వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ప్రాణాలు తీసిన రూ.1000 పందెం మద్యం తాగే విషయంలో పందెం

January 11, 2020

Bet on drinking alcohol men died
మద్యం తాగే విషయంలో పందెం ,అరగంటలో ఫుల్‌బాటిల్‌ ‌తాగి సృహ కోల్పోయిన వ్యక్తి, ఇంటి వద్ద వొదిలేసి వెళ్లిపోయిన స్నేహితులు

‌ప్రజాతంత్ర, నిజామాబాద్‌: ‌కేవలం వెయ్యి రూపాయల కోసం పందెం కాసి అరగంటలో ఫుల్‌ ‌బాటిల్‌ ‌మద్యం తాగి ప్రాణాలు కోల్పోయాడో వ్యక్తి. తెలంగాణలోని నిజామాబాద్‌ ‌జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని దర్పల్లికి చెందిన కడమంచి కాశయ్య (40), స్నేహితులు దుర్గయ్య, సాయితో కలిసి గురువారం రాత్రి మద్యం తాగేందుకు గ్రామ శివారుకు వెళ్లారు. ఈ క్రమంలో తమలో మద్యం ఎక్కువగా తాగే సత్తా ఎవరికి ఉందన్న విషయంలో వారి మధ్య వాగ్వివాదం జరిగింది.

చివరికి, అతి తక్కువ సమయంలో ఎక్కువ మద్యం తాగిన వారికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని పందెం వేసుకున్నారు. ఈ క్రమంలో కాశయ్య అరగంటలో ఫుల్‌ ‌బాటిల్‌ ‌మందు తాగేశాడు. అయితే, ఆ వెంటనే సృహ కోల్పోవడంతో స్నేహితులు అతడిని ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. సృహ లేకుండా ఇంటికొచ్చిన భర్తను చూసిన భార్య.. ఎంతగా పలకరించినా చలనం లేకపోవడంతో వెంటనే గ్రామంలోని ఆర్‌ఎం‌పీ వద్దకు తీసుకెళ్లింది. పరీక్షించిన అతడు.. కాశయ్య అప్పటికే మృతి చెందినట్టు చెప్పాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags: bet drinking, kadamanchi kasaiah, darpalli