వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

వృత్తిలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి

January 18, 2020

best results,profession,District SP Ramarajeshwari,mahabubnagar

మహబూబ్‌నగర్‌, ‌జనవరి 17, (ప్రజాతంత్ర విలేకరి) : సమాజంలో పోలీసు వృత్తికి ప్రత్యేక స్థానం ఉందని విధుల్లో భాగంగా వృత్తిలో అత్యు త్తమ ఫలితాలు సాధిం చాలని జిల్లా ఎస్పీ రాజేశ్వరి అన్నారు. శుక్రవారం పోలీస్‌ ‌కానిస్టే బుల్‌ ‌శిక్షణ కార్యక్ర మం ప్రారంభంలో ఎస్పీ మాట్లాడారు. మహబూబ్నగర్‌ ‌జిల్లా జడ్చర్ల పోలీస్‌ ‌ట్రైనింగ్‌ ‌సెంటర్లో ఏర్పాటు చేసిన నూతన పోలీస్‌ ‌కానిస్టేబుల్‌ ‌శిక్షణ ప్రారంభం ఎస్పీ మాట్లాడుతూ సమాజానికి అత్యున్నతమైన సేవలు అందించే అవకాశం ఉన్న పోలీసు శాఖను ప్రత్యేకంగా అభినందించారు. ఎంపికైన వారి శిక్షణ మొదటి రోజు నుండే నైపుణ్యాలను ప్రదర్శనలో పోటీ పడనున్నారు. పోలీస్‌ ‌వృత్తిలోని ప్రతి విజయం ఉమ్మడి సమిష్టి కృషి సమన్వయంతో సాధించుకోవచ్చు అన్నారు. అదనపు ఎస్పి ఎం.వెంకటేశ్వర్లు, పోలీస్‌ ‌ట్రైనింగ్‌ ‌సెంటర్‌ ‌వైస్‌ ‌ప్రిన్సిపాల్‌ ‌సాయి మనోహర్‌, ‌డిఎస్పి, ఇన్స్పెక్టర్లు  మల్లారెడ్డి, వీరస్వామి, దిలీప్‌ ‌రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Tags: best results,profession,District SP Ramarajeshwari,mahabubnagar