Take a fresh look at your lifestyle.

‘ఉన్నత’ ఉత్తమ ఉపాధ్యాయుడు!

అవును….విద్యార్థులకు చదువు చెప్పడం అధ్యాపకులకు సవాలే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో…వెనకటికి ఇప్పటికీ విద్యావిధానంలో బోలెడు మార్పులు చోటు చేసుకోవడం గమనిస్తున్నాం…యుధ్ధ వాతావరణం లో టీచర్లు పిల్లలకు పాఠాలు చెబుతున్నారని చెప్పాలి ..టీచర్లకు తరగతి గదిలో కూర్చోడానికి కుర్చీలు వుండవు…విద్యార్థుల ను పల్లెత్తు మాట అనొద్దు…అటు యాజమాన్యానికి ఇటు పిల్లల తల్లితండ్రులకు జవాబుదారీగా వుంటూ పాపం నల్లేరు మీద నడకలా వృత్తిలో కొనసాగుతున్న  ఉపాధ్యాయులకు కొరొన కోరి కష్టాలు తెచ్చి పెట్టింది. విద్యా సంవత్సరం ప్రారంభమైనా కోరొన కారణంగా ఇంకా బళ్ళు తెరవక పోవడంతో ఎక్కడి వారు అక్కడే విద్యార్థులు ఇండ్లకే పరిమితం అయ్యారు.చదువు నష్ట పోవద్దని ప్రభుత్వాలు ఆన్‌ ‌లైన్‌ ‌లో పిల్లలకు పాఠాలు చెప్పమని ఉపాధ్యాయులను సూచించారు.

వెస్ట్ ‌బెంగాల్‌ ‌లో వో ఉపాధ్యాయుడికి ఈ ఆన్‌ ‌లైన్‌ ‌బోధన విషమ పరిస్థితే తెచ్చి పెట్టింది.ఎక్కడో మారు మూల గ్రామీణ ప్రాంతం లో వున్న పాఠశాలలో పని చేస్తున్న ఈ సారు ఇంటర్నెట్‌ ‌సిగ్నల్స్ ‌సరిగ్గా అందని కారణంగా వేప చెట్టును ఆశ్రయించాల్సి వచ్చింది.చెట్టు ఎక్కితే గానీ సిగ్నల్స్ అం‌దేలా లేవు.చెట్టు పైనే చిన్న వెదురు బల్ల లాంటిది ఏర్పాటు చేసుకొని,ఉదయాన్నే టిఫిన్‌ ‌డబ్బా,నీళ్ళ కాన్‌,ఇం‌టర్నెట్‌ ‌కనెక్షన్‌ ‌తోయింటి నుంచి బయలుదేరి  వచ్చి చెట్టెక్కి కూర్చుంటాడు ఆ బడి పంతులు.  పిల్లలు ఆన్‌ ‌లైన్‌ ‌లో రాగానే పాఠాలు మొదలు పెడతాడు.ఇంతవరకు బాగానే వుంది… అంత ఎత్తయిన చెట్టు ఎక్కడమే వొక సవాలు అయితే…మరి అంత పెద్ద వేప చెట్టు ప్రకృతి ఇచ్చిన కానుక మనకు…పెద్ద గాలి వీచగానే ఆ చెట్టు  కొమ్మలు జడలు విప్పుకొని ఊగుతాయి.గాలి మాత్రమే కాదు.. ఎండా వానా కూడా ప్రకృతి లో భాగం…వీటన్నిటినీ తట్టుకొని ప్రకృతిని జయిస్తూ ఈ సారు చెట్టు పై కూర్చొని పిల్లలకు పాఠాలు బోధించాలి.వొక రకంగా ఇది యుధ్ధ వాతావరణాన్ని తలపిస్తున్న ది కదా…ఈ అనుభవం టీచర్లకు మాత్రం చాలా పాఠాలు నేర్పే అవకాశం వున్నది…

ఇక ముందు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే క్రమంలో చెట్లు ఎక్కించడం,గుట్టలు ,పర్వతాల పైకీ పాకించ డం,గాలిలొ పల్టీలు కొట్టించుకోవడం లాంటి అంశాలు వున్నా ఆశ్చర్య పొనవసరం లేదు…ఉపాధ్యాయులు కూడా సవాలుగా స్వీకరిస్తూ విధులను అతిక్రమించి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఇది వాస్తవం అనడానికి యీ బెంగాల్‌ ఉపాధ్యాయుడే నిదర్శనం.మరి ఈయనను ఉత్తమ ఉన్నత ఉపాధ్యాయుడు అనొచ్చు కదా…!
సేకరణ : వీణ
ఊహా చిత్రం : శృతి దేవులపల్లి

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy