Take a fresh look at your lifestyle.

ఎం‌జిఎంలో మెరుగైన వసతులు కల్పించాలి: నాయిని

ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు అయిన ఎంజిఎం ఆసుపత్రిలో వసతులను మెరుగుపర్చి కరోనా  బాధితులకు సరైన చికిత్స అందచేయాలని ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్‌ ‌బాధితులు రోజురోజుకు పెరిగి పోతున్నాయని వైరస్‌ ‌సోకిన వారందరికీ వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంగళవారం వరంగల్‌ ‌సమీక్ష సమావేశం నిర్వహించిన ఆరోగ్య శాఖ మంత్రి ఎంజిఎం ఆసుపత్రిలో ఉన్న వసతులను పరిశీలించాకపోవడం విచారకరమని ఆయన ఆరోపించారు. రూ.150కోట్లతో  కెఎంసిలో నిర్మాణం పూర్తయ్యి నిరుపయోగంగా ఉన్న భవనాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని, ఎంజిఎం దావఖనాలో పని చేస్తున్న డాక్టర్లపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులు డాక్టర్ల పై దాడులు చేయడం శోచనీయమని ఆయన అన్నారు. ఎంజీఎం దావఖాన లో రోగులకు సరైన వసతులు కల్పించడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఈ విషయాలన్ని బయటపడతాయని ఎక్కడో దూరంగా సమీక్ష సమావేశం నిర్వహించి చేతులు దులుపుకున్నారన్నారు.

వెంటిలేటర్లు ఆక్సిజన్‌ ‌తదితర వసతులను కల్పించాలని, నగరంలో ప్రైవేట్‌ ‌దవాఖానాల్లో దోపిడీ మొదలైందని దీనిని నివారించడానికి ప్రభుత్వ ఒక ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టకపోవడమే ఇందుకు కారణమని ఆయన అన్నారు. ప్రైవేట్‌ ‌దవాఖానకు ఏ వ్యక్తి వెళ్లిన చికిత్స అందించే విధంగా వైద్య ఆరోగ్య శాఖ వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా వైరస్‌ ‌విస్తరిస్తుందని ఇందుకు ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల్లో కొవిడ్‌-19 ‌పరీక్షలు నిర్వహించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని, ఇప్పటి వరకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా ఎంజిఎం దవాఖానను సందర్శించిన పాపాన పోలేదన్నారు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న డొల్లతనం బయటపడుతుందని, సరిపోను వైద్యులు లేక, వైద్య పరికరాలు లేక చాలా మందికి వైరస్‌ ‌సోకిన వారు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. డాక్టర్లకు సరైన రక్షణ కల్పించాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి సచివాలయం మీద ఉన్న ప్రేమ కరోనా వైరస్‌ ‌సోకి మరణిస్తున్న వారి పట్ల శ్రద్ధ లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దవాఖానాల్లో మౌళిక వసతుల కల్పనకు తగు చర్యలు చేపట్టాలని నాయిని రాజేందర్‌రెడ్డి సూచించారు. వెంటనే ఎంజిఎం ఆసుపత్రిని కరోనా ఆస్పత్రిగా మార్చాలని వారంలోగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ఎం‌బాడి రవీందర్‌, ‌పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్‌ ‌రావు, టిపిసిసి కార్యదర్శులు శ్రీనివాస్‌, ‌డాక్టర్‌ ‌పులి అనిల్‌ ‌కుమార్‌, ‌వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా మైనారిటీ సెల్‌ ‌చైర్మన్‌ ‌మహమ్మద్‌ అయూబ్‌, ‌గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌కాంగ్రెస్‌ ‌మైనారిటీ సెల్‌ ‌చైర్మన్‌ ‌మీర్జా అజీజుల్లాహ్‌ ‌బేగ్‌, ‌బ్లాక్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు బంక సంపత్‌ ‌యాదవ్‌, ‌గ్రేటర్‌ ‌కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యదర్శులు అంబేద్కర్‌ ‌రాజు, బొంత సారంగం, వరంగల్‌ ‌వెస్ట్ ‌యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌తోట పవన్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply