచ్ఛందంగా విచారించి వెల్లడించిన తీర్పులో మెరుగైన వైద్యం ప్రజల ప్రాధమిక హక్కుగా ధర్మాసనం స్పష్టం చేసింది. పౌరులకు లభిస్తున్న జీవించే హక్కు రాజ్యాంగ నిబంధన 21లో ఇది భాగమని తేల్చిచెప్పింది. ఈ చారిత్రక తీర్పును జస్టిస్‌ అశోక్‌ ‌భూషణ్‌, ‌జస్టిస్‌ ‌సుభాష్‌ ‌రెడ్డి, జస్టిస్‌ ఎమ్‌ ఆర్‌ ‌షా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. కొన్ని నెలలుగా కోవిడ్‌ ‌సేవల్లో తలమునకలై ఉన్న వైద్యలను పని వత్తిడి తగ్గించే పద్ధతిలో విధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఆ దిశగా మార్గదర్శకాలు ఇవ్వాలని సోలిసిటర్‌ ‌జనరల్‌ ‌తుషార్‌ ‌మెహతాని ధర్మాసనం ఆదేశించింది.

దేశ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సర్వోన్నత న్యాయస్థానం ఆశయాల దిశగా ప్రభుత్వాల చర్యలు ఉన్నాయా అనే అంశం మీద చర్చ జరిగినప్పుడే విషయానికి నిజమైన సార్ధకత ఉంటుంది. దేశంలో 75% పైగా జనాభాకు ఆరోగ్య భీమా లేదంటే అంతకన్నా బాధించే విషయం మరొకటి ఉండదు. ప్రధాన మంత్రి ఆరోగ్య భీమా యోజన వంటి పథకాలు ఉన్నా అమలులో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. భీమా ప్రయోజనాలు గురించి ప్రభుత్వాలు ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టకపోవడం మరో పెద్ద సమస్య. ఆరంభంలో ఉన్న ఆరాటం అమలులో లేదనేది నిప్పులాంటి నిజం. ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉన్నా అక్కడక్కడ జరిగే చెదురుమదురు అవాంఛనీయ సంఘటనల ఫలితంగా ప్రజల్లో ప్రభుత్వ వైద్యం మీద ఆసక్తి సన్నగిల్లిపోతుంది.

ప్రభుత్వ వైద్యం నిర్లక్ష్యం నుంచి బయట పడడానికి ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయించగా భీమా వంటి సౌకర్యాలు, ప్రభుత్వం అందించే వివిధ సౌకర్యాలు వర్తింపజేయడంలో వ్యవస్థలు ఆశించినంత స్థాయిలో సఫలం కాలేదు. నాణ్యమైన వైద్య సేవల్ని ప్రజలు పొందే హక్కు వారికి ఉంటుందని గతంలో ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన లక్ష్యాల దిశగా ప్రభుత్వ ప్రవేటు భాగస్వామ్యంలో వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేయాల్సి ఉంది. ప్రభుత్వ వైద్య వ్యవస్థల లోపాలు అధిగమిస్తూ అతిపెద్దదై భారతదేశంలో మానవ వనరుల్ని విస్తృత స్థాయిలో వాడుకుంటూ ప్రభుత్వేతర వైద్య వ్యవస్ధలనూ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని కోవిడ్‌ ‌కాలంలో రోగి వైద్యుల నిష్పత్తి స్పష్టం చేసింది.

ప్రైవేటు వైద్య వ్యవస్థలు మౌలిక సమస్యలు ఎదుర్కొంటుండగా ప్రభుత్వసబ్సిడీల చెల్లింపులో ఆలస్యం వలన దేశంలో వైద్య వ్యవస్థ కుదేలయింది. మానవ వనరుల్ని ప్రోది చేసుకోవాల్సిన విషయాన్ని కోవిడ్‌ ‌కష్టాలు స్పష్టం చేస్తున్నాయి. 70% పైగా జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, కోవిడ్‌ ‌కాలంలో ఎక్కువ కేసులున్న పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ దృష్టి పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల్ని విస్మరించారు. కేవలం కోవిడ్‌ ‌మీదే దృష్టి సారించడం వలన ఇతర ఆరోగ్య సేవలు తగ్గి అనేక మంది పలు ఇబ్బందులు పడ్డారు. గర్భిణులు, పిల్లలు, వృద్ధులు తీవ్ర స్థాయిలో ఇక్కట్ల పాలయ్యారు. వైద్యం విషయంలో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా వివిధ సేవలు అందించే ట్రస్టులు, కార్పొరేట్‌ ‌బాధ్యతగా సేవా సంస్థలు కూడా వైద్యసేవల్లో భాగస్వామ్యం అయితేనే అతిపెద్ద దేశంలో ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందుతుంది. . కోవిడ్‌ ‌కాలంలో రైలు బోగీలు, క్రీడా మైదానాలు, ఫంక్షన్‌ ‌హాళ్లు ఐసోలేషన్‌ ‌వార్డులుగా మార్చి కోవిడ్‌ ‌సేవలు అందించిన విషయం తెలిసిందే. ఆ సహకార స్పూర్తితో ముందుకెళితే అందరికీ మెరుగైన వైద్య సేవలు తప్పకుండా అందుతాయి.

Cats Nagfani, Kakatiya University of Journalism. 8074022846.
పిల్లుట్ల నాగఫణి,జర్నలిజం కాకతీయ విశ్వవిద్యాలయం. 8074022846.

Leave a Reply